మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28
హెర్బర్ట్ స్పెన్సర్
హెర్బర్ట్ స్పెన్సర్ బ్రిటన్ దేశం లో 1820 లోఏప్రిల్ ఇరవై ఏడున జన్మించిన మేధావి .పరిణామవాద సిద్ధాంత కర్త .యూని వర్సిటి లో చేరి విద్య నేర్వా లనే కోరిక ఉండేది కాదు కనుక స్వయం గా అన్నీ నేర్చుకోవటం ప్రారంభించాడు .కొద్ది కాలం ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా తర్వాతా రైల్వే ఇంజినీర్ గా ఉన్నాడు .పత్రికా రచన ప్రారంభించాడు స్వతం గా గ్రంధ రచన సాగించాడు .పరిణామ సిద్ధాంతాన్ని ఆధారం గా చేసుకొని 36 ఏళ్ళు కష్టించి అన్ని ముఖ్య శాస్త్రాలను క్రోడీకరించి 10సంపుటాలుగా స్వంత దార్శనిక శాస్త్రాన్ని రచించాడు .
స్పెన్సర్ తన భావ జాలానికి ‘’ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్య వాదం’’ (పాజిటివిజం )అని పేరు పెట్టాడు .పరిణామ సిదద్దం తాన్ని అన్ని విషయాలకు జోడించిన మొదటి వాడు స్పెన్సర్ .డార్విన్ రాసిన ‘’ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ‘’చూసిన తర్వాత తన సిద్ధాంతాలను కొంత సవరించుకొన్నాడు జీవము ,మనస్సు ,సమాజం వంటి వాటిని భౌతిక ద్రవ్యం ,గతి శక్తి అనే వాటి ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు లోపలి బయటి సంబంధాలకు అనుగుణం గా సమాధాన పరచటం లోనే జీవం యొక్క గొప్ప తనం ఉంది అన్నాడు .సేంద్రియ ప్రపంచం లో పిండ నిర్మాణం,సజాతీయ రూపాల నుంచి విజాతీయ రూపాల వరకు నడిచింది అనే ‘’ఫాన్ బాయర్‘’నియమాన్ని స్పెన్సర్ తన ‘’ప్రధమ తత్వాలు ‘’(ఫస్ట్ ప్రిన్సిపుల్స్)లో విపులంగా రాశాడు
జ్ఞేయ ప్రపంచానికి సంబంధించిన నియమాలలో ఏకత్వాన్ని స్పెన్సర్ సాధించ గలిగాడు .శక్తి నిత్యత్వాన్ని గుర్తించటం ద్వారా దీన్ని సాధించ వచ్చు నని చెప్పాడు .ప్రకృతిలో మార్పులు రెండు రకాలుగా ఉంటాయి .పరిణామ ప్రక్రియ ,విలయవ ప్రక్రియ-(ప్రాసెస్ ఆఫ్ డిస్త్రక్షన్ )లు .సేంద్రియ జీవాలు ,జాతులు ,గ్రహాలూ గ్రహ కుటుంబం ,సమాజ వ్యవస్థ వంటివి ముందుగా ఏర్పడి అభి వృద్ధి చెంది వ్యవస్తితాలైనప్పుడు పరిణామం జరుగుతుంది అన్నాడు .ఒక సమూహం అవ్యవస్తితం అయి నాశనం చెందితే విలయం జరుగుతుంది
![]()
పరిణామ ప్రక్రియ లో రెండు రూపాలున్నాయన్నాడు స్పెన్సర్ .ప్రధానమైనది , గౌణమైనది .ప్రధాన పరిణామం లో భౌతిక ద్రవ్యాలు వ్యవ స్తీకరణం చెందుతాయి తర్వాత గతి విలయం జరుగుతుంది .సమాజం లో వివిధ మార్పుల వల్ల జరుగు పరిణాం గౌణ పరిణామం .అప్పుడు ఏక రూప స్తితి అనేక రూపాలవుతుంది ప్రవ్రుత్తులలో అభ్యాసాలలో సంకీర్ణత వైవిధ్యం దీని ఫలితాలే .ప్రవర్తన కూడా పరిణామానికి సంబంధించినదే .పరి స్తితులకు అనుగుణం గా మనిషి తన చేస్టలను సవరించుకోవటమే ప్రవర్తన .దీని విలువ ఫలితాన్ని బట్టి నిర్ణయించాలి బ్రిటిష్ అనుభావ వాదుల నైతిక సంప్రదాయమైన’’ఉపయోగితాసుఖ వాదాన్ని‘’స్పెన్సర్ అనుసరించాడు .ఇమాన్య్యాల్ కాంట్ గారి దృశ్య వాదం పైనఆధార పడి తన ‘’అజ్నేయతా వాదం ‘’నిర్మించాడు స్పెన్సర్ .దీని వల్ల భౌతిక వా దప్రమాదం తప్పింది .19 శతాబ్దం లో స్పెన్సర్ ప్రభావం అమోఘం .ఎవరి నోట విన్నా స్పెన్సర్ మాటే వచ్చేది అంతగా పాతుకు పోయాడు దార్శనిక హృదయాలలో.కాని ఈ రోజు అయన భావాలు సజీవం గా నిలిచింది మాత్రం అతి తక్కువే .83 ఏళ్ళు జీవించి 1903డిసెంబర్ ఎనిమిది న స్పెన్సర్ మేధావి మరణించాడునోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు కాని అందలేదు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-13 ఉయ్యూరు

