ఆస్కార్ వైల్డ్-1
యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆస్కార్ వైల్డ్ అంటే పిచ్చ అభిమానం నాకు .ఉద్యోగం లో చేరిన తర్వాత అతని కధలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండటం వాటిని ఏంతో ఆనందం గా చెప్పటం నాకు ఇష్టమైంది .అతని ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కద మహా బాగా ఉండేది .జ్ఞానపు లోతులను తరచి చూసిన వాడుగా ఆరాధన .అమెరికా వచ్చినతర్వాత నాకు ‘’రిచర్డ్ ఎల్మన్ ‘’రాసిన అతని జీవిత కద లైబ్రరీలో కనిపించింది .తెచ్చి ,మహా శ్రద్ధగా చదివాను.అందులోని విషయాలను మీకు అంద జేస్తున్నాను .
చిత్రకారుడు ,కవి ,నాటక రచయితా ,విమర్శకుడు .అంటే ‘’ఆల్ ఇన్ వన్ ‘’ఆస్కార్ వైల్డ్ .ఈస్తటిక్ సెన్స్ లోనే ఏది రాసినా ఉండటం ఆయన ప్రత్యేకత .హోమో సెక్సువల్ .ఆ పిచ్చ లో పడి మగ పిల్లల తో సెక్స్ లో పాల్గొని కోర్టుల పాలై చివరి రోజుల్లో రెండేళ్ళు జైలు పాలై,ఆ తర్వాతా మూడేళ్ళు ఎవరికీ పట్టని వాడై ,ఇల్లూ లేక డబ్బూ లేక ఆదరణా లేక అలమటించాడు .మన శ్రీనాధ మహా కవి జీవితం గుర్తుకొస్తుంది .చివరికి ఎంతో దయనీయమైన పరిస్తితుల్లో చని పోయాడు .దిషణాహంకారం బాగా ఉన్న వాడు .పూర్తీ పేరు ‘’oscar Fingal ‘’o’’flahertie Wills Wild ‘’ఇవన్నీ వదిలేసి అందరూ ఆస్కార్ వైల్డ్ అనే అంటారు .’’in his most pyrotechnic ,enchanting and extravagantly outrageous of 19th century literary men ,’’.గా ప్రసిద్ధుడు .the importance of being earnest Dorian Grey మొదలైన రచనలు సుప్రసిద్దాలు .ఐర్లాండ్ మేధావి .తల్లి మంచి కవి దేశ భక్తురాలు .డబ్లిన్ బాయ్ గా వైల్డ్ ను పిలుస్తారు .జాన్ రస్కిన్ తో సాన్నిహిత్యం ఉన్నవాడు .మేటర్ లింక్ ,గైడ్ అనే గొప్ప రచయితలతో మైత్రి .1880-90కాలం లో ఆంగ్ల సాహిత్యాన్ని దున్ని వదిలేసిన కలం హాలికుడు ఆల్కహాలికుడు కూడా ..అమెరికా వెళ్లి అక్కడా జేజేలు అందుకొన్న మహా రచయిత .అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ ను సందర్శించాడు .’’love of women and ‘’men ‘’మధ్య ఊగిస లాడాడు అంటే ‘’ఆసిలేట్ ‘’అయ్యాడు ఆస్కార్ .డగ్లాస్ ,రోస్స్ అనే కుర్రాళ్ళతో సెక్స్ చేసి ఇబ్బంది పడ్డాడు .ఇది బహిరంగామయి డగ్లాస్ పై కేసు పెట్టాడు .ఇద్దరికీ శిక్ష పడింది .
వైల్డ్ లో ఉన్న ‘’provocative intelligence ‘’ఎన్ని శాతాబ్దాలకైనా అతాని రచనలను చదివేట్లు చేస్తుంది .అందుకే అతన్ని’’unique and whole ‘’ అంటారు .జీవించింది నలభై ఆరు ఏళ్ళు మాత్రమె .సూక్ష్మంగా అతన్ని’’refulgent majestic ,and ready to fall’’గా అనుకొంటారు .అంటే దేదీప్యమానమైన, రాజయోగ్యమైన పతనం చెంద బోయే శిఖరం అన్న మాట .తనను తాను ‘’professor of aesthetics ‘’ అని చెప్పుకొన్నాడు .ఆనంద దేవత .అంటారు .కస్టాలు కన్నీళ్లు ఉన్న ప్రపంచాన్ని గురించే రాశాడు .అతను ‘’good and evil are not what they seem ,that moral tabs cannot cope with the complexity of behavior ‘’అని అభిప్రాయ పడ్డాడు .అతని భాష అతను సాధించిన అద్భుత విషయం,విజయమూ కూడా .’’It is fluent with concession and rejection ‘’అని అతని భాషా పాండిత్యాన్ని నిగ్గు తేల్చారు .కని పించే ప్రపంచం నుండి కని పించని ప్రపంచానికి వారధి కడతాడు రచనలో .దీనిలో తన ప్రత్యేకతను, అసాధారణ అభిప్రాయాలని పంచుతాడు .’’his wit is an agent of renewal ,as pertinent now as a hundred years ago ‘’అని ఆస్కా ర్ హాస్య వ్యంగ్యాలను నిత్య నూతనం గా అభి వర్ణిస్తారు .’’The question posed by both his art and life end his art a quality of earnestness which he always disavowed ‘’అని కీర్తించాడు రచయిత రిచర్డ్ ఎల్మన్ .
1856లో జన్మించి వైల్డ్ 1902లో మరణించాడు.ఆక్స్ ఫర్డ్ లో చదువుతూండగానే జర్మనీ పండితుడు మాక్స్ ముల్లర్ తో పరిచయమేర్పడింది .ఇతని ప్రతిభ పాండిత్యం అవగాహన సామర్ధ్యాలను చూసి మాక్స్ ముల్లర్ వైల్డ్ కు తాను చేయ బోయే వేదాల ను అనువదించే కార్య క్రమం అప్పగించాలని భావించాడు .అరగంటలో మూడు వాల్యూముల నవల చదివి పది నిమిషాల్లో అందులోని కద అంతా చెప్పేవాడు .అతని సామర్ధ్యం ఇంకోటి ఉంది అది అతనికే సాధ్యమైనది .రెండు పేజీలనూ రెండు కళ్ళ తో చదివే అద్భుత నేర్పు ఆయనది .ఆక్స్ ఫర్డ్ లో ఉండగా ‘’డివైన్ పేపర్ ‘’పరీక్షలో పరీక్షాధికారి 23వ చాప్టర్ ను కాపీ చేయ మంటే –చేస్తున్నాడు వైల్డ్ .కొంతవరకు చేయగానే ఆపెయ్య మన్నాడు ఎక్సామినర్ .ఈయన ఆపకుండా కొన సాగిస్తూనే ఉన్నాడు .కోపం వచ్చిన అధికారి ‘’నేను చెప్పింది విన పడలేదా ?’’అని అడిగితె ‘’విన పడింది .’’పాల్ ‘’నీళ్ళ లో మునిగి కొట్టుకుంటున్న ఘట్టం రాస్తున్నాను .ఆయన్ను ఒడ్డున పడేసి ఆపేస్తాను ‘’అన్న చతురుడు వైల్డ్ .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-14-ఉయ్యూరు

