ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసిన ఉగాది కోయిల -1
ఉయ్యూరులోని సరస భారతి సాహిత్య సంస్కృతిక సంస్థ 60వ సమావేశం గా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను 30-3-2014ఆదివారం సాయంత్రం 4 గం.లకు కే.సి.పి.మరియు రోటరీ క్లబ్ వారి సౌజన్యం తో శ్రీ వెలగ పూడి రామ కృష్ణ రోటరీ ఆడిటోరియం లో నిర్వహించింది .మర్నాడే అంటే 31-3-14సోమవారం శ్రీ జయ నామ ఉగాది .కనుక సందడి అంతా మా ఇంట్లోను ఊర్లోను కమ్మేసింది .కవి కోకిలలు కలస్వనం తో కవితా గానం చేయటం ,గళ మురళీ విన్యాసం లో శ్రీ కొమరవోలు శివప్రసాద్ ఎల కోవిల ‘’కుహూ కుహూ ‘స్వనాలు వినిపించటం తో వసంతం ఉయ్యూరు కు ముందే వచ్చిందని పించింది .
మా పెద్దబ్బాయి శాస్త్రి కోడలు ఛి సౌ సమత మనవాళ్ళు సంకల్ప్, భువన సాయి లు రెండో అబ్బాయి శర్మ కోడలుఛి సౌ ఇందిరా మనవడు హర్ష సాయి ,మనవ రాలు హర్షితాంజలి ,మూడవ కొడుకు మూర్తి ,కోడలు ఛి సౌ రాణి మనవడు శ్రీ చరణ్ ,మనవరాలు రమ్య ,నాల్గవ కొడుకు రమణ కోడలు ఛి సౌ . మహేశ్వరి అందరూ వచ్చి పండుగ వాతావరణాన్ని తెచ్చారు .
అమెరికా నుంచి మా అమ్మాయి విజయలక్ష్మి మార్చి 23rd కి హైదరాబాద్ వచ్చి అక్కడినుండి ఉయ్యూరు వచ్చి ముందుగా అన్ని ఇంటి పనులు బజారు షాపింగ్ చేసింది. ఒక సంవత్సరం తరువాత వచ్చింది. పిల్లలు అమెరికాలో పరిక్షలకు ఉండిపోయారు.
మా అన్నయ్య గారి అబ్బాయి రామనాద్, కోడలు ఛి సౌ జయ మనవడు కళ్యాణ్ లు ,మా కుటుంబ స్నేహితులు మా శ్రీమతికి ఆత్మీయ మిత్రురాళ్ళు శ్రీమతి మల్లికాంబ శ్రీమతి భవానీ గార్లు మాతో బాటు పండుగ ముందు రోజు ,పండుగ రోజు మాతో నొ ఉండి సహాయ సహకారాలందించారు .మా ఇంట్లో అద్దెకున్న మేష్టారు కృష్ణ మూర్తి గారు ,భార్య గారు కుటుంబ సభ్యుల్లా మాతో కలిసి పోయారు .అందుకే ఈ హడావిడి .
మా పెద్ద మనుమడు (మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు) సంకల్ప్ తంజావూరు నుండి దీని కోసం వచ్చాడు.
రెండు రోజులూ వంట వాళ్ళను పెట్టి వంటలు చేయించాం .ఇంటి ముందు షామియానా వేయించాం .
