మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24
నింబార్కర్
వేద వ్యాస మహర్షి రాసిన బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాసిన వారిలో నిమ్బార్కరుడు ఒకరు .అయన తెలుగు వాడే ననే అభి ప్రాయం ఉంది గోదావరి తీరం లో సుదర్శనాశ్రామం లో జన్మించి నట్లు చెబుతారు .ఈయన రాసిన విషయాలను బట్టి చూస్తె ఆది శంకరాచార్యుల వారికి ముందు వాడు కాదని అభిప్రాయం .
ఈయన రాసిన ‘’మాధవ ముఖ మర్దనం .‘’బట్టి చూస్తె మాధవా చార్యుల ముందు వాడు కూడా కాదంటారు .కనుక జీవిత కాలాన్ని క్రీ పూ..13 శతాబ్దపు వాడని తేల్చారు .నిమ్బార్కర్ రాసిన బ్రహ్మ సూత్రా వ్యాఖ్యానానికి ‘’వేదాంత పారిజాతం ‘’అని పేరు .తన సిద్ధాంతాలను ‘’దశ శ్లోకి ‘’లో నిక్షిప్తం చేశాడు .’’సవి శేష నిర్వి శేష శ్రీ కృష్ణ స్తవ రాజం ‘’అనే స్తోత్ర గ్రంధము కూడా రాశాడు .
నిమ్బార్కర్ దర్శనం లో మూడు తత్వాలున్నాయి .అవి చిత్తూ ,అచిత్తు ,ఈశ్వరుడు .వీటినే భోక్త ,భో గ్యం ,ప్రేరిత లేక శ్వేతాశ్వతరం అంటారు .ఈయనకు శ్రీ కృష్ణుడే పర తత్త్వం .ఈయనకు సమానం కాని అధికులు కాని లేరని నమ్మకం .సర్వేశ్వరుడు సర్వానికి నియంత .ప్రపంచానికి నిమిత్తం ,ఉపాదానం కూడా ఆయనే .అందుకే పరబ్రహ్మ అంతర్యామి .రూపం అనే రెండు రూపాలుంటాయి .ప్రపంచం అంటే పర బ్రహ్మ పరిణామమే .పర బ్రహ్మ ప్రపంచ దృష్టిలో భిన్నం గాను ,ఆంతర్యం లో అంతర్యామి రూపం లో అభిన్నం గా ఉంటాడు .పర బ్రాహ్మ పరుడు ,అంతర్యామి అయిన సగుణ ,నిర్గుణ భావాన్ని నిమ్బార్కరాచార్యుడు చెప్పలేదు .
వేదం లో ఉన్న నిర్గుణ వాక్యాలు కేవల భేదాన్ని ,మిగిలిన వాటిని నిషేదించాడు .పరబ్రహ్మ తన నుండి ప్రపంచాన్ని సృష్టిస్తాడు .ఈశ్వరుని అభేదత్వానికి స్వతంత్ర సద్భావం ,నియామకత్వాం కనీ పించి నట్లు భేద ,అభేద రూపం లో పర తంత్ర సద్భావం నియామత్వం సూచిస్తుంది .ప్రపంచం దేవుని మాయా విజ్రుమ్భానం కాదు .ఆయన శక్తి నుంచి ఆవిర్భవించింది .పరత్వం అన్తార్యమిత్వం రూపాల సమతుల్య స్తితి ఏ ఆయన ప్రపంచాన్ని సృస్టించ టానికి కారణం .ఈ రెండు సమ ప్రాదాన్యమైనవే .అవ్యాక్రుత ,వ్యాక్రుత రూపాలు బ్రహం యొక్క స్వగత భేదాలే .ఆయన ప్రపంచానికి అతీతుడు .ప్రపంచం లేకుండా పర బ్రహ్మ సమగ్రం కాదు .
