ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు
నేను మొదటి సారి అమెరికా కు వెళ్ళే దాకా (2002)అమెరికా నాటక రచయితల గురించి తెలియనే తెలియదు .వెళ్లి లైబ్రరీ మీద పడి వెతుకు తుంటే అద్భుతమైన నాటక రచయితల విషయం వారి గొప్ప నాటకాల సంగతి తెలిసింది అప్పుడే వీరి గురించి తెలుసు కొన్నాను .అందులో ఇద్దరు అమెరిక నాటక రంగాన్ని అనేక మార్పులతో మలుపు తిప్పి ప్రతిష్ట పెంచారు. వారే యూజీన్ ఓ నీల్ ,మరియు టెన్నెసీ విలియమ్స్ .
యూజీన్ ఓ.నీల్
నీల్ రాసిన మూడు నాటకాలు ‘’డిజైర్ అండర్ ది ఎల్మ్స్ ‘’,స్త్రేన్జ్జ్ ఇంటర్ లూడ్ ‘’,’’మోర్నింగ్ బికం ఎలెక్ట్రా ‘’అద్భుతమైనవి గా పరిగణిస్తారు .అప్పటిదాకా ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ నాటక రంగమే అమెరికా లోనూ చలా మణి గా ఉండేది .దీనినుండి అమెరికా నాటక రంగానికి విముక్తి కల్పించి అమెరికా దేశపు అస్తిత్వం తో ,స్వీయమైన భావనలతో అంటే నేచురాలిటీ తో మలుపు తిప్పాడు ఓ.నీల్ .’’from a false world of neat and competent trickery to a world of splendor ,fear and greatness ‘’కు అమెరికా నాటక రంగాన్ని మార్చాడని నీల్ ను కీర్తిస్తారు .నాటక రచయిత కు మొదటి నోబుల్ పురస్కారం నీల్ కే దక్కింది .మరొక నోబుల్ ప్రైజ్ విన్నర్’’ సింక్లైర్ లూయీస్ ‘’ నీల్ ను ఆవిష్కరిస్తూ ‘’with Olympian ambition and an ear that captured both the cadences of classical tragedy and the rhythm of our common speech Eugine’’ o’’Neil lent a unique grandeur to the American theatre .His work is that o f a master playwright at the height of his accomplishment ,exploring the limits of the human predicament ,even as sounds the depths of his audience’s hearts ‘’అన్న మాటలు నీల్ నాటక త్రయాన్ని చదివిన తరువాత అక్షర సత్యాలే అని పిస్తాయి .
మొదటి నాటకం ‘’డిసైర్ అండర్ దిఎల్మ్స్ ‘’-ఇది చాలా ప్రభావ శీలమైన శక్తి వంత మైన డ్రామా .ఇందులో ‘’oedipal lust and yearning involving a rebellious form boy,,his tyrannical father and the father’s slatternly new wife ‘’భిన్న మనస్తత్వాలున్న తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ ,శుచీ శుభ్రం లేని తండ్రి రెండో పెళ్ళాం చస్తూ బతుకుతూ బతుకుతూ చస్తూ జీవించే జీవితాలకు ప్రతిబింబం గా ఉంది .
రెండవ నాతాకం ‘’ది స్స్త్రేన్జ్జ్ ఇంటర్ లూడ్ ‘’లో ఆధునిక మనస్తత్వ శాస్త్రం అంతా నాటక కళ లో నిక్షిప్తం చేశాడు నీల్ .ఇందులోని పాత్రలు పైకి తమ మనో భావాలను ,ఆలోచనలను చెప్పుకో లేని స్తితి కనిపిస్తుంది .
మూడవ నాటకం ‘’మోర్నింగ్ బికంస్ ఎలెకట్రా ‘’ఒక ‘’ట్రయాలజి ‘’.ఇందులో ఎషిలస్ ఒరేస్తేరియా ను అమెరికా అంతర్యుద్ధ సమయం లో ‘’న్యూ ఇంగ్లాండ్’’ లో ప్రవేశ పెట్టి అనుభవాలను విశదీక రింప జేస్తాడు ఈ మూడు మూడు ముత్యాలే .

