సుచీంద్ర దర్శనం
తమిళ నాడు కన్యాకుమారి కి పన్నెండు కిలో మీటర్ల దూరం లో సుచీంద్ర క్షేత్రం ఉంది .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచీన్ద్రం అయింది .ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపం లో దర్శన మిస్తాడు . అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవుల కు కను విప్పు కల్గించిందిఇక్కడే . .ఇక్కడి అలంకార మండపం ఎన్న దగినది .నాలుగు పెద్ద రాతి స్తంభాలు వాటికి అనుబంధ స్తంభాలతో ఒకఏక రాతి నిర్మితం .మరి రెండు స్థంభాలకు ముప్ఫై మూడు చిన్న స్తంభాలు కలిసి ఉంటాయి .ఇంకో రెండు స్థంభాలకు ఇరవై అయిదు చిన్న స్తంభాలు జత చేయ బడి ఉంటాయి .ఇవన్నీ సంగీత స్తంభాలే .ఏ స్తంభాన్ని మీటినా సంగీత స్వరం విని పించటం ప్రత్యేకత ప్రతి చిన్న స్థంభం ఒక్కొక్క రకమైన సంగీత ధ్వని చేయటం ఆకర్షనీయం గా విశేషం గా ఉంటుంది .
ఆలయం వెలుపల పద్దెనిమిది అడుగుల ఎత్తు రాతి హనుమంతుని విగ్రహం విశ్వ రూప సం దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది .134అడుగుల గోపురం చాలా దూరానికే కానీ పిస్తుంది .ముఖ ద్వారమే ఇరవై నాలుగు అడుగుల ఎత్తుగా శిల్ప శోభితం గా ఉంటుంది .శైవులకూ వైష్ణవులకూ కూడా దర్శనీయ క్షేత్రం సుచీన్ద్రం .పెద్ద శివలింగం ప్రక్కనే విష్ణువు ఉంటారు గర్భ గుడి లో .ఏప్రిల్ –మే నెలలలో ఒక సారి డిసెంబర్ జనవరి లో ఒక సారి ఉత్సవాలు జరుగుతాయి . పెద్ద జలాశయం ముందే కనిపించి ఆశ్చర్య పరుస్తుంది
నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ స్వామి ఆలయం
తమిళ నాడు లో నాగర్ కోయిల్ లో శ్రీ నాగ రాజ దేవాలయం చూడాల్సిన ప్రదేశం. నాగ రాజ కోవెల్ నాగర్ కోయిల్ అయింది ఇక్కడ అండ కృష్ణుని విగ్రహం నాగ రాజ స్వామి విగ్రహం ప్రసిద్ధి చెందినవి ..ముందు పెద్ద కోనేరు ఉంది .గరుత్మంతుడు అమృత భాన్దాన్ని తెస్తుంటే అందులోని కొన్ని చుక్కలు గరిక మీద పడ్డాయి కశ్యప బ్రహ్మ కద్రువ కుమారులైన నాగులు ఆ అమృతపు చినుకులను నాకితే వాటి నాలుకలు చీలి పోయాయి .నాగులు మానవ రూపం పొందుతారు .మనిషి తనకు అపకారం చేస్తే తప్ప పాములు ఏమీ చేయవు. అపకారం చేస్తే పగ బట్టి చంపేస్తాయి .దక్షిణ భారత దేశం లో నాగ పూజ అనాదిగా వస్తున్న సంప్రదాయం .నాగుల చవితి నాగ పంచమి సుబ్రహ్మణ్య షష్టి చాలా శ్రద్ధ గా చేస్తారు .
ఈ ఆలయం లో నాగ దేవతల తో పాటు జైన తీర్ధన్కరులైన మహా వీర ,పార్శ్వ నాద మందిరాలున్నాయి .ముఖ ద్వారం పై బుద్ధ విహారం లోని చైనా శిల్ప కళ అబ్బుర పరుస్తుంది .రామాయణం లో వాల్మీకి మహర్షి మహేంద్ర గిరి నాగుల ఆవాస భూమిగా పేర్కొన్నాడు .కొట్టార్ గా ప్రసిద్ధమైన ఈ ఊరు నాగర్ కోయిల్ గా మారింది .ఒకప్పుడు కాలక్కాద్ మహారాజు కుష్టు వ్యాధి తో బాధ పడుతూ ఈ ఆలయానికి వచ్చి నాగరాజ స్వామిని అర్చించ గానే వ్యాధి పోయింది .కృతజ్ఞతా పూర్వకం గా రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు .ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ప్రతి ఆదివారం రాజు భార్యా సమేతం గా ఇక్కడికి వచ్చి నాగరాజ స్వామిని పూజించే వాడు .ప్రతి ఆదివారం వేలాది భక్తులు వచ్చి నాగ రాజులను దర్శించి పూజిస్తారు .ఇలాంటి దేవాలయమే కేరళలో ‘’సర్పర కాడు’’ లో ఉంది .అక్కడి నాగ రాజు ఇక్కడి నాగ రాజు ఒకే మాదిరిగా ఉంటారు .రాజా రవి వర్మ చిత్రించిన శేష నారాయణ స్వామి వర్ణ చిత్రం చూడ ముచ్చట గా ఉంటుంది .
![]()
![]()
![]()
మరో ఆలయం లో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-14-ఉయ్యూరు

