మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17
ఆరిజన్ అడ మాంటి యస్
క్రీ పూ.185 లో ఈజిప్ట్ దేశం లో ఆరిజన్ అడ మాంటి యాస్ జన్మించాడు అతని తండ్రి దేవుడి పై తనకున్న విశ్వాసం రుజువు చేసుకోవటానికి ప్రాణ త్యాగం చేశాడు .కొడుకుతో చిన్నప్పుడే మత గ్రంధాలన్నీ చదివించాడు .క్రీ .పూ. 200 లేక్ అంటే పదిహేనవ ఏట ‘’డైడా స్కాలియా ‘’అనే మత సంస్థకు అధినేత గా నియమింప బడ్డాడు .అమోనియం సాక్కాస్ అనే గురువు వద్ద దగ్గర ప్లేటో యొక్క కొత్త సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు .అప్పటి క్రైస్తవ మతాధికారి కి వ్యతిరేకం గా ఉండటం వల్ల అలేక్సాన్ద్రియా నగరాన్ని వదిలి పెట్టి వెళ్లి పోవాల్సి వచ్చింది .తర్వాత సేజరీయ పాలస్తీనా లో కొత్త విద్యా సంస్థను నెల కోల్పాడు .డేడియన్ క్రైస్తవుల్ని పీడించే కాలం లో జైలు పాలయ్యాడు జైలు లోనే మరణించాడు .
ఆరిజన్ గొప్ప తపస్సంపంనుడు అని కీర్తి పొందాడు .సన్యాసి జీవితాన్నే గడిపాడు .భగవద్భక్తి తో ఎప్పుడూ పరవశించి ఉండే వాడు . అనేక గ్రంధాలు రాశాడు చివరి రోజుల్లో అతని రచనలను , బోధనలను అనేకులు ఖండించటం వలన కాల గర్భం లో కలిసి పోయాయి అతను రాసిన వాటిలో ముఖ్య మైనవి 1–బైబిల్ పాత నిబంధనలపై విమర్శ .ఇందులో క్రైస్తవ మతాన్ని విశ్వ సించె వారికీ ధర్మ సూక్ష్మాలు రాశాడు 2-నాలుగు సంపుటాల ‘’పెరి ఆర్కాన్ ‘’మౌలిక సిద్ధాంత గ్రంధం రాశాడు ఆ కాలానికి ఈశ్వర శాస్త్ర సిద్ధాంతాలను చెప్పిన మొదటి సిద్ధాంత గ్రంధం .దీని లాటిన్ అను వాదమే ఇప్పుడు లభ్యమవుతోంది ఆత్మల పూర్వ భావ సిద్ధాంతాలనే ఇందులో చెప్పాడు .ఆ పూర్వ అవస్థ పొందటమే మోక్షం అన్నాడు 3- సెల్సస్ సిద్ధాంతాల ప్రతి ఘటన అనే ఎనిమిది సంపుటాల రచన .క్రైస్తవం పై సేల్సస్ చేసిన విపరీత భావాలను ఇందులో ఖండించాడు ఇప్పటికి అర్జన్ వాదాన్నే అందరు అంగీక రిస్తున్నారు
ఆరిజన్ శిష్యుడు యేతి నాసియాస్ ,కైరిల్లాస్ ,డైడమస్ లు అలేక్సాన్ద్రియా నివాసులే .ఈశ్వర శాస్త్రం లో వీరంతా ఘటికులే..క్రీసు దివ్యత్వం పై వీళ్ళకు అపార నమ్మకం ఉంది .వీళ్ళు మత గ్రంధాలకు లాక్షణిక వ్యాఖ్యలు రాశారు .
సశేషం –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-13 –ఉయ్యూరు