భోజనానికి టేబుళ్లు కుర్చీలు ఏర్పాటు చేశాం .ఏర్పాట్ల విషయం అంతా ఇంటా బయటా మా రమణే చూశాడు .ఆడిటోరియం లో కార్యక్రమం జరప టానికి అనుమతిని ,రోటరీ క్లబ్ నిర్వాహకుడు శ్రీ కొండలు గారితో ను కెసీపి సి ఒ.ఒ.శ్రీ జి వెంకటేశ్వర రావు గారి తో మాట్లాడి ఏర్పాటు చేయించాడు .అతిధులకు కెసీపి గెస్ట్ హౌస్ లో రూములు బుక్ చేయించాడు .అలాగే సంగీత బృందాన్ని విజయవాడ స్టేషన్ నుంచి ఉయ్యూరుకు తీసుకొని రావటానికి ,కార్య క్రమం అయిన తర్వాత మళ్ళీ రాత్రికి స్టేషన్ కు చేర్చటానికి ఎసి ఇన్నోవా కార్ బుక్ చేయించాడు .ఆడిటోరియం లో కుర్చీలు ,మైకు ఏర్పాట్లకు కూడా రోటరీ సాయం చేసేట్లు చేశాడు .ఇవన్నీ వారు చేయ బట్టే కార్యక్రమం లోమా భారం కొంత తగ్గింది .అలాగే వేడుకల రోజున మధ్యాహ్నం టిఫిన్ టీ లు, రాత్రి డిన్నర్ కు కే సి పి కాంటీన్ వారు సరసమైన ధర లో అంద జేసేట్లు కూడారమణ చేయగలిగాడు .ఆహ్వాన పత్రిక డిజైన్ చేయటం వేదిక పైవిస్తృత మైన ముచ్చటైన బానర్ ను ఏర్పాటు చేయటం ,జ్ఞాపికలను ‘’కర్నాటక సంగీత త్రయం ‘’చిత్రాలతో రూపొందించటం శ్రీ ప్రకాష్ చేత చేయించి కార్య క్రమానికి గొప్ప వైభవం తెచ్చాడు .వాడి చొరవ కృషి దీన్ని మహత్తరం చేసింది .
సుమారు ఇరవైరోజుల క్రితం స్థానిక అమరవాణి హైస్కూల్ వార్షికోత్సవానికి ప్రిన్సిపాల్ నాగరాజు ఆహ్వానిస్తే వెళ్లాను .శ్రీ పూర్ణ చంద్ ముఖ్య అతిధి. సుదీర్ టింబర్ డిపో నిర్వాహకుడు లయన్ క్లబ్ ప్రెసిడెంట్ నా శిష్యుడు సాంబశివ రావు కూడా వేదిక పై ఉన్నాడు .నేను మాట్లాడుతూ ఉగాది వేడుకలను గురించి చెప్పి అందర్నీ ఆహ్వానించాను .నా పక్కనే కూర్చున్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సాంబ ‘’మాస్టారూ !ఇందులో నేనేమి చేయాలో చెప్పండి .చేస్తాను’’. అన్నాడు .’’సరే సంతోషం మా రమణ ను నీ దగ్గరకు పంపిస్తాను ‘’అన్నాను. ఆహ్వానాలు ఇవ్వటానికి సుదీర్ టింబర్ డిపో కి వెళ్లి సాంబ కు ఇచ్చాడు రమణ .అప్పుడు సాంబ ‘’నాన్న గారికి మాట ఇచ్చాను .నేనేమి చేయాలో చెప్పండి ‘’అని అడిగాడట .వచ్చిన వారందరికీ జ్ఞాపికలు మీ సౌజన్యం తో ఇస్తే బాగుంటుంది ‘’అన్నాడట .ఓకే అని దాని ఏర్పాట్లు చేశాడు సాంబ .ప్రకాష్ తో డిజైన్ చేయించి బెజవాడ లో ప్రింట్ చేయించి సాంబ కు ఇచ్చాడు రమణ ఫ్రేములు కట్టించి అప్పగించాడు .ఇలా మరి కొంత భారం తగ్గింది .
