విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17
పతంజలి మహర్షి
సుఖం ,సంతోషం ,ఆనందం మన జీవితానికి ఆలంబన .శరీరానికి లభించే సంతృప్తి ని ‘’సుఖం ‘’అంటాము .మానసిక సంత్రుప్తియే సంతోషం .ఈ రెండిటికి సంతృప్తి కలిగించేది ఆత్మనందం .ఇది ఉత్తమమైనది .దీన్ని సాధించటానికి ఉపయోగ పడేదే ‘’యోగ ‘’
యోగ అంటే సంపూర్ణ స్తాయిలో ఆధ్యాత్మిక పరి భాష కు చెందింది యోగ .మనసు వేరు ఆత్మా వేరు .ఆత్మా కు సంబంధించిన అన్వేషణ మార్గం ఆధ్యాత్మిక చింతన ,ఆధ్యాత్మిక సాధకులను ‘’యోగులు ‘’అంటారు
యోగికి భౌతిక ,మానసిక అవస్తల మీద సాధికారత లభిస్తుంది .మేధావులు ,జ్ఞానులు కంటే యోగి ని ఉన్నతుడుగా భావిస్తారు .ఆధ్యాత్మిక వేత్త యోగి ఒక్కడే .మన ప్రాచీన రుషి పుంగవులు అందించిన యోగ విద్య ను ‘’పతంజలి మహర్షి ‘’అభి వృద్ధి చేసి సామాన్య జనానికి అందు బాటు లోకి తెచ్చారు .యోగ సాధన వల్ల మన శరీరం లోని ..నిరోటోనిన్ ‘’ధాతువు వృద్ధి చెంది మెదడు లోని ‘’న్యూరో ట్రాన్స్ మిషన్ ‘’ను క్రమ బద్దీకరణ చేస్తుంది అని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు కూడా ధ్రువీకరించారు .శరీరం లో సమ తుల్యత సాధిస్తుందని చెప్పారు.
ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల్లో విస్తృత స్తాయి లో శిక్షణ నిస్తున్నారు .జీవశక్తికి మూల భూతమైన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక పతంజలి యోగ.అధర్వ వేదం లో యోగాభ్యాస సూత్రాలున్నాయి .వీటిని శాస్త్రీయం గా ,సమర్ధ వంతం గా విశ్లేషించిన ఘనత పతంజలి మహర్షిదే .పతంజలి ,ఆశ్వలాయన మహర్షితో కలిసి క్రీ .పూ.1300లోనే ధ్రువ నక్షత్రాన్ని గుర్తించి ఖగోళ శాస్త్ర అభి వృద్ధికి తోడ్పడ్డాడు క్రీ.పూ184లో మగధను ఏలిన ‘’పుష్య మిత్ర ‘కాలం వారే పతంజలి ,ఆశ్వ లాయనులు .పుష్య మిత్ర చేసిన ‘’ఆశ్వ మేధయాగం ‘’కు పతంజలి సాక్షీ భూతుడు పతంజలిని ఆది శేషుని అవతారం గా భావిస్తారు .
![]()
patanjali as an avataar of shesha
పతంజలి బీహార్ రాష్ట్రం పాట్నా కు దగ్గర లోని గోవర్ధన నగరం లో జన్మించాడు .పుష్యమిత్రుని ఆస్తాన శాస్త్ర వేత్తగా ,వ్యాకరణ పండితుడుగా పతంజలి వ్యవహ రించాడు .రాజ్య పాలనకు సహకరించాడు .పాణిని వ్యాకరణ సూత్రాలను సరళీకరణం చేసి ‘’చూర్నిక ‘’పేరు తో భాష్యం రాశాడు .అందుకే పతంజలిని ‘’చూర్నికా కారుడు ‘’అంటారు .పాణిని ,కాత్యాయనుల తర్వాత వ్యాకరణ శాస్త్రం లో చివరి వాడు పతంజలి .
‘’యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్య కేన
యో పాఠ కోత్తమ పవరం మునీనాం పతన్జలిం ప్రాంజలి రానతో’’
అంటే మనస్సు ,వాక్కు ,శరీరాలను మూడింటిని స్పటికం లాగా తేటగా శుద్ధి గా పోషించుకోవాలని అర్ధం .పతంజలి యోగ శాస్త్రాన్ని ,వైద్య శాస్త్రాన్ని ,శబ్దశాస్త్రాన్ని క్రోడీకరించాడు .వీటిలో యోగ శాస్త్రానికే ప్రామాణికత లభించింది .ప్రపంచమంతా వ్యాపించింది .ఆయన యోగ సూత్రాలు గొప్ప కీర్తి సాధించాయి .
జగత్తుకు మూలం ప్రక్రుతి శక్తి మాత్రమె నని ,ధ్యాన యోగాన్ని ఆశ్ర యించి అంతర్ముఖాన్ని పొంది ఆంతరంగిక ప్రకృతిని ఏకం చేసిన వారే ప్రకృతిలో
మమేకం అవుతారని పతంజలి చెప్పాడు .మన శరీరం లో ఉన్న నాడీ స్థానాలే చక్ర స్తానాలు .
యమ ,నియమ ,ఆసన ,ప్రాణాయామ ,ప్రత్యాహార ,ధారణ ,ధ్యాన ,సమాధి అనే ఎనిమిది రకాల యోగా భ్యాసాల ద్వారా మనిషి ప్రక్రుతి శక్తి ఏమిటో తెలుసుకో వచ్చునని పతంజలి చెప్పాడు
. .పతంజలి యోగం ఆధారం గా అనేక గ్రంధాలు వచ్చాయి .యోగా చారి .కే.ఎస్.అయ్యంగార్ ఇందులో ప్రధములు .డెబ్భై రెండేళ్ళు ఈయన యోగా లో గడిపారు ‘’లైట్ ఆన్ యోగా ‘’,’’లైట్ ఆన్ లైఫ్ ‘’రచించారు ఇందులో మొదటిది పది హేడు భాషల్లోకి అనువాదం పొందింది .
యోగ శాస్త్రం ‘’మీద మొట్ట మొదటి సూత్రా గ్రంధాన్ని రాసిన వాడు పతంజలి .’’ప్రాణం ‘’సర్వ వ్యాప్త చైతన్యం గా నిరూపిస్తూ ,స్పందనా శక్తిని పెంచే యోగ సూత్రాలను ప్రపంచానికి అందించిన పతంజలి మహర్షి యావత్ మాన వాళికీ ఆరాధ్యుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-11-13-ఉయ్యూరు
.


పతంజలి మహర్షి గురించి తెలియని విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు.
LikeLike