జీవాత్మ జ్ఞాన స్వరూపుడు .అచేతన ద్ర్వవ్యాలైన శరీరం ,ఇంద్రియాలు ,ముఖ్య ప్రాణం ,మనస్సు ,బుద్ధి అనే వాటి కంటే భిన్నుడు .అతడు జ్ఞానాశ్రయం కూడా .జ్ఞానం ధర్మ గా ఉన్న వాడు .జీవాత్మ ఆది అంతం లేని వాడు .పరబ్రహ్మ అంశమే జీవాత్మ .జీవాత్మ అనేకాలు .ఇవన్నీ పరాబ్రహ్మ రూపాలే .అవిద్య చే సంసారి అవుతాడు .అందుకే సుఖ దుఖాలనుభ విస్తాడు .
జగత్తు మూడు విధాలు .కేవల సత్యం ప్రాకృతం .కాలం పర బ్రహ్మ చే ప్రేరితం .ప్రాపంచానికి ఉపాదానం .ప్రపంచం పర బ్రాహ్మ కార్యం నిత్యం సత్వ రజస్తమో గుణాల తో కూడి ఉంటుంది
ప్రాపంకత్పత్తి ఆకాశం ,వాయువు,అగ్ని ,జాలం ,భూమి అన్ని పరబ్రహ్మ నుండే ఆవిర్భ వించాయి .కేవల సత్యం కాలం అచిద్రూపాలు .
బ్రహ్మం చిత్తూ అచిత్ లమధ్య పరస్పర సంబంధమే .ఆయన నియంత .బ్ర హ్మం అంటే కొత్త ఉత్పత్తికాదు .సూక్షం రూపం లో నుంచి స్తూలం గా వ్యాపించినదే .బ్రహ్మం అంశి జీవాత్మ అంశం .ఈ రెండు అసత్యాలు కావు .అయన సర్వ వ్యాపి దోష రహితుడు .జీవుడు జగద్వ్యాపారి .బ్రహ్మ క్షర అక్షర రూపాలకు అతీతుడు .
బ్రహ్మానికి జగత్ట్టు కు మధ్య స్వరూపం లో తేడా ఉంది .బ్రహ్మ కారణం జగత్తు కార్యం .ఈరెండిటి అనన్యత్వాం మాటల తో చెప్పా లేనిది .బ్రాహ్మ చైతన్య స్వరూపం నిత్య శుద్ధం .మోక్షం అంటే జీవాత్మ పర బ్రహ్మ లో సామ్యాన్ని పొందటమే .ఆయన ప్రసాదమే జీవుని కి శరణ్యం .మోక్షానికి కర్మ ,జ్ఞానం ,ఉపాసన ,శక్తి ,ప్రపత్తి ,గురు అనుగ్రహం అనే ఆరు కావాలి విద్యుక్త కర్మమే చేయాలి .కర్మ జ్ఞానానికి అంగాం .విద్య కర్మకు అంగం .బ్రాహ్మ విద్యయే నేర్వాలి .పర మాత్మ జ్ఞానాన్ని పొందిన ఆత్మా ను ఉపాసించాలి అదే అత్యుత్తమ ఉప్పాదానం .
భక్తీ ఉపాసన ఒక టి కావన్నాడు ఆచార్యుడు .దేవుని పై పరమ ప్రేమనే భక్తీ అన్నాడు .భక్తీ మోక్ష సాధనం ఈశ్వర ప్రసాదం లభిస్తేనే మోక్షం .ఈయన చెప్పిన ప్రపత్తి రామానుజా చార్యులు చెప్పి నట్లే ఉంటుంది .ప్రపత్తి ఈశ్వరుని గురించి ,ఆచార్యుని గురించి ఉండాలి జీవాత్మ ,పరమాత్మలకు మధ్య వర్తి ఆ చార్యుడు .జీవుడు –గురువు –ఈశ్వరుడు .ఆచార్యుని అనుగ్రహాన్ని ముందు పొంది మోక్షానికి ఆయన ఉపదేశాన్ని పాటించాలి .ఆచార్య ఉప పత్తి లభిస్తే ఇక కర్తవ్యమ్ అనేది ఉండదు .ఆచార్య పదం అన్ని సందేహాలకు నివృత్తి .అని నిమ్బార్కరాచార్య మతం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-13- ఉయ్యూరు
.