కవి మిత్రులందరికీ రెండు సార్లు ఫోన్ చేసి ఆహ్వానించి ఆహ్వానాలు పది హీను రోజులు ముందే పోస్ట్ లోపంపాను .అలాగే అతిదులనూ ముందే ఆహ్వానించి అనుమతి పొందాను.శ్రీ వల్లీశ్వర్ విషయం రమణ చూశాడు .అసలు ముఖ్య అతిధి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారి తో మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా సంప్రదించాను ఆయన అమెరికా లో మాకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి వస్తానని సంతోషం గా చెప్పారు .ఎంత ఇవ్వాలి అని నేను అడగ లేదు .కాని లోపల భయం వేసి ‘’మీ ఫార్మాలిటీస్? ’అని అడిగితె నవ్వుతూ’’ వాటి గురించి వర్రీ వద్దు నేనొస్తానుమా బృందం తో. మీతో గడుపుతాను .’’అన్నారు టెన్షన్ పూర్తిగా తగ్గి పోయింది ‘’ మీ శ్రీమతిగారిని ని కూడా తీసుకొని రండి మీతో ‘’అన్నాం నేనూ మా శ్రీమతీ .సరేనన్నారు .ఈ వేడుకలో పాల్గొనాలని మా అమ్మాయి ఛి సౌ విజ్జి అమెరికా నుంచి మార్చి ఇరవై రెండుకే వచ్చింది ,కనుక హడావిడి వేగం పుంజుకొంది
ఉగాది వేడుకలు
30-3-2014ఆదివారం ఉదయం అయిదింటికే మచిలీ పట్నం ఎక్స్ ప్రెస్ లో శ్రీ శివ ప్రసాద్ గారు వారి శ్రీమతి హైమవతి గారు సహకార వాద్య బృందం తో విజయ వాడ స్టేషన్ కు చేరుకొన్నారు.రోటరీ క్లబ్ వారే బానర్ కట్టుకొని వెహికల్ తీసుకొనివెళ్లి రిసీవ్ చేసుకొని ఉయ్యూరు కెసీపి గెస్ట్ హౌస్ లో ఏర్పాటైన రూముల్లో గౌరవం గా ఉంచి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారు .ఇక్కడ కూడా మా బాధ్యతను కొంత వారు పంచుకొన్నారు .కనుక కొంత బరువు తగ్గింది అని పించింది .
ఇంట్లో వంట వాళ్ళు గోపాల్ భార్య వచ్చి వంట మొదలెట్టారు .మా అబ్బాయిల కార్లలో నేను మా పెద్దబ్బాయి శాస్త్రి రెండో వాడుశర్మ ,రమణ మా అమ్మాయి విజయ లక్ష్మి లతో గెస్ట్ హౌస్ కు వెళ్లి స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేసి ఏర్పాట్ల విషయం అడిగాము .అంతా బాగా ఉందన్నారు .ఆ రోజే ఉయ్యూరు మునిసి పాలిటీకి ఎన్నికలు .జనం వస్తారో రారో అనే దిగులు లోపల .ముందే ఓటు వేసి వెళ్లాను శివ ప్రసాద్ గారి దగ్గరకు .వారి బృందమూ అయిదుగురు .ప్రాక్టీస్ చేసుకొంటున్నారు .
అక్కడి నుండి మా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి
ఆలయానికి కార్లలో వారి నందరిని తీసుకొని వెళ్ళాము .స్వామి సన్నిధి లో వారు ఒక కీర్తన ఈల పాట గా పాడి
స్వామిని అర్చించి అనుగ్రహం పొందారు .అప్పుడే శ్రీ వల్లీశ్వర్ కూడా ఉయ్యూరు వచ్చి గుడికి చేరుకొన్నారు .అష్టోత్తర పూజ చేశాడు పూజారి మురళి .నైవేద్యం గా లడ్డూలు ,పులిహోర చేయించాం .మంత్రం పుష్పం
తర్వాతఆలయ మర్యాద తో అర్చక స్వామి చేత అందరికి స్వామి వారి శేష వస్త్రాలను అంద జేశాము .ఇది పూర్తీ అయ్యేసరికి పదకొండున్నర అయింది .అక్కడి నుండి ఇంటికి వారందరినీ సగౌరవం గా ఆహ్వానించి కార్లలో తీసుకొని వచ్చాం అప్పటికే వంటలు పూర్తీ అయ్యాయి .
