విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -7

విజ్ఞులైన  అలనాటి మన  శాస్త్రజ్ఞులు -7
వైద్య శాస్త్రం లో మన భాగ స్వామ్యం
ప్రాచీన భారతం లో ”సిద్ధ వైద్యం ”ప్రచారం లో ఉండేది .చరకుడు ప్రస్తావించిన వాటిల్లో ఇది కూడా ఒకటి .లోహాలను మందులతో మిశ్రమం చేసే ప్రక్రియే సిద్ధ వైద్యం ..శతాబ్దాల బాటు ఇది ఎంతో మందికి ఉపయోగ పడింది .ఈ వైద్యం లో మానవ శరీరాన్ని అయిదు భాగాలుగా పరిగణించారు .అంటే మానవ శరీర నిర్మాణం గురించి అప్పటికే వారికి పూర్తీ అవగాహన ఉందన్న మాట .దీని పుట్టుకలో మూడు సిద్ధాంతాలు ముఖ్యమైనవి .ఒకటి ”మెమోరియల్ కాంటి నెంటల్,రెండవది మెడిటేరెనియన్ ,మూడోది ”సౌత్ ఇండియన్ ”.
వేమోరియన్ గా పిలువ బడే హిందూ మహా సముద్రం లో ఒక ద్వీపం కాల గతిలో సముద్రం లో కలిసి పోయింది .మానవత్వ భావన మానవుడిలో ఏర్పడి యెంత ప్రాచీనమిందో అంత పాతది ఈ వైద్యం .దీనినే ”హీలింగ్ శాస్త్రం ”అంటారు .అంటే స్పర్శ ద్వారా రోగ నిర్ధారణ చేయటం అన్న మాట ..మానవ తోలి పుట్టుక ఈ ద్వీపం లోనే అని ఈ సిద్ధాంతం చెబుతోంది .
మెడిటరేనియన్ సిద్ధాంతం లో ద్రావిడులు ఇక్కడి వారే .ఆర్యుల బాధ పడలేక దక్షిణ భారతం చేరారు .వీరి ద్రుష్టి లోహ శాస్త్రం పై కేంద్రీకరించారు .దీనిద్వారా సిద్ధ వైద్యం ప్రచారమైంది .
సౌత్ ఇండియన్ సిద్ధాంతం -తమిళులు దక్షిణ భారతం లోనే  ఆవిర్భ వించారు .సిద్ధ వైద్యం ఇక్కడే పుట్టిందని చెబుతారు .ఈ వైద్యం ఇప్పటికి బ్రహ్మ పుత్రా లోయ లో ,తుంగ భద్ర లోయలో తమిళ నాడులో అమల్లో ఉంది దీన్ని ”సిద్దా మెడికల్ సైన్స్ ” అంటారు .
సిద్ధ వైద్యం ఒక గొప్ప సంస్కారవైద్యం .మానవత్వ వికాస వైద్యం .రోగుల్ని ఆత్మీయులు గా భావించే వైద్య విధానం .నాడి ని పరీక్షించి రోగ నిర్ధారణ చేయటం ఇందులో విశేషం .మణి కట్టు కు అంగుళం కింద నాడి ఉంటుంది ఆ భాగం లో మెత్తగా నొక్కితే మూడు నాడుల స్పందన తెలుస్తుంది మొదటి నాడిని వాత నాడి అని రెండో దాన్ని పిత్త నాడి అని ,మూడవ దాన్ని కఫ నాడి అంటారు .ఈ నాడులు 4;2;1నిష్పత్తి లో పని చేస్తాయి .వీటి కదలికలను బట్టి వ్యాధి నిర్ధారణ చేస్తారు .
ఈ సిద్ధాంతం ప్రకారం లోకం లో 4,448రోగాలున్నాయి .అందులో నాలుగు వేల వరకు మనుష్యుల ద్వారా వ్యాపించేవే .సిద్ధ వైద్యం లో అనేక శ్రేణులు ,రకాలు ఉన్నాయి .కూరగాయలు ,ఆకు కూరలు ,నుంచి 1008రకాల మందులు ,విష పదార్ధాల నుంచి 64మందులు ,అనేక లవణాల నుంచి 28,లోహాల నుండి9, సేంద్రియ సమ్మేళనాల నుంచి 12,రకాల మందులు ,ఇతర పదార్ధాల నుండి మరి కొన్ని మందులు తయారు చేస్తారు .
శైవ మతం విజ్రుమ్భించటం వల్ల సిద్ధ వైద్యం తెరా మరుగైంది .యా వైద్యం లో ఎన్నో మర్మ సిద్ధాంతాలు ,క్లిష్ట పదజాలం ఉన్నందున అందరికి అర్ధం కాదు .ఈ నాడు సిద్ధ వైద్య ప్రచార కర్త గా ప్రాచుర్యం పొందిన వారు డాక్టర్ చిదంబర నాద పిళ్లే.44తరాలుగా ఈ వైద్యం చేస్తున్న కుటుంబం వాడు .4-3-1934లో కన్యా కుమారి జిల్లాలో ఎరినిఅల్ గ్రామం లో జన్మించిన ఈయన సిద్ధ వైద్యం మీద నాలుగు దశాబ్దాల పాటు పరి శోధన చేశారు .మద్రాస్ లో ”సిద్దా మెడికల్ లిటరేచర్ రి సెర్చ్ సెంటర్ ”ను 1955లో స్తాపించారు .మైసూర్ ,మద్రాస్ ,పూనా యూని వర్సిటీలలో ”ధానూలజి  ”లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్స్ ఏర్పాటు చేయించారు .”వర్మం ”(దానూలజి )మీద 32సిద్ధాంతాలను పిళ్లే
ప్రతి పాదించారు .”దానూ ఫౌండేషన్ ”స్తాపించి సిద్ధ వైద్యానికి గొప్ప ప్రచారం చేస్తున్నారు .
