ఆ నాటి యాంగ్ టర్క్స్ లాంటి వాళ్ళే ఈ నాటి కాంగ్రెస్ ను కాపాడగలరు

            ఆ నాటి యాంగ్ టర్క్స్ లాంటి వాళ్ళే ఈ నాటి కాంగ్రెస్ ను కాపాడగలరు

ఇందిరా గాంధి చుట్టూ ఒక ‘’కొటరి ఏర్పడి’’ ప్రజా నాడిని పసి గట్ట లేకుండా ఆనాడు చేసి కాంగ్రెస్ ను భ్రస్టు పట్టించారు .రాజ భరణాల రద్దు బ్యాంకుల జాతీయీ కరణ మొదలైన మంచి పనులు చేసిన ఆమె ను అప్పుడు  యంగ్గ్ టర్క్స్ అనే బడే వెన్నెముక గల నాయకులు అయిన మాజీ ప్రధాని చంద్ర శేఖర్ ,మోహన్ దారియా ,మాజీ ఉప రాష్ట్ర పతి కృష్ణ కాంత్ మొదలైన వే లి మీద లెక్క పెట్ట గలిగిన వారు ఆమె చర్యలను మనస్పూర్తి గా సమర్ధించారు ప్రజల్లోకి వెళ్లి చాటి చెప్పి ఆమె కీర్తి ప్రతిష్టలను పెంచారు .అది తన గొప్ప అనే అహంభావం పెరగటం చిన్న కొడుకు సంజయ్ ను అందలం ఎక్కించటానికి దేశమంతా ‘’రెడ్ కార్పెట్లు పరిపించటం’’ ,ప్రజాస్వామిక విలువలను నాశనం చేసే ప్రయత్నాలు చేయటం ,రెండో అభిప్రాయానికి విలువ నివ్వక పోవటం, విషయం పై సమగ్ర చర్చ లేకుండా’’ హై హాన్దేడ్ గా’’ ప్రవర్తిమ్చటం,పార్టీని పార్ల మెంటరీ బోర్డ్ ను వర్కింగ్ కమిటీని భజన పరులతో నింపటం ఆమె చేసిన గొప్ప పోర బాటు ..అప్పటి దాకా వీర విధేయులైన ఈ యాంగ్ టర్క్స్ ఖూనీ అయి పోతున్న ప్రజా స్వామ్య విలువల పట్ల ఉన్న విశ్వాసం వాటిని కాపాడుకొనే ప్రయత్నం లో ఆమెకు ఎన్నో సార్లుముందుగా  నెమ్మదిగా, తర్వాత ఘాటుగా,చివరికి మొండిగా ఎదిరించి  చెప్పారు .తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందం గా వ్యవహరించిన ఆమె కు ప్రజాస్వామ్యం ప్రజలమనో భావం, విలువల ఆవశ్యకత ,న్యాయస్తానాల పట్ల గౌరవం కాపాడక పోతే దేశం అధః పాతాలకు ఆమె చేతిలో పడి పోతుందని అన్ని ప్రయత్నాలు చేసి ,విసుగు పుట్టి నేరుగా ప్రజలకే చెప్పి ఆమె కుటిల నీతి ని బయట పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ప్రజా స్పందనకు విలువ తెచ్చారు

పార్టీ లోంచి బయటికి వచ్చి ,లోక నాయక జయ ప్రకాష్ నాయకత్వం లో గొప్ప సంచలం సృష్టించి జనతా పార్టీ ని మొరార్జీ భాయ్ ని ప్రధాని చేసి ప్రజా స్వామ్యానికి యాంగ్ టర్క్స్ మళ్ళీ పట్టాభి షేకం చేశారు  .ఇవాళ దేశం లో ఆ నాటి ఇందిర ప్రవర్తించిన తీరే కానీ పిస్తోంది .సోనియా చుట్టూ భజన పరులు చేరి ఆమె ద్రుష్టి దేని పైనా పడకుండా తమ పబ్బం గడుపు కొంటున్నారు .మళ్ళీ ప్రజాస్వామ్యానికి, మాన వీయ విలువలకు ప్రాణం పోయాల్సిన అవసరం వచ్చింది .ఉన్న ప్రధాని మౌన ముద్రా లంకారుడు .ఏ శాఖ లో చూసినా అవినీతి ,కుంభ కొణాలేసమర్ధుడని పించుకొన్న కేంద్ర మంత్రి లేడు ఉన్న ప్రణబ్ అడ్డు రాకుండా రాష్ట్ర పతి ని చేసింది ..ప్రజలకు రోల్ మోడల్ ప్రధాని కాని ,కేంద్ర మంత్రులు కాని ముఖ్య మంత్రులు కాని రాష్ట్ర మంత్రులు కాని లేక పోవటం దురదృష్టం, శోచనీయం .ఈ గండం నుంచి గట్టెక్కించే కొద్ది మంది ఆలోచనా పరుల కోసం దేశం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది .  స్వప్రయోజనాలకోసం  జాతినీ ,రాష్ట్రాన్ని పణం గా పెట్టె నీచ ఆలోచన నుండి బయట పడి  నూరేళ్ళ కు పైగా చరిత్ర ఉన్న ఆ పార్టీ ‘’నూరేళ్ళు నిండి పోయినట్లు’’ గా వ్యవహరిస్తే అంతటా అంధకారమే .అందుకే మళ్ళీ మరో యాంగ్ టర్క్స్ నాయకులు రావాలని  కాంగ్రెస్ అభిమానులు కోరుకొంటున్నారు .ఈ సంక్షోభ స్తితి నుంచి ఆ పార్టీ బయట పడాలంటే ‘’షాక్ ట్రీట్మెంట్ ‘’ అవసరమే లేక పోతే పార్టీకి’’పెరాలిసిస్ వచ్చి’’చచ్చు బడి పోతుంది .లాంగ్ లివ్ ఇండియా ,లాంగ్ లివ్ కాంగ్రెస్

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-13- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

1 Response to ఆ నాటి యాంగ్ టర్క్స్ లాంటి వాళ్ళే ఈ నాటి కాంగ్రెస్ ను కాపాడగలరు

  1. Vasu's avatar Vasu says:

    కాంగ్రెస్ పార్టి మీద నున్న మీ అభిమానం చూసి కళ్ళలో నీళ్లు ఉబికాయి. నేడోఈ రేపో అంట్టూ, స్టేరాయిడ్స్ పైన ఊపిరి పీల్చుకొని బండి లాగుతు, మూడు సంవత్సరాలు పైగా ఐ.సి.యు. లో ఉన్న పేషంట్ తిరిగి బ్రతికాలని కోరుకోవటం అత్యాశ కదాండి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.