శంఖు పుష్పాలు

DSCF4318 DSCF4319 DSCF4320 DSCF4321

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

1 Response to శంఖు పుష్పాలు

  1. ప్రియమైన దుర్గాప్రసాద్ గారూ !
    నమస్కారం. మీరు తీసిన శంకు మల్లె తీగల ఫోటోలు బాగున్నాయి. ఇవి మీ దొడ్లోవేనని భావిస్తాను. తెలుపు, నీలం రంగు పూలు పూసే రకాలున్న ఈ తీగ మొక్కను ‘దింటెన’ అని కూడా అంటారు.ఈ మొక్క శాస్త్రీయనామం Clitoria ternatea. సంస్కృతంలో ‘అస్ఫోట’, ‘గోకర్ణ’, ‘అపరాజితా’ అనే పేర్లున్న శంకు మల్లె తీగకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి.దీని వేళ్ళు మూత్రకారిగానూ, విరేచనకారిగానూ పనిచేస్తాయి. పొట్టలో నీరు
    చేరిన (ascites)రోగికి ఈ మొక్క దివ్యౌషధంలా పనిచేస్తుంది. దృష్టి దోషాలను పోగొట్టేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. దీని గింజల్ని నేతిలో వేయించి, తినిపిస్తే చిన్నపిల్లలకు మలబద్ధకం, అజీర్తి నయమౌతాయి. దీని వేళ్ళ రసాన్ని చల్లటి పాలతో కలిపి తాగితే మొండి బ్రాంకైటిస్ రోగికి కూడా కళ్లె బయటికి వెడలుతుంది. దీని పసరు తల తిప్పటనూ, వా౦తినీ
    కలుగజేస్తుంది.తెల్ల పూల ది౦టెన వేరు రసాన్ని ముక్కుల్లో వేసుకుని పీలిస్తే, పార్శ్వపు నొప్పి(Hemicrania) వ్యాధి నయమౌతుంది. పాము కాటుకు చేసే ప్రథమ చికిత్సలో దీని వేరు రసం వాడతారు.
    ‘కాళహస్తి మాహాత్మ్యము’ కావ్యంలో తిన్నడు అనే ఆటవిక శివభక్తుడు శివలింగం కంటి నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని నిలుపుదల చేసేందుకు తనకు తెలిసిన ఆటవిక వైద్య యోగాలన్నింటినీ ప్రయోగిస్తాడు.ఆ కావ్యం తృతీయాశ్వాసంలోని 110 వ పద్యంలో ధూర్జటి మహాకవి ఆ చికిత్సా విధానాలను సవివరంగా పేర్కొన్నాడు. వాటిలో తెల్ల దింటెన పువ్వు రసంతో చేసే వైద్యం కూడా ఒకటి.
    ఈ చక్కటి మందు మొక్క గురించి నాకు తెలిసిన నాలుగు ముక్కలూ ఇవి.
    మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.