విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9
వేదాలలో ఉన్న విజ్ఞానం
ఋగ్వేదం లోని ఇరవై ఒక్క శాఖలలో నేటి కాలానికి ఉపయోగ పడే శాఖలు రెండు మాత్రమె అవే -విశాకల ,భాష్య శాఖలు .వీటిలో వ్యవసాయ ,వాణిజ్య ,ప్రయాణ ,ఓడల విమానాల తయారీ ,మొదలైన వివరణలున్నాయి .తైత్తిరీయ యజుర్వేదం లో మూడు ప్రకరణాలైన సంహిత ,ఆరణ్యకం ,బ్రాహ్మణం లలో ఆధునికులకు ఉపయోగపడేది ఒక్క సంహిత మాత్ర్తమే .ఇందులో ఏడు కందకాలున్నాయి .44ప్రపాఠకాలున్నాయి 2196..పనసలున్నాయి .ఇవన్నీ ఆధునిక విజ్ఞాన విశేష భాండా గారాలే .వీటిలో విశ్వావిర్భావం ,గణిత ,ఆరోగ్య శాస్త్రాలు ,అంతరిక్ష శాస్త్రం ,లకు చెందినా పరిశోధనా ఫలితాలున్నాయి .కృష్ణ యజుర్వేదంలో ఆపస్తంభ మహర్షి ప్రతిపాదించిన ”శుల్బ సూత్రాలు ”ఈ నాటి గణితానికి ఎంతో ఉపయోగపడేవి .సామ వేదం కాల భ్రస్టత కు చెందింది. అధర్వ వేదం లో భౌతిక విజ్ఞాన శాస్త్ర మూలాలు అనేకమున్నాయి .ప్రాచీన మహర్షులే అనేక విజ్ఞాన శాస్త్రాలకు పునాదులు వేశారని వీటి వల్ల మనకు తెలుస్తోంది .ఆశ్వలాయన ,సామ్ఖ్యాయనుల సూత్రాలు ఋగ్వేదం లో ను కృష్ణ ,యజుర్వేదం లో ఆపస్తంభ ,మానవ ,వైఖానస ,హిరణ్య కేశీల సూత్రాలు,శుక్ల యజుర్వేదం లో కాత్యాయన ,పారస్కర సూత్రాలు ,అధర్వ వేదం లో కౌశిక సూత్రాలు విజ్ఞాన గ నులే .,
భూర్జర పత్రాలు
కాగితం రాక ముందు రాత అంతా తాళ పత్రాల మీద భూర్జ పత్రాల మీదే జరిగేది .భూర్జ వృక్షాలు హిమాలయ సానువుల్లో పెరిగే పొడవాటి వృక్షాలు మన ప్రాచీనులకు వీటిబెరడే రచన కు తోడ్పడేవి .ఈ చెట్లు సముద్ర మట్టానికి పది వేల నుంచి పద్నాలుగు వేల అడుగు ఎత్తున్న ప్రదేశాలలోనే జీవిస్తాయి .వీటికి భోజ వృక్షాలు అనే పేరు కూడా ఉంది .ఇవి నెమ్మదిగా పెరిగే చెట్లు.ఆరు అడుగుల చుట్టుకొలత తో ఎనభై అడుగుల ఎత్తు దాకా పెరుగుతాయి .ఇలా పెరగటానికి వందేళ్ళు పడుతుంది .ఇవి ఏటా ఆకులు రాలుస్తాయి .బెరడు మెరిసే తెల్ల రంగులో ఉంటుంది .ఇది కాగితం లాంటి పదార్ధం తో తయారై ఉంటుంది .మన ప్రాచీనులు ఈ బెరడును చుట్టలుగా చుట్టి దాని పై రాసుకొనే వారు .ఈ చెట్టులో ప్రతిదీ ఉపయోగ పదేదే .అందనంత ఎత్తు పెరగటం వల్ల ప్రత్యామ్నాయాం వెతుక్కోవాల్సి వచ్చింది అప్పుడు జంతు చర్మాలపై లేఖనం సాగించారు
మొదటి శవ పరీక్ష చేసిన ప్రొఫెసర్ మధుసూదన గుప్త
ఆ రోజుల్లో శవాన్ని తాకాలంటే భయం సందేహం .అలాంటిది 1835జనవరి28న కలకత్తా లో ఏర్పాటైన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ పండిట్ మధు సూదన గుప్తా విద్యార్ధులకు శరీరం లో ఉన్న వివిధ భాగాలను పరీక్షించి తెలియ జేసే నిమిత్తం రహస్యం గా కాలేజికి దగ్గరలో ఒక పాడుబడిన ఇంటికి తీసుకొని వెళ్లి మానవ కళేబరం మీద శవ పరీక్ష చేసి అందులోని భాగాలన్నీ విడమర్చి చూపించివిద్యార్ధులకు అవగాహన కలిగించారు .ఇదే ఆధునిక కాలం లోమనదేశం లో జరిగిన మొదటి శవపరీక్ష గా చరిత్రకు ఎక్కింది .
