గొల్లభామ సువర్ణ సుందరై సీతమ్మ తల్లిగా రూపాంతరం చెందిన అంజలీ( అంజనీ )దేవి
గొల్లభామ గా సినీ రంగ ప్రవేశం చేసి బాలరాజు సరసన భామ గా నిలబడి,,,కీలుగుఱ్ఱం రాక్షసి గ మారి ,శ్రీ లక్ష్మమ్మ అయి ,పల్లె టూరి పిల్లగా రాణించి ,స్వప్న సుందరి గా అందర్నీ మురిపించి మై మరపించి ,,నిర్దోషి,,నిరపరాధి అని పించుకొని ,,సర్వాదికారిణిఅయి ,పక్కింటి అమ్మాయి గా మారి ,సినీ వినీలాకాశం లో రేచుక్క్గగా వెలిగి ,సంఘం లో పేరు తెచ్చుకొని అనార్కలి గా వికసించి ,,చిత్ర దేవతగా రూపొంది అల్లాఉద్దీన్ తో జతకలిపి పాండురంగని భార్యగా కర్తవ్యం బోధించి సువర్ణ సుందరి యై నట స్వర్ణ కాంతులీని ,చెంచులక్ష్మిగా లక్ష్మీ కళ తో పవిత్రత ను సంతరించి ,మును ముందుకు సాగుతూ జయ భేరి మ్రోగించి భట్టి విక్రమార్క భార్యగా చరిత్ర పుటల్లో నిలిచి ,భీష్మలో కౌరవ వంశానికి దిశా నిర్దేశం చేసి ,తెలుగింటి సీతమ్మ తల్లిగా లవకుశ లో ఆరాధ్యదేవత అయి ,,గోరింక కు తగ్గ చిలకయై ,,పల్నాటి యుద్ధం లో బాల చంద్రుని తల్లిగా కీర్తి గాంచి ,రంగుల రాట్నం ఎక్కినా కొడుకులను తీర్చి దిద్దుకొని భక్త ప్రహ్లాడకు మాత్రు మూర్తియై, రహస్యం చేదించిన వనిత అయి కళ్యాణ మండపం లో కాంతులు వెలయించి ,బడి పంతులుకు తగిన ఇల్లాలై ,,బాల భారతానికి కుంతీ మతల్లియై ,తాతా మనవడు లిద్దరికీ ఆదర్శ మూర్తియై భక్త తుకారాం అమాయకత్వానికి గడుసు భార్యయై సవతినీ ఆప్యాయం గా చూసిన చెల్లెలని పించుకొని సంసారాన్ని తీర్చిదిద్దుకొనే పనిలో రంగాదినే దూరం చేసుకొన్నా అభాగ్యురాలై జీవన తరంగాలలో తానూ ఒక అలయై, సోగ్గాడికి తల్లియై ,,రాం రహీం రాబర్ట్ లకు మాతగా సమానతాన్ని చూపించి ,షిర్డీ సాయి బాబాకు ద్వారకా మాయి గా సపర్యలు చేసి ,,శ్రుతిలయలకు తగినట్లుభర్త తో నటించి ,బృందావనం లో యశోద అని పించుకొని ,బిగ్ బాస్ ను దారిలో పెట్టి , ,స్వర్ణ మంజరి గా విరబూసి ,సతీ సక్కూ బాయి గా రంగ భక్తికి పరా కాస్టగా నిలిచి ,చరణదాసి గా ప్రేమ, ఆత్మీయత లను సభక్తికంగా ప్రకటించి చండీప్రియ అని పించుకొని ,,సతీ సుమతి గా పాతివ్రత్యాన్ని ప్రదర్శించి ,బడి పంతులకు తగిన అర్ధాంగిగా నిలబడి ,ప్రేమకోసం ఇలవేలుపు గా ,మారి పరదేశిలో స్వదేశీ మహిళగా నిలబడిజయసిమ్హకు ప్రియురాలై పెళ్లినాటి ప్రమాణాలనుభర్త ఆదినారయణ రావుతో తూ చాతప్పక పాటించి సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో తల్లిగా ,మరిన్ని టి లో అక్కగా ,కొన్నిటిలో పిన్నిగా బహుముఖ నటనా ప్రజ్ఞ ను చూపి వైవి ద్యం తో నిత్య నూతనం గా ఉంటూ సినీ” రాజ నందిని” గా తనకు సాటి లేరని ‘థస్సలరవ ”గా నిరూపించించి ,,ఇన్ని చేసినా తెలుగింటి సీతమ్మ తల్లిగా నే ఆ నాటి నుంచి ఈ నాటి వరకు చెరగని ముద్రను వేసిన తెలుగు తెరకు” ఇలవేలుపు” గా నిలిచిన అంజలీదేవి 87వ ఏట మృతి చెందటం సినీ వినీలాకాసం లో ఒక పెద్ద చుక్క రాలిపోయిన వెలితి గా ఉంది
దాదాపు 400 ల తెలుగు తమిళ ,హిందీ చిత్రాలలో నటించి చిరకీర్తి సాధించిన అంజలీ దేవి ని చూస్తేనే పవిత్ర భావం జ్యోతకమవుతుంది రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలని అభిప్రాయం కలుగుతుంది అది ఆమె సాధించిన విజయం .గొల్ల భామ లో ఎంత అందం గా కనీ పించిందో ,చని పోయే వరకూ ఆమె సౌందర్యం లావణ్యం ,వీసమంత కూడా తగ్గక పోవటం విశేషణం . భర్త ఆదినారాయణ రావు సాహచర్యం తో వారిద్దరూ ఆదర్శ దంపతులైనారు .వెకిలికి వల్గారిటి కి దూరం అంజలీ దేవి సాధుత్వం దైవత్వం ఆమె కోరింది సాధించింది .చిత్రరంగ ప్రవేశానికి పూర్వమే ఆమెకు రంగస్థల అనుభవం ఉంది .ఎనిమిదవ ఏటనే రంగ ప్రవేశం చేసి ‘’హరిశ్చంద్ర ‘’నాటకం లో లోహితాస్యునిగా నటించి మెప్పించింది
