మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16

శామ్యూల్ అలేక్సాండర్

క్రీ .శ.1859  జనవరి ఆరు న  శామ్యూల్ అలేక్సాండర్ ఆస్ట్రేలియా లోని సిడ్ని లో  జన్మించాడు .ఇంగ్లాండ్ లో చదివాడు మాంచెస్టర్ లో దర్శన శాఖ ఆచార్యుడు గా పని చేశాడు యూ దు మతస్తుడు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి లలో ఉన్నత విద్య నేర్చాడు  మోరల్ ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకం రాశాడు బ్రిటిష్ అకాడెమి ఫెలో గా గౌరవం పొందాడు .అనేక ప్రాంతాలలో పర్య టించి ఉపన్యాసాలిచ్చాడు ”స్పేస్ టైం అండ్ డయేటి ”గ్రంధం రాశాడు

SamuelAlexander.gif

 

మాం చెస్టర్  లో  ఆయన ఇల్లు అనేక ప్రముఖులకు ఆతిధ్యం ఇచ్చింది అరిస్టాటిల్ సొసైటీకి  పని చేశాడు  రిటైర్ అయ్యే దాకా  మాంచెస్టర్ లో ప్రొఫెసర్ గా ఉన్నాడు అంతకు ముందు విశ్రాంతి కోసం కొద్దికాలం పని చేయలేదు అయినా చిన్న చిన్న ఉపన్యాసాలిచ్చాడే కాని ఖాళీ గా లేడు అలేక్సాందర్ శామ్యూల్ జీవితాంతం పెళ్లి చేసుకో కుండా బ్రాహ్మ చారి గా ఉండి పోయాడు

 

 

బ్రిటిష్ అకాడెమి లోను,బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ  ఇంగ్లాండ్ , పాలస్తీనా లలోని జ్యూయిష్ సంఘం లో సభ్యుడు గా కొ న సాగాడు . మాంచెస్టర్ లో ఆయన విగ్రహం ప్రతిష్టించి గౌరవించారు అందులోని సెంట్రల్ హాల్ కు ఆయన పేరు పెట్టారు 1927 లో హెర్బర్ట్ స్పెన్సర్ పై కీలక ఉపన్యాసంనిచ్చి అందరి ప్రశంసలు పొందాడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను ఇచ్చి అమెరికా ప్రభుత్వం గౌరవించింది ఒక ఆస్ట్రేలియా వాసికి ఇచ్చిన అరుదైన గౌరవం ఇది ”బ్యూటి అండ్  ఆఫ్” అనే గొప్ప గ్రంధం రాశాడు .

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న యూదుల దురవస్థ కు బాధ పడి  తన సమయం ,దనం,వారి బాగు కోసం వెచ్చించాడు  1938 సెప్టెంబర్13  న  మరణించాడు  మాంచెస్టర్ లోని దక్షిణ సేమట రి లో ఆయన పార్ధివ దేహాన్ని ఖననం చేశారు   ఆయన రాసిన విల్లు ప్రకారం ఆయదగ్గర ఉన్న పదహారు వేల పౌండ్ల  డబ్బులో  పదమూడు వేల పౌండ్లు జెరూసలెం యూని వర్సిటి కి అందించారు ఆయన రాసిన”ఫిలసాఫికల్ అండ్ లిటరరీ పీసెస్ ”  గ్రంధాన్ని మరణానంతరం ప్రచురించారు మెల్ బోర్న్ లోనిమొనాస్ యూ ని వర్సిటి లోని ఆడిటోరియం కు సామ్యూల్ పేరు పెట్టారు  ఆయన్ను ఆ కాలపు స్పెక్యులేటివ్ థింకర్ ”అన్నారు

ఆయన భావాలను ”పాన్తేనిక్ ”భావాలన్నారు ఆయన సమకాలికుడు ”ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ ”అలేక్సడ ర్ సామ్యుల్ ను ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప బ్రిటిష్ ఫిలాసఫర్ గా పరిగ ణి స్తారు ఆయన సిద్ధాంతాన్ని ”ఎమేర్జేంట్ ఇవల్యూషన్” అని పిలుస్తారు

ఈ ప్రపంచానికి మూల తత్త్వం అవిభాజ్యం అయిన దిక్ ,కాలాలు (స్పేస్ అండ్ టైం) అని  సిద్దాన్తీక రిం చాడు  .ద్రవ్యం ,గుణం ,ప్రాణం ,చైతన్యం మొదలైన వన్నీ డిక్ ,కాలాల నుండి ఉద్భవించినవే అన్నాడు .ఏదైనా ఒక భూత స్తితికి ,దాని లో నుంచి పుట్టే దాని కంటే ఉన్నతరం గా ఉన్న భూత స్తితిని దైవం అన్నాడు  దీన్నే తేలిక గా చెప్పా లంటే  ప్రతి అంతస్తు కు దాని పైన ఉన్న అంతస్తు నే దైవం అణా వచ్చు అని సిద్ధాంతం చెప్పాడు .ప్రాణం మాత్రమె కలిగిన జీవులకు దాని కంటే ఉన్నతం గా ఉన్న గుణం వైపుకు పురోగామించాలి అన్న ప్రేరణ ఉంటుంది అలాంటి జీవులకు అస్పస్తాం గా అను భావానికి వచ్చే గుణమే దేవుడు .స్తలాన్ని కాలాన్ని ,కాలం స్పేస్ నుప్రత్యేకం గా ఉంచుతాయి ఈ రెండు ఏకత్వం లోని అనేకత్వాలను దోహద పడుతుంది . చలనం అనేది పాయింట్ల కదలిక కాదు కాని పాయింట్లు చలనానికి అవధులేర్పరుస్తాయి కాలము ,స్పేస్ ల మధ్య అనేక సంబందాలుండి,వస్తువులా మధ్య బంధాలను ద్రుఢం చేస్తాయి .

మానవులకు ఇంకా దైవం అనుభవం లోకి రాలేదు .కాని పొందాలన్న ప్రేరణ మాత్రం ఉంది .అని అలేక్సాడర్ మతం గా భావించాలి  మిన్కౌస్కి ,ఐన్స్టైన్ ,లోరెంజ్ లు చెప్పిన డిక్ ,కాలాల భావజాలం ,డార్విన్ వికాస వాడ సిద్ధాంతాలు శామ్యూల్ దర్శనం లో చోటు చేసుకొన్నాయని తెలుస్తోంది .ఈయన 79ఏళ్ళు జీవించి 1838 సెప్టెంబర్ పదమూడున   మరణించాడు. ఆ యన లేవ  నెత్తిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్ప లేక పోయాడు అందుకనే వాటిని ఎవరూ అ తర్వాత పట్టించుకోలేదు.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.