ఆంద్ర వివేకానందులు ,ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -4(చివరి భాగం )
ప్రభాకర ప్రతిభా బారతి
ప్రభాకరులు రాసిన ‘’భారతీయ సంస్కృతీ ‘’లో భారతి అనే మాటకున్న అర్ధాన్ని విపులం గా వివరించారు .ఆత్మ ను ఉద్ధరించేదే భారతీయ సంస్కృతీ అని , భావం .రసం శరీరం చేత పవిత్రమై వేలుస్తోందని అన్నారు భావం అనేది మానసిక సంబంధం ,రసం కావ్య సంబంధం ,శరీరం దేహ సంబంధం ,అంటే మనో ,వాక్ కాయములు సౌమ్య స్తితిని పొంది భారత అనే అక్షరాత్మ గా ఏర్పడిందని వివరణ ఇచ్చారు .
ఆది కాలం లో మన దేశాన్ని ‘’అజనాభం ‘’అనే పేరు తో పిలిచే వారని ,అజుడు అంటే బ్రహ్మ కనుక ఆయన సృష్టికి ఈ దేశం నాభి స్తానం గా ఉంది కనుక అజ నాభం అనే పేరు మన దేశానికి ప్రసిద్ధమయిందని చెప్పారు .
మన దేశాన్ని మొదట పాలించింది స్వాయం భువ మను చక్ర వర్తి.అతనికి ప్రియ వ్రతుడు ,ప్రియ వ్రతుడు ,అగ్నీద్రుడు,పుత్రులు అగ్నీధ్రు నికి నాభి నాభికి ,ఋషభుడు ,అతనికి భరతుడు జన్మించారు .భరతుడు పాలించిన కాలం లో అజనాభం పేరు భారత దేశం గా మారి పేరొందింది .
భారతీయులు ఆర్యులని ,హిందువులు అనీ వ్యవహరింప బడుతారు .ఆర్ష ధర్మాన్ని అనుసరించే వారు ఆర్యులు .వారి ధర్మం ఆర్ష ధర్మమ ని ఆర్య ధర్మమని పిలువ బడుతోంది .’’ఆరాత్ యాంతీతి ఆర్యః ‘’అంటే దగ్గర మార్గాన కానీ ,దూర మార్గాన కాని భగవంతుని చేర గల వారే ఆర్యులు అని అర్ధం చెప్పారు పండితుల వారు .
భారతీయ వాజ్మయం లో ‘’హిందూ ‘’పదానికి ఉన్న పవిత్రతను రెండు వందల పేజీలలో ‘’హిందూ మతం ‘’అనే పుస్తకం లో వివరించారు .
‘’హీనంచ దూష యత్యేవ హిందూ రిచ్యుతే ప్రియే ‘’హీన మైన తుచ్చమైన విషయాలను ప్రేమించకుండా సర్వోత్క్రుస్త తత్వాన్ని ,అభి లషించే వాడు హిందువు ‘’అని ‘’మేరు తంత్రం ‘’అనే గ్రంధం లో పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించి నట్లు తెలుస్తోంది .’’శబ్ద కల్పద్రుమం ‘’అనే నిఘంటువులో ‘’హీనం దూష యతీతి హిన్దుహ్ ‘’అంటే హీనమైన దాన్ని దూషించే వాడు హిందువు అని చక్కగా వివరింప బడింది అని ప్రభాకరులు చెప్పారు .
‘’అధ గచ్చేత్ రాజేంద్ర దేవికాం లోక విశ్రుతాం –ప్రసూథిహ్ యత్ర విప్రాణాం శ్రూయతే భరతర్షభ ‘’అని భారతం లోని తీర్ధ యాత్రా పర్వం లో హిందువుల మూల పురుషులు హిమాలయ పర్వత ప్రాంతం లోని ‘’పవిత్ర దేవికా నదీ ‘’తీరం లో జన్మించారని ‘’ధర్మ రాజ్యం ‘’అనే గ్రంధం లో పండితుల వారి వాక్కు .
‘’రుణాని త్రీణ్య.పక్రుత్య మనో మో క్షే నివేశ యేత్’’-రుషి ఋణం పితృ ఋణం దేవతా ఋణం అనే మూడు రుణాలను తీరిస్తే కాని ముక్తికి ప్రయత్నించ రాదు అని భారతీయ సిద్ధాంతం .బ్రహ్మ చర్య ,చేస్తూ వేదం శాస్త్ర పురాణాల రహస్యం తెలుసుకొంటే రుషి ఋణం నుంచి ,మంచి సంతానాన్ని పొంది పితృ రుణాన్ని ,యజ్న యాగాది క్రతువులు చేస్తే దేవతా రుణాన్ని తీర్చుకో వచ్చు .ఈ మూడు రుణాలు తీర్చుకుంటే ముక్తికి అర్హత లభిస్తుంది .అని ‘’ధర్మ రాజ్యం ‘’లో వివరించారు .
దేవతలు వారి తత్వాల గురించి ఎన్నో అఆసక్తి కరమైన విశేషాలు వివ రించారు .’’అస్వప్నయ స్తరనయః ఆశ్రమిష ‘’అని వేదం చెప్పింది .దేవతలు నిదుర లేని వారు సదా యువకులు .శ్రమ తెలియని వారు .