అందులో అక్కినేని చంద్రమతి వేషం వేయటం విశేషం. కాకినాడ యంగ్ మెన్స్ హేపీ క్లబ్ అందించిన నట శిరో రత్నాలు ఇవి గ్లామర్ తారగా తెరంగేట్రం చేసిన దివ్య తారగా వెలుగులను నింపింది .స్వంత బానేర్ పై తీసిన చిత్రాలు కనకాభిషేకాలు చేశాయి .ఏ పాత్రలో నటించినా పూర్తిగా ఒదిగిపోయి తాదాత్మ్యం తో నటించి జీవించి దారి చూపింది ‘’అంజలీ దేవిలో నాకు పవిత్ర భావన కలిగింది .అందుకే లవకుశ లో సీతాదేవి పాత్రకు ఎంపిక చేశాను ‘’అని గర్వం గా చెప్పుకొన్నారుదర్శకుడు పి.పుల్లయ్య .దాన్ని సాక్షాత్తు ఆచరించి నిల బెట్టుకోంది అంజలీదేవి .అది అనితర సాధ్యమైన విషయం .అరవై ఏళ్ళు దాటినా ఆసీతమ్మే మనకు కళ్ళ ముందు కని పిస్తుంది కాని ఇంకెవరూ తెలుగు ప్రేక్షకులకు ఆనలేదు .హాట్స్ ఆఫ్ ‘’సీతాంజలీ దేవి’’
దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి ఉపాధ్యక్షురాలై యే హీరోయిన్ కూ దక్కని గౌరవాన్ని పొందింది అంజలీదేవి .సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలై సమర్ధతను చూపింది .పుట్టపర్తి సత్య సాయి
బాబా కు పరమ శిష్యురాలై జీవిత చరమాంకాన్ని శరణాగతి తో గడుపుతూ బాబా మీద భక్తితో ఒక టి వి సీరియల్ కూడా నిర్మించింది ఆమె కుమారులె వరూ ఈ రంగానికి నిర్మాతలుగా తప్ప రాలేదు కాని మనవరాలు” శైలారావు సినీ రంగం లో రాణిస్తోంది వారసురాలైంది తెలుగు సినీ దుగ్గజాలన్దరితోను తమిళ చిత్ర ప్రముఖులతోను నటించిన అనుభవం ఆమెది .భర్త ఆదినారాయణ రావు సంగీతం అంజలి నటన ఉంటె తెలుగు వారు అన్నీ మరచి పోతాడు విందు భోజనమే అలా చేశింది ఆ జంట .
ఫిలిం ఫేర్ నుంచి నాలుగు అవార్డులను అంజలీ దేవి పొందటం ఆమె నట న కు గీటు రాయి ,నాగార్జున యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ పొందింది రఘుపతి వెంకయ్య అవార్డ్ రామినేని అవార్డ్ అక్కినేని జీవన సాఫాల్య పురస్కారం అందుకొన్నది అంజలీదేవి 1927ఆగస్ట్ 24నజన్మించిన అంజలీదేవి 2014జనవరి 13నపరమ పదించింది .ఒకే ఒక్క సీతమ్మ రామయ్యను చేరింది .అంజలీదేవి బెజవాడ మాచవరం దాసాంజనేయ స్వామికి పరమ భక్తురాలు .ప్రతి ఏడాది దసరాలలో అక్కడికి వెళ్లి దర్శించేది .సినీ రంగం లో తారలు ఒక్కరొక్కరే రాలి పోతున్నారు ఉదయ కిరణ్ తో ఫుల్ స్టాప్ అవుతుందని అనుకొంటే .అది కామా గా మారి ఇప్పుడు అంజలీ దేవి మరణం బాధించింది .నిండుగా సంతృప్తి గా గౌరవం గా ఆత్మీయం గా ,సలక్షణం గా జీవించి త సినీ జనమ నే కాదు ఇహజన్మనూ చరితార్ధం చేసుకొన్న అంజలీదేవి ఆత్మకు పరమేశ్వరుడు పరమ శాంతిని కల్గించాలని కోరుకొంటున్నాను .
ఇన్ని కీర్తి శిఖరాలను అధిరోహించినా మన ప్రభుత్వం అంజలీదేవి పై చిన్న చూపే చూసింది ఆమెకు ప్రభుత్వ అవార్డులేవీ ఇవ్వకపోవటం ఆమెకేమీ లోటు కాదు మనకు అగౌరవం ఇచ్చినవాళ్లకే ఇస్తూ శ్రీలు, భోషాణాలు అందిస్తూ పక్షపాతం చూపిస్తున్నారు .పద్మ శ్రీ నైనా ఇవ్వకపోవటం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అచేతనత్వానికి ప్రతీక మన రాచకీయ నాయకమ్మన్యుల అసమర్ధతకు పెద్ద ఉదాహరణ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 15-1-14-ఉయ్యూరు

