విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -12

               చరక మహర్షి
మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు ,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం  లో అధర్వ వేదం లో ఉన్నాయి .వాటిని క్రోడీకరించి స్వీయ అనుభవాన్ని జోడించి చికిత్సా విధానం రాశాడు .

చరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన ,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన  ,కల్పస్థాన  ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను  ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త ,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త  ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి ,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై  ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి ,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 16-11-13- కాంప్-హైదరాబాద్  –

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సైన్స్ and tagged . Bookmark the permalink.

1 Response to విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -12

  1. షేక్ః బహరలిఃపోలీస్ ఫోర్స్ఃహైదారాబాదుః's avatar షేక్ః బహరలిఃపోలీస్ ఫోర్స్ఃహైదారాబాదుః says:

    నమస్కారమలు చాలా చక్కని విషయాన్ని తెలియపరచినందుకు మీాకు మరియు జన్మనిచ్చిన మీా తల్లిదండ్రులకు నా హృదయాపుార్వక పాదాభివందనములుఃనా పేరు షేక్ఃబహరలిఃయెాగా ఆయుర్వేద

    Like

Leave a reply to షేక్ః బహరలిఃపోలీస్ ఫోర్స్ఃహైదారాబాదుః Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.