మా ఇంట్లో హాల్ లో టేబుల్స్ వేసి కోడళ్ళు వడ్డించారు .మామిడి కాయ పప్పు ఆవకాయ వంకాయ కూర దోసకాయ పచ్చడి పూర్ణం బూరెలు పులిహోర ,వడియాలు సాంబారు గడ్డ పెరుగు మా పెరటి లో పండిన అమ్రుతపాణి అరటి పండ్లు తాంబూలం తో కమ్మని విందుఏర్పాటు చేశాము
.అందరూ ఆనందం గా ఆరగించి మాకు సంతోషం కలిగించారు .భేషజం లేకుండా అంత పెద్దా ప్రపంచ ప్రసిద్ధ సంగీత నిధి మాతో కుటుంబ సభ్యులుగా మెలగటం ఆయన భార్య గారు హైమవతి గారు కూడా ఏంతో మురిసి పోవటం
‘’నేను మీ అబ్బాయి లాంటి వాడిని ‘’అని శివ ప్రసాద్ గారు అనటం మరచి పోలేని మాటలు .’’మాకు ఇంత మర్యాదా మన్ననా ?’’అని హైమవతి గారు అనటం వారిద్దరి సంస్కారానికి మచ్చు తునక .కనుక ఉగాది ముందే మా ఇంటికి వచ్చిందని పించటం సహజమే కదా .వారిద్దరి తో బాటు సహకార వాయిద్య విద్వాంసులు కూడా మా ఆతిధ్యానికి మురిసి పోయి కడుపు నిండా భోజనం చేశామని ఆనందం గా మమ్మల్ని అభి నందించటం చిరస్మరణీయం .
ఇంతటి అనుభూతిని మా యాభయ్యవ వివాహ ససం దర్భం గా కలిగించిన వీరందరికీ ఏమిచ్చి, యేమని చెప్పి క్రుతజ్ఞతలను చెప్పుకోగలం ?ఇదేదో జననాంతర సౌహృదం అని పించింది .లేక పొతే వారేమిటి ?మా ఇంటికి రావటమేమిటి ?ఊహకు కూడా అందని విషయం .శ్రీ వల్లీశ్వర్ కూడా ఏంతో సంతృప్తి చెందారు .వల్లీశ్వర్ అన్నగారు ప్రఖాత హాస్య కదా రచయిత శ్రీ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు మా ఉయ్యూరు లో సూరి వారి అల్లుడు నా చిన్ననాటి స్నేహితుడు సూరి నరసింహం చెల్లెలు, నా శిష్యురాలు ఛి సౌ అన్న పూర్ణ కు భర్త .దీక్షితులు గారితో 1961నుండి పరిచయం .వల్లీశ్వర్ మా బావ మరది, హైదరా బాద్ లో స్టేట్ బాంక్ ఉద్యోగి ఆనంద్ కు మంచి స్నేహితుడు .అతని ద్వారానే వల్లీశ్వర్ గారిని రప్పించాం .వల్లీశ్వర్ కు ఇక్కడ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు రమణ .భోజనాల తర్వాత శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘’మా ఆవిడ ఎప్పుడూ ఎక్కడికీ నాతో కచేరీకి రాదు .మీరు రమ్మని పిలిచారని చెప్పాను రాక పొతే ఊరు కోరు అనీ చెప్పాను .వచ్చిన తరువాత వారి ఆదరణ ఆత్మీయత నువ్వు మర్చి పోలేవు .రాక పోతే ఏంతో కోల్పోతావు ‘’అని చెప్పి తీసుకొచ్చానని అన్నారు .ఆమె కూడా అంత కలుపు గోలుగా ఉన్నారు .మా అబ్బాయి కోడలు మా ఇంట్లో తిరుగుతున్న ఆనందమే కలిగించారు .హైదరాబాద్ వస్తే మా అమ్మాయితో సహా వారింటికి రావలసిందని ఆహ్వానించారు ఈ అనుభవం విలువైనది మాకు .అందరిని మళ్ళీ కారులో గెస్ట్ హౌస్ కు తీసుకొని వెళ్లి దింపారు మా అబ్బాయిలు .
మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం
సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్
సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య
ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో
విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-
శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

