మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

సర్వాస్తి వాదం

బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన ప్రస్థానాన్ని రాశాడు .సర్వాస్తి వాదం అనేది అంతా దీని మీదే ఆధార పడింది .’’విభాష’’ ను ప్రమాణం గా తీసుకొన్న వారు వైభాషికులు అనే పేరుతొ పిలువ బడుతున్నారు .ఇప్పుడీ గ్రంధం చైనా భాష లో ఉన్న అను వాదం లో మాత్రమె దొరుకు తోంది .వైభాషి కులు మన దేశం లో కాశ్మీరం లో ఎక్కువ గా ఉండటం వల్ల  ‘’కాశ్మీర వై భాషికులు ‘’అనే పేరొచ్చింది .సర్వాస్తి వాదు లందరూ దీన్ని  ఆమోదించలేదని గ్రాహించాలి .కాశ్మీర్ లో వైభాషికులు కాని సర్వాస్తి వాదులున్నారు .కాశ్మీర్ వెలుపల ఉన్న వారిని బహిర్దేశీ యులని ,పాస్చాత్యులని ,అపరాన్తకులని అక్కడి  సర్వాస్తి  వాదులు అంటారు .ప్రసిద్ధ వైభాషి కులలో వసుమిత్రుడు ,ఘోషకుడు ,బుద్ధ దేవుడు ,ధర్మ త్రాత ,భదంతుడు ఉన్నారు .

కాశ్మీర వైభాషి కం ఆధారం గా వసు బంధుడు(క్రీ .శ నాల్గవ శతాబ్దం )అభి ధర్మం ను ఆరు వందల కారికలలో వివరించాడు  దీనికే ‘’అభి ధర్మ కోశం ‘’అని పేరు .దీనికి వ్యాఖ్యానాన్ని స్తిర మతి వసుమిత్రుడు ,దిగ్నాగుడు ,యశో మిత్రుడు వసు మిత్రుని తో బాటు రాశారు .అయితే ‘’కోశ కరక ‘’అనే దానిలో సంఘ భద్రుడు ఖండించాడు ..ఇందులో తమాషా ఏమిటంటే వసు బంధుడు వై భాశికుడు కాక పోవటం .అయినా అతని గ్రంధం సర్వాస్తి వాదు  లందరికి ఆదర ణీయం.

అయితే సర్వాస్తి వాదం లో ఉన్న ముఖ్య విశేషా లేమిటి ?ఇందులో అతీత అనాగత ధర్మాలు ,స్వంత లక్షణాలున్న పదార్ధాలు ,కూడా ద్రవ్యం యొక్క సత్తు లే ,అని త్త్రై యద్విక ధర్మాలు అస్తిత్వాన్ని ప్రతి పాదించే వారందరూ సర్వాస్తి వాదులే అని చెప్పాలి .బయటికి కనీ పించే రూపం ,లోపల జ్వాలించే జ్ఞానం రెండు స్వతంత్ర మైనవే అని అంటారు వీరు .అన్నీ ప్రతీత్యం నుంచి వచ్చినవే .ఏదైనా ఆలంబనం అంటే ఆధారం లేక పోతే విజ్ఞానం రాదు .అతీత అనాగత వస్తువు లేక పోతే విజ్ఞానం నిరాలంబం అని పించుకొనటమే కాక అసలు ఏర్పడదు కూడా .అతీతం లేక పోతే అనాగత ములో కర్మ ఫలించదు .విపక్వ కాలం లో విపాకం గా ఉన్న కారణం అతీత మైనదే .కనుక అనిత్యమైనది .అతీతం అనాగతం అయినదాన్నే రూపం అంటారు .

ఇంతకీ ధర్మం  అంటే –స్వంత లక్ష ణాన్ని ధారణ చేసేది అని అర్ధం .ధర్మాలు ‘’వ్యవ కీర్నాలు ‘’అంటే వాటిని ఏర వచ్చు ,విభజించ వచ్చు .ధర్మ ప్రవిచయం  ప్రజ్న అనే చిత్తం యొక్క ధర్మ లక్షణం .దీని వల్ల  నిర్వాణం వస్తుంది .ఇదే పరమ జ్ఞానం .ధర్మాల స్వ లక్షణాలు ,సామాన్య ఆక్షణం తెలుసు కొంటె నిర్వణ ప్రాప్తి కలుగు తుంది. ధర్మాలు రెండు రకాలు .మలిన మైనవి మలినం కానివి .ఆర్య మార్గాన్ని వదిలిన వన్నీ  మలినమైనవే .మిగిలినవి మలరహితాలు .రూపం చేత ఆక్రమింప బడనిది ,చుట్ట బడనిది ఆకాశం .ఇది పృధివి మొదలైన వాటి వలే భౌతికం తికం  .ప్రతి సంఖ్య అనేది ప్రజ్ఞా విశేషం .ఏ ధర్మాన్ని గూర్చి రాగ ద్వేషాదులు ప్రతి సంఖ్య వలన నిరో దింప బడుతుందో ,ఆ ధర్మం విషయం లోప్రతి సంఖ్యా నిరోధం జరుగును .ప్రతి సంఖ్య లేకుండా జరిగే నిరోధం అప్రతి సంఖ్యా నిరోధం అవుతుంది .ఏ ధర్మం విషయం లో ఇది జరుగుతుందో అది ఉత్పన్నం కాదు .వాటి గురించిన రాగాదులు ఇక ఎప్పటికీ కలగవు .ఈ మూడు అసంస్క్రుతులు .,అద్వ వినిర్ముక్తాలు అని పించుకొనే ధర్మాలు

ఆత్మ అంటే ప్రజ్ఞాప్తి .స్కంద పంచకమే ఆత్మ ,జీవుడు . ఇది అపరిణామ శాశ్వత పదార్ధం కాదు .సర్వాస్తి వాదులు శాశ్వత ధర్మాన్ని దేన్నీ కాని, ఒకే మూల కారణాన్ని కాని ఒప్పుకోరు .14 రకాల పరమాణువులు ఉన్నాయి అని వీరు అంటారు .అవే అయిదు విజ్ఞాన కేంద్రాలు ,అయిదు విషయాలు ,నాలుగు మహా భూతాలు .రూపాలలో కెల్లా సర్వ సూక్ష్మ మైనవి పరమాణువులు .అవి ద్రవ్యాలు కావు .వీటికే ‘’కలాపాలు అంటారు .ఉపచయం సంతతి ,జరత ,అనిత్యత ఇవే రూప కలాప లక్షణాలు .సర్వ సూక్ష్మ కాలం క్షణం అయి నట్లే ,ప్రతిఘ తో ఉన్న రూపాల సర్వసూక్ష్మ భాగము పరమాణువు అని పిలువ బడుతుంది .అది రూప పర్యంతం మాత్రమె .కాని శాశ్వతం కాదు .వినాశం చెందుతుంది .అంత  మాత్రం చేత నిత్యం కూడా కాదు .అని వీరి దార్శనిక భావన కొంచెం గందర గోళం గానే ఉంటుంది .అందుకే మరుగున పడి పోయిందేమో .

సశేషం

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.