మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8

 

                మరుగున పడిన మతాలు –మతా చార్యులు -8

ఫాచియా మతం

ఫాచియా అంటే రాజ శాసన సంప్రదాయం .ధర్మం తో నీతి తో శాసనలతో ప్రభుత్వం పని చేయాలనేది వీరి సిద్ధాంతం .ప్రభుత్వం ప్రపంచం లో ఉన్న వస్తు స్తితి మీద ఆధారపడాలి కాని పరంపరా గతం గా కాని అలౌకిక సూత్రాల పైన కాని ఆధార పడరాదన్నది వీరి విశ్వాసం .

క్రీ .పూ. 319-301 లో ‘’చి’’  రాష్ట్రాన్ని  పాలించిన హునువాన్ కాలంలో షేన్ టావో నుంచి ,చాలా ఏళ్ళు మంత్రిగా ఉన్న షాంగ్ యాంగ్ వరకు ఈ అఆలోచనలను పాటించి ప్రభుత్వాలను నడిపారు .అయితే ఈ ఆలోచనలను సువ్యవస్తితం వ్హేసిన వాడు మాత్రం హాన ఫై ట్జు .షేన్ టావో మాత్రం టావో మతం పై విశ్వాసం ఉన్న వాడు అన్ని వస్తువులు సమానమే అయినా కొన్ని కొన్నిటికి మాత్రమె పని చేస్తాయి కనుక వీటిలో ఏరుకోవటం వల్లసమగ్రత రాదు కొంత భాగం మాత్రమె లభిస్తుంది .పూర్ణత్వం  సిద్ధించదు .నిజానికి ఏ బోధ కూడా పూర్ణత్వాన్ని తెలుప లేదు .మంచి చెడు ,కర్తవ్యాకర్తావ్యాలు యదార్ధం కానప్పుడు జ్ఞానం అనేది వ్యర్ధమే అవుతుంది .జరాగాల్సింది ఎట్లాగో జరిగి పోతుంది  .పరిస్తితులకు అనుగుణం గా మారుతూ  కష్ట సుఖాలు కలగని పద్ధతిలో మనిషి ప్రవర్తించాలి .ధర్మా ధర్మాలను లెక్క చేయ కుండా ,ఉదాసీనం గా ఉంటూ అనుభావాలనుంది ఏదీ నేర్చుకోకుండా ,భవిష్యత్తు గూర్చి ఆలోచించక  జీవితాన్ని గడపాలి అని వీరి బోధ .షేన్ టావో ఇలాగే జీవించి నట్లు చువాంగ్ ట్జు గ్రంధం లో ఉంది

ప్రభుత్వ పాలనకు అధికారం, శక్తి మాత్రమెఅవసరం . మంచి గుణాలు ,జ్ఞానంకావు ధర్మాత్ములు ,జ్ఞానులు అణగి పడి  ఉండటానికి కారణం అధికారం, శక్తి లేక పోవటమే .ఈ రెండు ఉంటేనే వారికి ప్రాభవం వస్తుంది .అప్పుడే రాణిస్తారు .పాలించే వాడి భయం వల్లే రాజ శాసనాలు అమలౌతాయి .అతని పట్ల ప్రేమ వల్ల  కాదు పాలకుడి చేతిలో దండం ఉండాలి ,దండనా ఉండాలి కఠినం గా వ్యవహరించి నప్పుడే పాలన సత్ఫలితాల నిస్తుంది ఆ శక్తి లేని పాలకుడు నిరర్ధకం .

బాధ్యతలను బట్టి పదవుల్ని ఇవ్వాలి పదవులకు తగిన ఆచరణ వారి లో ఉండాలి అందరి ప్రాణాలను రక్షించే లేక తీసి వేసే సర్వోత్కృష్ట అధికారం రాజ్య పాలకుడికి ఉండాలి .పాలన ను గుప్పిట్లో ఉంచుకోవట మే (షు)రాజ తంత్రం లో ముఖ్యం .రాజు  దగ్గర పని చేసే ఉద్యోగుల ‘’ప్రతి కృతులే ‘’శాసనాలు .’’శాసనాన్ని అనుసరించిన వారికి బహుమానాలు ఉల్లంఘించిన వారికి శిక్ష ‘’అనే అభిపాయం ప్రాజల మనస్సులలో గాఢం గా నాట బడాలి .శాసనాలు (ఫా) లేక పోతే సంక్షోభమే .అని షాంగ్ యాంగ్ చెప్పాడు .