నాగరకత కు చిహ్నం చక్రం
మానవ నాగరకత ను వేగ వంతం చేసిన ”చక్రం ”రూప కల్పన ప్రాచీన భారత దేశం లోనే జరిగింది .కాని పాశ్చాత్యులు మెసపొటేమియా లో చక్రం రూపు దాల్చిందని అంటారు .మన విష్ణుదేవుని ఆయుధం ”చక్రం ”అన్న మాట అందరు మరచిపోయారు .అలాగే ఆయన చేతిలో ఉండే శంఖం శ్రమ శక్తి కి  ఆలంబనం .జన జాగృతినిచేసి కార్యోన్ముఖులను చేసేది శంఖం . శంఖమే ”సైరన్ ”గా మారిందేమో ?మానవ జాతికి చక్రం రూపాన్ని సైరన్ ను అందించింది భారతీయులే అని అర్ధమవుతోంది .
బ్రహ్మ వర్చస్సు పెంచే ”యజ్నోపతి ”
ప్రాచీన భారతీయ వైద్య విధానాల సమ్మిళిత మైనదే  ”యజ్నోపతి ”.హరిద్వార్ లో శాంతి కుంజ్ లో ”బ్రహ్మ వర్చస్సు ”పరి శోధనాసంస్త  ”యజ్నోపతి ”ని ఆవిష్కరించింది ,ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గా యజ్నోపతి ప్రచారమైంది .
వ్యాధి నివారణకు మూలికాలను ఇస్తారు .మందులే వాడకుండా ఆరోగ్యవిధానం చెప్పే ఆహారపు అలవాట్లను అలవాటు చేయటం లో ఇందులో భాగం .”డ్రగ్ లెస్ తెరపి ”ఇందులో భాగమే .యోగా ,ప్రక్రుతి వైద్యం ,సిద్ధ వైద్యం ,ద్రవ ఘన మందులు అవసరమైతే వాడుతారు .వాయురూపం లో మందులు ఇస్తే వ్యాధులు ఇంకా త్వరగా నయమవుతాయని భావించి ఆ విధానాన్ని ఉపయోగిస్తున్నారు .
యజ్ఞాలలో వాడే ”హవానా ద్రవ్యాలు ”వల్ల వచ్చే పొగ ,మంత్రోచ్చారణ వల్ల శబ్ద వాయు తరంగ కాలుష్యం నివారింప బడుతుంది .హిమాలయ ప్రాంతం లో అనేక ప్రక్రుతి సిద్ధ వన మూలికలున్నాయి .అవి ఎన్నో వ్యాధులకు ఉపయోగ పడతాయి .బ్రహ్మ వర్చస్సు పరిశోధనా  సంస్తదీన్ని నిరూపించింది .మందు వాయు రూపం లో ఊపిరి తిత్తుల ద్వారా చర్మం ద్వారా శరీరం లోకి ప్రవేశించి మానసిక శారీరక రుగ్మతలను నివారిస్తుంది .’
అగ్ని హోత్రమే ఒక ప్రాధమిక చికిత్సా విధానం .”వాతావరణానికి చికిత్స జరిగితే అది మిమ్మల్ని స్వస్త పరుస్తుంది ”అనేది యజ్నోపతి ప్రధాన సూత్రం .వాతావరం, ప్రాణం ,,మనస్సుఒక దాని మీద ఒకటి ఆధార పది ఉంటుంది . రహ్మవర్చస్సు ” లో 450 రకాల ఔషధాలు ,మూలికలు ఉన్నాయి .ఒక ప్రయోగ శాలలో ఒక గాజు గదిలో ”హవాన కుండ ”ను ఏర్పాటు చేశారు దానికి కలుపుతూ ,ఒక వాయు విశ్లేషణ విభాగం ఉంచారు .యజ్ఞం లో ఉత్పత్తి అయిన వాయువులను సేకరించి విశ్లేషణ చేస్స్సస్యతానికి ఇది ఏర్పాటైంది .రక్తం లో వివిధ భాగాలు ,రకారకాల్ గ్రంధులు వాటి పని తీరు యజ్ఞానికి ముందు ,యజ్ఞం తర్వాత విశ్లేషించారు .సత్ఫ్సలితాలు వచ్చాయి .మనుషుల మీదే కాక పశు పక్ష్యాదుల మీద కూడా వృక్షాల మీద కూడా ప్రయోగాలు చేయటం గమనార్హం .అందుకే యజ్ఞాలు చేయమని వీరు హితవు చెబుతారు .సామూహికం గా చేస్తే ”యజ్ఞం ”అవుతుంది .వ్యక్తీ గతం గా చేస్తే ”అగ్ని హోత్రం ”అవుతుంది .ప్రతి ఇంట్లో వీటిని చేసుకొంటే ఇంటి వాతావరణం శుభ్రపడి అందరి ఆరోగ్యాలు బాగు పడి  వాతావరణ కాలుష్యమూ నిర్మూల మవుతుంది ఇదీ ప్రాచీన కాలం లో మన వాళ్ళు చేసిన యజ్న సూక్షం ..
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ –12-11-13- కాంప్- హైదరాబాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సైన్స్ and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.