భారతీయ విజ్ఞానాన్ని ఉపయోగించుకొన్న జర్మని
మన భరద్వాజ మహర్షి ”విమాన శాస్త్రం ”రాశారని అందరు చెప్పిన విషయమే కాని అందులో ఉన్న మర్మాలను మన వాళ్లకు తెలుసుకొనే తీరిక ఓపిక లేక పోయాయి ప్రోత్సహించే వారూకరువయ్యారు. జర్మన్లు ఈ విమాన శాస్త్రాన్ని గురించి విని ఆ గ్రంధాన్ని సంపాదించి భారతీయ సంస్క్రుతపండితుల్ని జర్మనీకి రహస్యం గా తీసుకొని వెళ్లి వారితో అందులోని విషయాలన్నీ విశద పరచుకొని జర్మని లో మొదటి సారిగా విమానాన్ని తయారు చేశారు అన్నది తరువాత బహి రంగమైన సత్యం .
భారతీయ శాస్త్ర వేత్తలు ఇద్దరు కర్ణాటాక కు చెందినా వారొకరు మహా రాష్ట్ర కు చెందినా వారొకరు కలిసి మొదటి సారిగా భరద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి మొదటి విమానాన్ని తయారు చేసి రైట్ బ్రదర్స్ కంటే ముందే బొంబాయిలో ఎగిరించారు .ఈ విషయం బయట పడితే తమ పరువు పోతుందని ఆ నాటి పత్రికలూ ఈ వార్తను ప్రచురించకుండా బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు .కాని సత్యం దాగదుకడా .కొన్ని నెలల తర్వాత తిలక్ గారి ”కేసరి ”పత్రిక లో భారతీయులు ఎగుర వేసిన మొదటి విమానం విషయాలన్నీ ప్రచురించి లోకానికి మొదటి సారిగా తెలియ జేసింది దీన్ని కక్కా లేక మింగా లేక పోయారు తెల్ల దొరలూ .ఈ విషయాలన్నీ పూజ్యులు శ్రీ జాను మద్ది హనుమత్ శాస్త్రి గారు విపుల మైన ఒక వ్యాసం లో వివరించారు దీన్ని ఆధారం గా చేసుకొని నేను కూడా ”మొదటి విమానాన్ని ఎగరేసింది మనమే ”శీర్షిక తో సరసభారతి లో ఏడాది క్రితం ఒక వ్యాసం రాశాను చదివే ఉంటారు మీరందరూ .