‘’విద్వాం సో హ వై దేవః ‘’అంటే దేవతలందరూ విద్వాంసులు .’’పరోక్ష ప్రియా ఇవహి దేవః ‘’దేవతలు పరోక్ష ప్రియులు .నిరాకార ,సాకార రూపాలలో దేవతలుంటారు .దేవతలా తత్త్వం అంతరార్ధ బాహ్యర్ధాలతో ఉంటాయి .ఒకే నటుడు అనేక వేషాలు వేసి నట్లు పరమాత్మ కూడా గుణ కర్మలను స్వీకరించిలీలా విలాసం ప్రదర్శిస్తాడు .అధర్వ వేదం లో దేవతలు ఎముకలు లేని వారని ,అందువల్లే చర్మం ,మాంసం నెత్తురు ఉండవని పాప రహితులని వాయు బలం తో పరిశుద్ధ చరిత్ర కల వారని ,శుచి మంతులని చెప్పబడిందని వివరిస్తారు ‘’
‘’అవస్థాహ్పూతాహ్పవనేన శుద్ధాఃశుచయః –శుచి మపి యంతి లోకం నైషాం శిశ్నిం ప్రదహతి
జాత వేదాఃస్వర్గే లోకే బుహు స్ట్రైణమేషాం’’ఇదీ పై దానికి శ్లోకం .
‘’ఆప్య తైజస వాయవ్యాని లోకాంతరేశరీరాణి ‘’అంటే దేవతా శరీరాలు కంటి మయాలు ,తెజోమయాలు ,జల స్వరూపాలు మానవులకున్న ఆకలి దాహం కామాగ్ని దేవతలకు లేవు వారి శరీరం అన్నమయ ,శుక్ల ,షోణిత సంబంధం లేనివి కనుక కామ లోలురు కారు .దేవా చరిత్రలలో అంతరార్ధం ఉంటుంది అది విడ మార్చ గలగాలి .పంతుల గారి గ్రంధాలన్నీ సరస్వతీ శుక్తి ముక్తా ఫలాలే .
ప్రభాకరాస్తమయం
హిందూ గ్రంధ మాల ,భారతీయ ధర్మ ప్రచారక మిషన్ ,శ్రీ ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్ ట్రస్ట్’’ధర్మ సంస్తాన్ ,మొదలైన వాటిని నిర్వహించి ఆధ్యాత్మిక పత్రికా వ్యవస్తాపకులుగా వ్యవహరించి ,’’విశ్వ హిందూ పరిషత్ ‘’ప్రారంభ దశలో ఆంద్ర ప్రదేశ్ కు ఉపాధ్యక్షులుగా పని చేసి ,’’సదా చార నిబందినీ పరిషత్ ‘’అధ్యక్షులై,శ్రీ ప్రభాకరులు చేసిన సేవ చిరస్మరణీయం. గజారోహణాది మహా సత్కారాలు పొంది ఏడు శతాబ్దాలు అవిశ్రాంత ధర్మ ప్రచారం చేసిన ప్రతిభా భాస్కరులు పండితులు .11-12-81 విజయవాడ సత్య నారాయణ పురం లోని వారి స్వగృహం ‘’హిందూ భవనం ‘’లో సునాయాస మరణం పొందారు. పండితుల వారి హంస బ్రహ్మ లోకం చేరింది .’’మరణం ఒక అవస్తా భేదం ‘’అని హిందూ సమాజ భావన .సూర్యాస్తమయం లాగే ప్రభాకర నిర్యాణం ఒక సహజమైన విషయమే .జ్ఞాన సాగరం లో ఉవ్వెత్తుగా లేచి ,మళ్ళీ సముద్ర గర్భం లో కలిసి పోయిన ఒక విజ్ఞాన తరంగం ప్రభాకర ఉమా మహేశ్వర పండితులు .
‘’ ‘’సమస్త ధర్మ సంశాయాన్ధకార హ్రుత్ప్రభాకరః –ప్రభాకరాన్వాయ దుగ్ధ వారి దే స్సుదాకరః
సుదాకరోప మాన సద్యశో ల సద్దిగగంతః –విపస్చితాం వారో జయత్యసా ఉమా మహేశ్వరః ‘’.
సంపూర్ణం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-13- ఉయ్యూరు


శ్రీ ఉమా మహేశ్వర పండిట్ గారి ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే. చిన్నతనంలో 1969 లో అనుకుంటాను వారి ఉపన్యాసం రామకోటి మహోత్సవంలో విన్న గుర్తు. వారి ఇంటి పైన ఒక విష్ణు మూర్తి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహ భంగిమ విలక్షణంగా ఉంటుంది. విష్ణువు చేతికి సుదర్శన చక్రం ఉండదు. విష్ణుమూర్తి పాపుల మీదకు తన సుదర్శనాన్ని ప్రయోగించి, ఆ ఆయుధం తిరిగి రావటానికి వేచి ఉన్నట్టుగా ఉంటుంది ఆ భంగిమ. ఇప్పటికీ ఆ విగ్రహం వారి ఇంటి మీద చూసిన గుర్తు (దాదాపు సంవత్సరం క్రితం చూశాను). వారి జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. వారి ఫొటొ ఉంటే ప్రచురించగలరు.
LikeLike