మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23
విలియం జేమ్స్
జేమ్స్ విలియమ్స్ అమెరికా దార్శనికుడు క్రీశ..1842 జనవరి 11 న న్యూయార్క్ లో . జన్మించాడు మనస్తత్వ శాస్త్ర వేత్త గా మంచి పేరు .వ్యావహారిక సత్తా వాదాన్ని (ప్రాగ్మా టి జం )ను ప్రారంభించిన ముగ్గురిలో ఒకడు .హార్వర్డ్ వైద్య కళా శాల లో ఆచార్యుడి గా పని చేశాడు . హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో దర్శన శాస్త్ర ఆచార్యుడు గా పని చేశాడు .తర్వాత సైకాలజీ ప్రొఫెసర్ అయ్యాడు .మనస్తత్వ శాస్త్ర తత్త్వం(ప్రిన్సిపిల్స్ ఆఫ్ సైకాలజీ) ,మహానుభావ వైవిధ్యం(వెరైటీస్ ఆఫ్ రిలీజియన్ )తీవ్ర అనుభవ వాదం (రాడికల్ ఏమ్పిరిసిసం )వ్యావహారిక సత్తా వాదం (ప్రాగ్మాటిజం )అనే గ్రంధాలు రాశాడు జేమ్స్ ఇవి తర్వాతి తరం పై గొప్ప ప్రభావం కలిగించాయి .
మన అనుభవం లో ఒక భాగం నుండి మరొక భాగానికి బుద్ధి మనల్ని తీసుకొని పోతుంది .వస్తువుల మధ్య సత్ సంబంధాల్ని కల్పిస్తుంది .సరళ మార్గం లో శ్రమను తగ్గించి ,అడ్డు లేకుండా కార్యాలు చేయటానికి ఏ భావం అయినా సత్యమే అంటాడు విలియమ్స్ .దాని సాధకత మాత్రమె సత్యానికి నిదర్శనం .అని సత్యాన్ని నిర్వచించాడు .మన అవసరాలను ,ప్రయోజ నాలను సంతృప్తి పరచటానికి భావాల ప్రమాణం ఆధార పడి ఉంది .మన ప్రవ్రుత్తి లో విజయాన్ని చ్చేదే సత్యం అంటాడు అపజయాలను కల్గించేది అసత్యం .ఒక సత్యం సత్యమా అసత్యమా అని తేల్చేది ఆచరణ లో అది చేకూర్చే ఫలితం పై ఆధార పడి ఉంటుందన్నాడు .
![]()
జేమ్స్ చెప్పిన రెండవ ముఖ్య భావం ‘’బహుత్వ వాదం ‘’.ఏకత్వ వాదం కంటే ఇదే మేలైనది అంటాడు అదే మానవ స్వాతంత్ర్యానికి ,అవసరాలకు తగినది .మనం ఉన్న ప్రపంచం సర్వోత్ర్క్రుస్స్టం కాదు .కాని మనిషి తన సంకల్పం తో ,ప్రయత్నం తో అభి వృద్ధి చేయచ్చు .అని అభి వృద్ధి వాదాన్ని (మేలియోరిజం )ను ప్రతి పాదించాడు .జేమ్స్ చెప్పిన అనుభవ వాదం యూరప్ లో సాంప్రదాయిక భావ ,బుద్ధి వాదాలకు వ్యతి రేక మైనది .అనుభవ విషయం అంతా సత్యమే నంటాడు జేమ్స్ .సత్యం ప్రతి క్షణం మార్పు చెందుతుంది .ఇంద్రియాలు కల్పించే సంబంధాలు కూడా సత్యం లో భాగాలే నన్నాడు .అవి కూడా అనుభాల వల్ల ఏర్పడినవే .సత్యం అంటే మన గ్రహణ కోసం సిద్ధం చేయ బడ్డ ఏదో ఒక నిత్య పరిణామ రహిత వస్తువు మాత్రం కాదు .మానవ ఆలోచనల వల్ల చరిత్ర మారుతోంది .కనుక మనిషి చరిత్ర గతిని మార్చ గలుగుతున్నాడు .
![]()
సత్యాన్ని మనం గ్రహించటం ద్వారానే అందులో కొన్ని మార్పులను మానవుడు చేయ గలుగుతున్నాడు .మనకు కనీ పించే ప్రపంచచానికి ఆధారం గా ఒక నిత్య ద్రవ్యం ఉంది అనటం భ్రాంతియే అన్నాడు విలియం .ప్రత్యక్ష అనుభవం లో నానాత్వం విభిన్నత్వం కన పడుతోంది .కనుక సత్యం నానాత్వా తోను ,భిన్నత్వం తోను కూడి ఉంటుంది ఇదే అనుభవ వద సారాంశం .
మానవుడు తన రాగం సంకల్పం లకు అనుగుణం గ ఈశ్వర భావాన్ని ఏర్పరచుకొన్నాడు .ఈశ్వరుడు కూడా ఈ విశ్వం లో ఒక భాగమే .ఆయన మానవులపై కరుణా ద్రుష్టి ఉన్న వాడు .అమిత శక్తి సంపన్నుడు కూడా .అందుకే మనకు అన్ని రకాల సహాయం అందిస్తాడు .విశ్వసిమ్చాలి అనే సంకల్పం (విల్ టు బిలీవ్ )ఈశ్వర సంకల్పాన్నే ప్రతి పదిస్తున్దన్నాడు .చైతన్యం అనేది ఒక వస్తువు కాదు .అదొక ప్రక్రియ (ఫంక్షన్ )అని విలియం వాదం
మానవ సంకల్పానికి స్వేచ్చ ఉందని అందుకే మానవుడి ప్రయత్నం అదుపు లో ఉంచుకొనే వీలుందని శారీరక ప్రవృత్తు లన్ని మనస్సును ఆక్రమించిన తీవ్ర భావాలకు అను గుణం గానే ఉంటాయని జేమ్స్ భావించాడు 62 ఏళ్ళు జీవించి విలియం జేమ్స్ 1910 ఆగస్ట్ ఇరవై ఆరు న మరణించాడుజేమ్స్ ను ”ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజీ ”అని గౌరవం గా పిలుస్తారు
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-13- ఉయ్యూరు

