విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15
కొందరు అలనాటి వైద్య శాస్త్రజ్ఞులు -2
అరుణ దత్త
పన్నెండవ శతాబ్దికి చెందిన బెంగాలీ వైద్య శాస్త్ర వేత్త .వ్యాఖ్యాన కర్త గా మంచి పేరు .వాగ్భాతుని ‘’అష్టాంగా హృదయ ‘’మీద వ్యాఖ్యానం గా ‘’సర్వాంగ –సుందర ‘’రాశాడు .సుశ్రుత సంహిత మీద కూడా వ్యాఖ్యానం రాశాడు .కాని లభ్యం కావటం లేదు .భూగర్భ శాస్త్రం ,భావన నిర్మాణ శాస్త్రం మీద’’మనుప్యాలాయ చంద్రిక ‘’రచించాడు .
ఆత్రేయ పునర్వసు
ఎనిమిదో శతాబ్దపు వైద్య వేత్త .వసిష్ట మహర్షికి కుమారుడు .హిందూ వైద్య శాస్త్రానికి మొదటి క్రమానుగత అధ్యాపకుడు. భారద్వాజ మహర్షి శిష్యుడు .బ్రహ్మ ప్రజాపతి మొదలైన ఆరుగురు శిష్యులు –అగ్ని వేశ ,జాతుకర్ణ ,భేళ ,హరిత క్షార పాణి ,పరాశరులు సంయుక్తం గా ‘’కాయ చికిత్స ‘’మీద రాసిన వాటిని క్రోడీకరించాడు .వ్యాదుల్ని సాధ్య, అసాధ్య, య్హాప్య అనే వర్గాలుగా విభ జించాడు .’’ఆత్రేయ సంహిత ‘’అనే ఆయన
సంపుటీకరణ గ్రంధం మన దేశం లో అతి ప్రాచీన వైద్య గ్రంధం .ఇందులో 4,65,ooo శ్లోకాలున్నాయి .
మోరేశ్వర
పది హేడవ శతాబ్దికి చెందిన వాడు .తండ్రి మాణిక భట్టు సుప్రసిద్ధ వైద్యుడు .’’నిదాన సిద్ధి ,వైద్యామృత ‘’గ్రంధాలు రాసి అందులో ఎన్నో రోగాల చికిత్సలను వివరించాడు .
మిల్హణ
పదమూడో శతాబ్దం లో త్రిభువన గిరి లో పుట్టాడు .తండ్రి కులోద్ధార .’’చికిత్సా మిత ‘’సంస్కృత గ్రంధాన్ని రాశాడు .నాలుగు వేల శ్లోకాలున్న గ్రంధం ఇది
సారంగధర
1363లో లో జన్మించాడు .యితడు రాసిన ‘’సారంగధర సంహిత ‘’వైద్య సిద్ధాంత గ్రంధం .రెండో పుస్తకం ‘’సారంగధర పధ్ధతి ‘’నీతి విషయాల సంకలనం .ఇతని గ్రంధాలు గొప్ప పేరు పొందాయి .
శివ దాస సేన
1448 లో భీర్భం లో పావన జిల్లాలో ఉండే వాడు .బార్బరాషా రాజు ఆస్తాన వైద్యుడు గా ఉన్నాడు .’’తత్వ ప్రదీపిక ,తవ బోధ వ్యాఖ్య టీకా ,ద్రవ్య గుణ సంగ్రహ ‘’అనే వ్యాఖ్యాన గ్రంధాలు రాశాడు .
శోధల
పన్నెండవ శతాబ్ది లో గుజరాత్ లో జన్మించాడు .విద్యా నందన కి కుమారుడు .’’బాధ నిగ్రహ ,గుణ సంగ్రహ ‘’అనే రెండు వైద్య గ్రంధాలు రాశాడు .’’భేషజకల్పన’’ లో ఎనిమిది విభాగాలలో వైద్యం లోని సార సంగ్రహాన్ని రాశాడు .ఇది ఒక నిఘంటువు గా గుర్తింపు పొందింది .మూడు వందల ఔషధ గుణాలను వివరించిన పుస్తకం .
భారద్వాజ
ఏడవ శతాబ్దికి చెందిన వైద్య శాస్త్రజ్ఞుడు .బృహస్పతి కుమారుడు .భారతీయ ఆయుర్వేదానికి కృషి చేసిన మొదటి శ్రేణిలోని వాడు .మంచి పరిశోధకుదని కీర్తి పొందాడు .ఈయన వాచా చెప్పిన విషయాలే
‘’సామాన్య –విశేష –గుణ –ద్రవ్య –కర్మ –సమన్వయ ‘’గ్రంధం గా రూపు దాల్చింది .మూత్ర సంబంధ వ్యాధులకు ‘’భారద్వాజీయం ‘’రాశాడు .ఔషధాల తయారీ కి ‘’భేషజ కల్ప ‘’రాశాడు .
నరహరి భట్టు
పధ్నాలుగో శతాబ్ది లో భట్ట సుదేవకు జన్మించాడు .వాగ్భటుని ‘’అష్టాంగ హృదయ ‘’కు విద్యాధరుడు రాసిన దుర్ వ్యాఖ్యానాలకు ప్రతిగా ‘’వాగ్భట ఖండన మండనం ‘’రాశాడు .చరక సుశ్రుత సంహితల నుంచి అనేక విశేషాలను సేకరించి తన దైన శైలిలో వ్యాఖ్యాన గ్రంధం గా రాసి ఘన కీర్తి సాధించాడు .
ఇలా ఎందరో వైద్య శాస్త్ర మహాను భావులు –అందరికి వందనాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-13-ఉయ్యూరు