‘’మానవుని లో స్వార్ధం సహజం కనుక దండమే దశ గుణంభవేత్.’’పారలౌకికం అయిన దేదైనా ప్రమాణం కాదు .శాసనం ,పాలకుల ఆజ్ఞా వారి ఇచ్చ మాత్రామే ప్రమాణం. రాజ శాసనాలన్ని చండ ప్రచండం గా ఉండాలి ఆషా మాషీ గా ఉండ  రాదు’’ అని ఫాచియా సిద్ధాంతం .’’రాజును, తలిదండ్రులను సేవిన్చాటా నికే మానవుడు పుట్టాడు .శాసనాల గురించి తెలుసుకోవటం పాలన గూర్చి చర్చిన్చటమే పురుషార్ధం ‘’అని హాన ఫైత్జు అన్నాడు .నీతి, దయల కంటే శాసనం ,దండం ముఖ్యం . వీటి  వల్లనే అధిక విలువ ,ఉపయోగం కలుగుతాయి .

‘’సోమరి పోతులైన సాదు సన్యాసుల్ని వ్యాపారుల్ని పండితుల్ని దార్శకుల్ని ‘’తన్ని’’వాళ్ళతో వ్యవసాయం చేయించాలి ..బీదల పోషణ ,దయా ధర్మాలు బోధించే వారికీ ఇదే గతి పట్టాలి .శాసనాలకు వ్యతి రేక మైన గ్రంధాలు ,దర్శనాలు లేకుండా చెయ్యాలి .కస్ట పడి మిత వ్యయం చేస్తే ఆహారానికి లోపం ఉండదు ఇలా చేయని వాడికే దరిద్రం వస్తుంది. వాడి మీద దయ చూప కూడదు .నీతి ,సత్యం, రుజు వర్తనం, దయ రాజ తంత్రం లో పనికి రానే రావు అవి అతని డిక్షనరీ లో ఉండకూడని పదాలు .దేవుడు దెయ్యం పూర్వా చారాలు అని పట్టుకొని వేళ్ళాడకుండా ప్రస్తుత పరిస్తితులను బట్టి రాజు పరి పాలించాలి .ఏ ప్రభువుకైనా ప్రపంచానికో లేక కనీసం  చైనా కో చక్ర వర్తి అవటం అనేది  ఆదర్శం  గా ఉండాలి .ఏ పనిలోనైనా నిబద్ధత  ఉండాలి ‘’అని షాంగ్ యాంగ్ రాజ తంత్రం గురించి చెప్పి అక్షరాలా తానూ ఆచరించి చూపించాడు .హాన్  ఫైత్జు దాదాపు దీన్ని అంతటిని అంగీకరించాడు కాని ఇతనిలో కన్ఫ్యూసియాస్ అనుచరుడైన హామాన్ ట్జు ప్రభావం టావో ప్రభావం ఉన్నట్లు కనీ పిస్తాయి

ఈ ఫాచియా సిద్ధాంతాలను ,పద్ధతుల్ని చిన్ రాష్ట్రం లో అమలు చేసి చైనా దేశాన్ని ఒకే చక్ర వర్తి పాలన కిందకు తెచ్చాడు .ఇదంతా క్రీ.పూ.221లో జరిగింది అంతకు ముందెప్పుడూ .కన్ ఫ్యూసియాస్ వల్ల కాని టావో దర్శనం వల్ల  కాని చైనా ఎప్పుడూ ఏక చక్ర వర్తి పాలన కిందకు రాలేదు .నిరంకుశ సామ్రాజ్యాన్ని చండ శాసనాలను అమలు పరచాడు .చిన్ రాజ వంశం పదిహేనేళ్ళు పాలించింది తరువాత విచ్చిన్నమయింది మళ్ళీ ఇరవయ్యవ శతాబ్దం ఉత్తరార్ధం లో ఫాచియా సూత్రాలను అమలు చేస్తూ నిరంకుశ ప్రాభుత్వం చైనా లో ఏర్పడిన సంగాతి మనకు తెలిసిందే

ఆధునిక కాలం లోచైనా లో  కొత్త మతాలేవీ యేర్పడ లేదు .పాశ్చాత్య మతాలప్రభావం పెరిగింది సమన్వయ సిద్దాన్తాలోచ్చాయి .చైనీయ బౌద్ధం ప్రభావం చూప లేక పోయింది  మావో కాలం లో కమ్యూనిస్ట్ భావజాలం ,మార్క్స్ సిద్ధాంతల అనుసరణ  జరిగింది

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-13-ఉయ్యూరు .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.