మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19
జాన్ కాల్విన్
స్విట్జర్ లాండ్ లో క్రీ శ1509లో జూలై 10 న జాన్ కాల్విన్ శషికార్టీలో ఉన్న నోయాన్ లో జన్మించాడు .క్రైస్తవ మతాచార్యుడి గా మంచి గుర్తింపు పొందాడు .హేన్గేస్ట్ డి మౌంట్ మార్.అనే సంపన్నుల ఇంట ఉండి విద్యా భ్యాసం చేశాడు .పారిస్ విశ్వ విద్యాలయం లో చేరి లాటిన్ భాష అభ్యసించాడు .తర్కం దర్శన శాస్త్రాలను అధ్యయనం చేశాడు .బేసేల్ కు వెళ్లి స్తిరం గా ఉండి పోయాడు ఇక్కడే ‘’ఇంష్టి ట్యూట్స్ఆఫ్ క్రిస్టియన్ రెలిజియన్ ‘’అనే క్రైస్తవ మత సంహితలుగ్రంధం రాసి ప్రచురించాడు
![]()
ప్రొటెస్టెంట్ మత సిద్దాన్తాలన్నిటిని ఒక చోట చేర్చి సంఘటితం చేసిఆ గ్రంధం లో నిక్షిప్తం చేసిన ఘనత ఈయనదే ..ఇందులోని మొదటి భాగం లో సృష్టి కర్త అయిన దేవుని గూర్చిన జ్ఞానాన్ని రెండవ భాగం లో విమోచన కారుడు (రిడీమర్ )అయిన భగవంతుని గూర్చి జ్ఞానం ,మూడవ దానిలో పవిత్రాత్మ (హోలీ స్పిర్తిట్ )చేసే పను లను సవివరం గా తెలియ జేశాడు .ఇందులోనే పశ్చాత్తాపం విశ్వాసం సమర్ధనం ,విశ్వాసి యొక్క పవిత్రీకరణ అనే అంశాల గురించి కూడా రాశాడు చివరగా తన కొత్త సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు .ఈ సిద్ధాంతం లో దేవుడు కొందరిని మోక్షానికి అర్హులైన వారిగా ,మిగిలిన వారిని అర్హత లేని వారిగా చేస్తాడని నిశ్చయం గా చెప్పాడు..ఈ నిర్దేశానికి మార్పు అనేది ఉండదు అని గట్టి గా చెప్పేశాడు నాలుగవ భాగం లో చర్చి నిర్మాణం పరి పాలన ,పవిత్ర కర్మలు .లౌకిక రాజ్యాధి పతి కి ఉన్న అధికారాల పరిమితి అనే అంశాలను చర్చించాడు
![]()
కాల్విన్ బోధించిన సెయింట్ పీటర్ కాదేద్రిల్ -జెనీవా
మంచి సంస్కారం తో ప్రపంచం లో ఉన్న అన్ని వస్తువుల విషయాలను స్వరూపాలను అనుగ్రహాన్ని పాత్రత ను సత్తా విషయం లోను ,శీల విషయం లోను ఈశ్వరుని పై పూర్తిగా ఆధార పడి ఉంటాయి అని ఆయన సిద్ధాంతం లోని సారాంశం .మానవుడు బుద్ధి లో స్వతస్సిద్ధం గానే భగవంతుని గురించి జ్ఞానం ఉంటుంది .ఈ సృష్టి కూడా దేవుని స్వరూప స్వభావా గుణాల ఆవిష్కరణమే నని అన్నాడు సృష్టిని చేసి ,పోషించే భగవంతుని పై పూర్తీ విశ్వాసం తో ఉండాలని ఆయన పైనే సృష్టి ఆధార పడిందని కాల్విన్ సిద్ధాంతం .
1559 లో ప్రసిద్ధ మైన జనీవా అకాడెమీ ని స్తాపించాడు .దాని ద్వారా తను సుసంస్క్రుతం చేసిన ఈశ్వర సిద్ధాంతాలను బహుళం గా ప్రచారం చేశాడు . యాభై నాలుగేళ్ళు మాత్రమె జీవించి1564 may 27 న జాన్ కాల్విన మరణించాడు .ప్రొటెస్టెంట్ మత విప్లవం లో గొప్ప పాత్ర పోషించి ఫ్రెంచ్ దార్శనికుదని పించుకొన్నాడు పొలెమిక్ అపాలజిస్ట్ రచయిత అని పించుకొన్నాడు క్రిస్టియన్ దియాలజీ లో సుస్తిత స్తానం సంపాదించుకొన్నాడు ఆయన ఆనాడు ప్రవచించిన వాటినే ఈనాడు ప్రపంచ వ్యాప్తం గా ఆచరిస్తున్నారు సంతానం లేకుండా నే చని పోయాడు రిఫార్మర్ లలో అనైకతను గూర్చి బాధ పడ్డాడు వారిని పిలిచి మాట్లాడి ఐక్యత చేకూర్చాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-13 ఉయ్యూరు

