వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )
ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రాట్ విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార మయింది .కిందటి వారం పంతులు ‘’జోస్యుల ‘’ఉన్మాదం, మరణం తో విషాదాంతమైన ఎపిసోడ్ ,ఈ వారం కిరీటి వివాహం తో మొదాంతం అయి హాయి అని పించింది .కిరీటి ధర్మా రావు అరుంధతి ల వద్దకు వచ్చి తన గోడు వెళ్ళ బోసుకోవటం వీళ్ళిద్దరూ ధైర్యం చెప్పి కార్యోన్ముఖుడిని చేయటం తో ఈ వారం కధ ప్రారంభ మైంది .చిక్కి శల్యమై దిక్కు తోచని స్తితిలో ఉన్న కిరీటిని ఓదార్చి ,ధైర్యం చెప్పి ముందుకు నడిచేట్లు చేశారు .వీరి మధ్య సంభాషణలు రసవత్తరం గా ఉన్నాయి .
ధైర్యం తెచ్చుకొన్న కిరీటి చక్కని మాయోపాయం చేసి మామకు ఉత్తరం రాసి ,బోల్తా కొట్టించి ,మామ మనసును మార్చి ,ఆయనే తనకూతురు శశిరేఖను కిరీటికి ఇచ్చి పెళ్లి చేయటానికి ముందుకొచ్చేట్లు చేస్తాడు ..ఇదంతా ‘’మినీ మాయా బజార్ ‘’అని పించి మహా సరదా గా ముగింపు కొచ్చింది .
ఈ ఎపిసోడ్ ముందు ప్రముఖ సాహితీ వేత్త ఒకరు(వారి పేరు వినలేక పోయాను ) వేయి పడగలు పై తమ అమూల్య అభిప్రాయాన్ని విడ మర్చి వివరించారు .’’వెయ్యి పాత్రలున్న ఈ నవలను నాటకం గా మలచటం ఏంతో కష్టం .కాని అలాంటి దాన్ని సులభ సాధ్యం చేసి, నాటకం గా ఏంతో రంజకం గా మలచి ప్రసారం చేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకొన్న హైదరాబాద్ ఆకాశ వాణిని ,యెంత అభినందించినా మాటలు చాలవు అన్నారు .పాత్ర దారు లందరూ తమ పాత్రలను అత్యంత సమర్ధ వంతం గా పోషించి నాటక విజయానికి ఏంతోసహకరించారు. అందరు అభి నంద నీయులే ‘’అని పొంగిపోతూ కొని యాడారు .
విజ్ఞప్తి –ఎపిసోడు కు ముందు ‘’వేయి పడగలు’’ గొప్పదనాన్ని గురించి వివరించే సాహితీ ప్రముఖుని పేరు చెబుతున్నారు .బాగుంది .వారి ప్రసంగం అయిన తర్వాత కూడా వారి పేరు మరొక్క మారు చెప్పటం భావ్యమేమో నని పిస్తోంది .రేడియో లోఇది మామూలే. దీని వల్ల ఒక అరనిముషమే ఖర్చు అవుతుంది .నా సూచన ను గమనించి ఇకపై అనుసరిస్తారని ఆశిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-13-ఉయ్యూరు

