మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27
ధామస్ హాబ్స్
థామస్ హాబ్స్ డేకార్టు శిష్యులలో మొదటి ఆంగ్లేయుడు 1588 లో ఏప్రిల్ అయిదు న జన్మించాడు .నాలుగవ ఏటనే విద్యా భ్యాసం మొదలు పెట్టాడు .గ్రీకు ,లాటిన్ భాషల్లో చేయి తిరిగిన వాడని పించు కొన్నాడు .కొద్ది కాలం లోనే ఈ రెండు భాషల్లో పాండిత్యాన్ని కూడా సాధించి అందర్నీ ఆశ్చర్య పరచాడు .పద్నాలుగవ ఏట యూడి పస్ రాసిన ‘’మీడియా ‘’నాట కాన్ని గ్రీకు నుండి లాటిన్ భాష లోకి అనువాదం చేసిన ఘనుడు హాబ్స్ ..పదిహేనవ ఏట ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో చేరాడు .ఇరవయ్యవ ఏట డిగ్రీ సాధించాడు .
1608 -1640 కాలం లో కావెండిష్ రాజు కుటుంబం లో అధ్యాపక వృత్తి చేశాడు రాజ కుమారుడి తో కలిసి యూరప్ పర్యటన చేశాడు .దానితో ముసలి తనం లో ఉన్న గెలిలియోను ,డేకార్టు స్నేహితులతో గొప్ప పరిచయం కలిగింది హాబ్స్ ‘’ప్రాకృతిక రాజకీయ నియమ ప్రవేశం ‘’(the elements of law natural and political )గ్రంధం రచించాడు .ఇందులో నిరంకుశ రాజరికాన్ని సమర్ధించాడు ..ఆ నాటి పార్ల మెంటు లోని స్వతంత్రుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని భావించి ఫ్రాన్స్ దేశానికి పారిపోయాడు ..
![]()
‘’లేనియన్’’ అనే మరో గ్రంధాన్ని రాశాడు లార్డ్ క్రామ్వేల్ కాలం లో బ్రిటిష్ సింహాసనాన్ని అధి స్టిం చటానికి తోడ్పడ్డాడు .రెండవ చార్లెస్ హక్కుల్ని సమర్ధించాడు .1651 లో సెయింట్ జర్మేన్ వద్ద ప్రవాసం లో ఉన్న చార్లెస్ సభలో ఈ గ్రంధాన్ని సమర్పించి నప్పుడు సభ నుండి హాబ్స్ బహిష్కరింప బడ్డాడు .హాబ్స్ ను ”ఫాదర్ ఆఫ్మోడరన్ పొలిటికల్ ఫిలాసఫీ ”అంటారు . ఆయన దృష్టిలో మనషులు చలనం ఉన్న వస్తువులే . ఆయన చెప్పిన సోషల్ కాంట్రాక్ట్ అన్ విషయం పొలిటికల్ ఫిలాసఫీకి ఆధారం .జామెట్రీ చరిత్ర దియాలజీ లలోను హాబ్స్ ఘనుడు .
రాజుకున్న సర్వ సత్టాక అధికారాన్ని (సావేరినిటి )హాబ్స్ సమర్ధించాడు .అతని సిద్ధాంతాలన్నీ కార్టీసియన్ సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి .దివ్య శక్తుల ప్రమేయం లేకుండా ప్రక్రుతి నియమాలకు మాత్రమె లోబడి ఈ విశ్వమంతా పని చేస్తోందన్నాడు .శాస్త్రీయ పద్ధతిలో మనషి విశ్వ రహస్యాలను అర్ధం చేసుకోవాలన్నాడు .రాజకీయం లో స్పినోజా అధిస్టించ లేక పోయిన స్తానాన్ని హాబ్స్ అధిష్టించాడు .మానవ జీవితం మొదట్లో నిస్సహాయం ,దీనం హీనం అసభ్యం .ఈ ప్రాకృతిక స్తితి లో ఉన్న వారంతా అధికారం కోసం అర్రులు చాస్తారు .ప్రతి వాడు తన పొరుగు వాడికి విరోధి .స్వంత ప్రయోజనాలకోసం మనిషి కక్కుర్తి పడతాడు .హాబ్స్ చెప్పిన ఈ ప్రాకృతిక స్తితి అమెరికా లోని రెడ్ ఇండియాన్ల లో ఉంది. జాతుల మధ్య వైరమే వారిజీవితం .’’లేనియతాన్ ‘’రాస్తున్న సమయం లో బ్రిటన్ లోప్రాజల మధ్య అంతర్యుద్ధం జరిగింది ఇది కూడా దాని వంటిదే అన్నాడు హాబ్స్ .
ఈ సంగ్రామ స్తితి ఎక్కువ కాలం కోన సాగదని ,మానవుడు ఇది గ్రహించి ఘర్షణ వదిలి సంఘ శక్తి తో నియంత్రణ చేస్తాడ న్నాడు .ప్రతి వాడు తనను తానూ నియమించుకోవటానికి కొంత హక్కు కోల్పోవాలి రాజుకు ఆ హక్కులు సంక్రమింప జేయాలి .దానివల్ల దేశాన్ని శత్రువుల నుండి కాపాడగలుగుతాడు .రాజుకు ప్రజలు పూర్తీ విధేయత తో ఉండాలి.దేశ విదేశాల వ్యవహారాలలో రాజు నిరంకుశుడు .దాన్ని ప్రశ్నించ రాదు .సంధి విషయం లోను రాజు ప్రజాభిప్రాయాన్ని పరిగనించ క్కర్లేదు .వ్యక్తీ స్వేచ్చను రాజుకు కానుక ఇచ్చి అతను ఆడమన్నట్లల్లా ప్రజలు ఆడాలి .రాజ శాసనం దైవ శాసనమే తిరుగు లేనిది .మత విషయం లో కూడా రాజు నిరంకుశుడే .రాజ శాసనాన్ని ఉల్లంఘించిన మతగురువు ను రాజు నిర్దాక్షిణ్యం గా అదుపు చేయాలి .అని హాబ్స్ పండితుడు అభి ప్రాయ పడ్డాడు .1679 డిసెంబర్ నాలుగున మరణించాడు
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-13- ఉయ్యూరు