టెన్నెసీ విలియమ్స్
1938 ఆగస్ట్ లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కౌంటీ ప్రిజన్ లో 650 మంది ఖైదీలు రోజూ తమకు ఆహారం గా పెట్టె ‘’స్ప్రాఘెట్టి ‘’,హంబర్గర్ ‘’తిండి తో విసుగెత్తి ‘’హంగర్ స్ట్రైక్ ‘’చేస్తే వాళ్ళను’’K londike ‘’అనే ఒక చిన్న గదిలో పెట్టి 200డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీటి ఆవిరిని (హాట్ స్టీం )ను వారి పైకి పంపి అందర్నీ చంపేసి ఎవరికీ తెలియ కుండా చేసిన సంఘటన ను టేనెస్సీ విలియమ్స్ అనే రచయిత పేపర్ల లో చదివి దాని పై రాసిన మొదటి రాజకీయ నాటకమే ‘’నాట్ అబౌట్ నైటింగేల్స్’’. అందులో విలియమ్స్ చెప్పిన డైలాగులు గుండెకు సూటిగా తాకి ఆలోచింప జేసి మానవులను ఎంత నిర్దాక్షిణ్యం గా హింసిం చే వారో నని కన్నీళ్లు తెప్పిస్తుంది .’’fear and evasion are the two little beasts that chase each other ‘s tails in the revolving cage of our nervous world ‘’ అంటాడు విలియమ్స్ .అతను రాసిన నాలుగు పెద్ద నాటకాల్లో ఇది ఒకటి .
![]()
william’s grave
ఈ నాటాకాన్ని విలియమ్స్ రాసిన 60 ఏళ్ళ తర్వాత 1998 లో ప్రచు రించారు .మొదట లండన్ లో ప్రచురణ పొందింది .అక్కడ మంచి పేరొచ్చింది దీనికి .దీనినే రచయిత విలియమ్స్ ‘’conspiracy of silence ‘’అని అర్ధ వంతం గా అన్నాడు .లండన్ లో ఈ నాటకాన్ని డైరెక్టర్ ‘’నిస్సా రెడ్ గ్రేవ్’’ ‘’రాయల్ నేషనల్ దియేటర్ లో ప్రదర్శించాడు .విలియమ్స్ రచనలన్నీ ‘’expressionistic and realistic’’అని విమర్శకుల కితాబు .ఫాంటసి లో అతి వాస్తవిక (సర్రియలిజం ),వాస్తవికత (రియలిజం )ను కలిపి రాసే నేర్పున్న రచయిత టేనస్సీ విలియమ్స్ .ఇతని రచనా కాలం ‘’జాజ్ మ్యూజిక్ ‘’స్వైర విహారం చేసే కాలం .అయితే ఈ నాటకాన్ని ‘’సినిమాటిక్ ‘’రాశాడు విలియమ్స్ .ఇందులో కొన్న ఆసక్తికరామైన సంభాషణ – sun is bright as a dollar.ఇది తిలక్ రాసిన ‘’అమెరికా లో డాలర్లు పండును ‘’ను జ్ఞాపకానికి తెస్తుంది .
ఆ రొజులలో ‘’కాపర్ ‘’అంటే మంచి రొజలు అని భావం .అది ఆర్ధిక డిప్రెషన్ కాలం.కీట్స్ రాసిన ‘’ఓద్ టు నైటింగేల్ ‘’అనే కవితా పంక్తుల్ని ఇందులో ఒక పాత్ర ‘’ఈవా ‘’ అనే అమ్మాయి పాడుకుంటూ ఉంటుంది .
‘’when I have fears that I may cease to be –before my pen has gleaned my teeming brain
Before high piled books charactry-hold like rich garners the full ripened grain
When I behold up on the night’s starred face –huge cloudy symbols of high romance
And think I may never live to trace –their shadows with the magic hand of chance
Oh! the wide world I stand alone and think –till love and fame to nothingness do sink ‘’
![]()
john keats , his house and museum
చాలా అర్ధ వంత మైన కవితా పంక్తులివి .వాటిని చక్కగా సందర్భానికి వాడాడు నాటక రచయిత విలియమ్స్ .ఈ నాటకాన్ని గురించి టేనస్సీ విలియం చెప్పుకొన్న మాటలు ‘’I have ever written any thing since that could compete with it in violence and horror .its sympathetic treatment of black and homo sexual characters may have kept the play un produced in its own time .’’అని అరవై ఏళ్ళు ఆ నాటకం కాల గర్భం లో దాగి ఉండటానికి కారణాన్ని వివరించాడు .అప్పటి దాకా నల్ల వారి పాత్రలున్న నాటకాలు రాలేదు .వచ్చినా ఆడలేదు ఈ పనిని చేసిన వారు నీల్ మరియు విలియమ్స్ మాత్రమే .రాజకీయ అన్యాయాన్ని ఎప్పుడూ విలియమ్స్ ఎదిరించే వాడు.. ఈ నాటకాన్ని ‘’లండన్ హెరాల్డ్ ‘’ పత్రిక ‘’Tennesse William’s forgotten play ,turns out to be an absolute corker hunting ,searing ,unforgettable ‘’అని గొప్ప గా ప్రశంసించింది .
ఈ విధం గా ఇద్దరు అమెరికా మహా నాటక రచయితల గురించి తెలుసు కొనే గొప్ప అవకాశం ఇంతకాలానికి నాకు కలిగింది .
20-10-2002ఆదివారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-3-14-ఉయ్యూరు

