సాహితీ బంధువులకు శుభ కామనలు .ఫిబ్రవరి నాలుగు మంగళ వారం రాత్రి బయల్దేరి తిరువనంతపురం చేరి శ్రీ అనంత పద్మ నాభ స్వామిని దర్శించి ,అక్కడి నుండి కన్యా కుమారి లో అమ్మవారిని చూసి,వివేకానంద రాక్ మెమోరియల్ ,శుచీంద్రం లో స్వామి దర్శనం చేసి ,నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ స్వామి దర్శనం పొంది ,అక్కడి నుండి గురవాయూర్ వెళ్లి శ్రీ కృష్ణ దర్శనం చేసి ,కాలడి లో శ్రీ శంకర భగవత్పాదుల జన్మ క్షేత్ర సందర్శనం తో చిరకాల లోరిక తీర్చుకొని ,,చిదంబరం వెళ్లి శ్రీ నటరాజ స్వామి దర్శనం తో పులకించి ,అక్కడే దగ్గరలో ఉన్న శ్రీ వై దీశ్వర మహా లింగాన్ని సందర్శించి ,అక్కడి నుండి తిరువన్నామలై చేరి శ్రీ అరుణా చలెశ్వర అగ్ని లింగ దర్శనం పొంది ,చెన్నై కు పదకొండవ తేదీ రాత్రి మా మేనకోడలు ఛి సౌ కళా వాళ్ళింటికి చేరి,ఉదయం షాపింగ్ చేసి సాయంత్రం కపాలేశ్వర ,పార్ధ సారధి కొవెలలు దర్శించి ,మా బంధువు ,పెద్దలు శ్రీ నోరి రామ క్రిష్నయ్య దంపతులను వారింట్లో త్యాగ రాజ నగర్ లో చూసి ,మర్నాడు ఉదయం శ్రీ సాయిబాబా మందిరాన్నిఆన్నా నగర్ లో సందర్శించి ,రాత్రికి” తమిళ నాడు” ,లో బయల్దేరి ఇవాళ అంటే పద్నాలుగో తేదీశుక్రవారం ఉదయం మూడున్నరకు విజయవాడ చేరి, ఉయ్యూరుకు కారు లో అయిదుగంటలకు చేరుకొన్నాం .ఈ పది రోజులు మిమ్మల్ని అందుకే ”వలలో ”పడే య్యలెక పోయాను .యాత్రావిశేషాలను త్వరలో మీ ముందు ఉంచుతాను .