జర్మని నియంత హిట్లర్ మరింత ముందుకు వెళ్లి మన ప్రాచీన విజ్ఞాన రహస్యాలను సంగ్రహించిన ఉదంతాన్ని ఇప్పుడు తెలియ జేస్తాను .హిట్లర్ ఆయుధ నిర్మాణం లో యెంత ముందుకు వెడుతున్నా శాస్త్రాలలో ఉన్న యుద్ధ పరికరాలు ,ఆయుధ నిర్మాణం లోని రహస్యాలను జర్మనీ వారు చేదించ లేక పోతున్నారు .అప్పుడు యజుర్వేద కర్మ కాండ పరంగా ,తాంత్రిక విద్యా పరంగా ,ఆధ్యాత్మ ,వైజ్ఞానిక పరం గా భావాన్ని అర్ధాన్ని విశదీకరించి చెప్పగల సామర్ధ్యం ఉన్న పండితులకోసం రహస్యం గాతెలుసుకొనే నిమిత్త్తం ఒక బృందాన్ని పంపాడు .అప్పుడు ఆ రహస్య గూద చారులకు తూర్పు గోదావరి జిల్లా రాజ మండ్రికి చెందిన ”దండి భట్ట విశ్వ నాద శాస్త్రి” అనే బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి తెలిసింది ఈ ముఠా ఆయన్ను రహస్యం గా అనుసరిస్తూ విశాఖ పట్నం కొత్త వలసకు వెళ్లి తిరిగి వస్తున్నా శాస్త్రి గారిని దాదాపు కిడ్నాప్ చేసి విశాఖ రేవు పట్నం గుండా జర్మనీకి తీసుకొని వెళ్ళారు .
అప్పటికే హిట్లర్ ఆదేశాలతో బాంబుల తయారీ లో నిమగ్న మై ఉన్న జర్మని శాస్త్ర వేత్తలకు వాటిని రాశులు రాశులుగా నిల్వ చేస్తున్నప్పుడు ఒత్తిడికి పేలి పోవటం చాలా చికాకు కలిగిస్తూ బుర్ర బద్దలు కొట్టుకొంటున్నారు ఈ గండం నుంచి యెట్లా బయట పడాలో అని .దీన్ని గమనించిన శాస్త్రిగారు యజుర్వేదసం లో ఉన్న ఒక శ్లోకానికి వైజ్ఞానిక పరమైన అంతరార్ధాన్ని విడమర్చి చెప్పారట .దాని ప్రకారం చేస్తే బాంబులు ఒరిపిడికి పేల కుండా ఉంటాయని తెలియ జేశారట .అయన చెప్పినట్లే చేసి బాంబులు నిలవ చేయగలిగారని చరిత్ర చెబుతోంది .
విశ్వ నాద శాస్త్రి గారు జర్మనీ లో భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని అంతా విశదపరిచారట .జర్మనీలో శాస్త్రి గారు అత్యంత ఆడరనణీయ మైన వ్యక్తిగా నిలిచారు మనకు ఈ విషయం ఇటీవలి కాలం వరకు తెలియనే తెలియదు .ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో కేంద్ర ప్రభుత్వ భారత దేశ రాయ బారి జర్మనీ వెళ్ళాడు .అక్కడ ప్రభుత్వ కార్యాలయం లో ఒక చిత్ర పటాన్ని ఆయనకు చూపిస్తూ ఆయన ఎవరో తెలుసా అని అడిగారట .ఆయన నోరు వెల్ల బెట్టి తెలియదని నిజాయితీగా చెప్పాడట .అప్పుడు జర్మనీ అధికారులు ”వీరి పేరు విశ్వనాధ శాస్త్రి .వీరు వేదాలలో ఉన్న ఎంతో శాస్త్రీయ విజ్ఞానాన్నిమాకు అంద జేసిన మహనీయులు . అందుకే ఈ స్మ్రుతి చిహ్నం మేము కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకోన్నాం ”అని చెప్పారట .ఆయన గురించి మనకు అసంపూర్తిగానే తెలుసు .కాని జర్మన్లకు ఆరాధ్యులైనారు దండి భట్ట విశ్వనాధ శాస్త్రి .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ – .14-11-13-కాంప్-హైదరాబాద్
వీక్షకులు
- 1,107,486 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

