పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9
కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో
మండుతున్న కవితాగ్ని గా ,శక్తి జలపాతం గా కీర్తింప బడ్డ క్రిస్టఫర్ మార్లో 1564ఫిబ్రవరి26 న కాంటర్ బరీ హౌస్ లో షేక్స్ పియర్ కు రెండు నెలలు ముందు పుట్టాడు .కవులు ‘’the muses darling ‘’ అని , షేక్స్పియర్ మార్లో తన ప్రేరణ అని ,జాన్సన్ అతని కవితా పంక్తులు మహా శక్తి పూరకాలని, డ్రేటన్ ’’had translunary things in him’’ ఉన్నకవి అని మెచ్చారు .మార్లో చనిపోయిన మూడు శతాబ్దాల తరువాత స్విన్ బరన్ కవి ‘’crowned ,girdled ,and shod with light and fire ,first born of the morning sovereign star ‘’అని కితాబిచ్చాడు .మార్లో ముప్ఫై ఆరు నాటకాలు ,నూట ఏభై నాలుగు సానేట్స్ ,రెండు దీర్ఘ కవితలు రాశాడంటారు .
మార్లో తండ్రి చెప్పులు తయారు చేసేవాడు .తాత తోళ్ళను శుభ్రం చేసేవాడు .నలుగురు చెల్లెళ్ళు .అంతా ఆ ఇరుకు కొంపలోనే గడిపారు .పదిహేనవ ఏట స్కాలర్ షిప్ సంపాదించి మార్లో కింగ్స్ స్కూల్ లో చేరాడు .మరో రెండేళ్లకు మరో స్కాలర్షిప్ పొంది కేంబ్రిడ్జ్ లోని కార్పస్ క్రిస్టి కాలేజి లో చేరాడు .ఆరేళ్ళు చాలా ఇబ్బందులు అనుభవించాడు .మార్లోకు అతీత శక్తులున్నాయని తోటి విద్యార్ధులు అనుకొనే వారు .ఇతను మాత్రం పాత నిబంధనలలో జెహోవా ఉదంతాన్ని పఠిస్తూండే వాడు .కొత్త నిబంధన లోని జీసస్ కంటే యెహోవా పై నమ్మకం ఎక్కువ .కఠిన నిబంధనలకు భయ పడి ఏ నిబంధనలూ లేని ‘’పాగన్ వరల్డ్ ‘’అంటే విగ్రహారాధన కు చేరువైనాడు .ఇరవయ్యవ ఏట పవిత్ర గ్రంధాలు చదువుతూనే’’ ఓవిడ్ ‘’ను సరళ భాష లో అనువాదం చేసి ప్రచురించాడు .లండన్ బిషప్ ,కాంటర్ బరీ ఆర్చి బిషప్ దీన్ని నడి బజారులో తగల పెట్టించారు .మరో రెండేళ్లలో క్రిస్టియన్ ఫాదర్ల నుండి దూరమై ‘’ఈతెన్ డ్రామటిస్ట్’’లకు దగ్గరయ్యాడు .’’లూకాన్ ‘’లో కొన్ని భాగాలు తర్జుమా చేశాడు .వర్జిల్ దగ్గర తానూ రాయ బోయే ‘’the tragedy of Dido .queen of Carthage ‘’నాటకానికి ముడి సామగ్రి ని సేకరించాడు .
నాదాత్మక శబ్ద బ్రహ్మ
మతాధికారుల దౌర్జన్యం మితి మీరి పోయింది .అందుకే ఏం ఏ.డిగ్రీ ని ఇవ్వటానికి నిరాకరించారు .కేంబ్రిడ్జ్ ని వదిలేసి లండన్ చేరాడు మార్లో .అక్కడ కవులూ కళా కారులు నటులు నాటక రచయితలతో పరిచయం పెంచుకొన్నాడు .రెండు నాటక దియేటర్లు తో అను బంధం ఏర్పడింది .వారికి నాలుగు మహాద్భుత నాటకాలు ఆరేళ్లలో రాశాడు .అవే ‘’తామ్బర్లేన్ ది గ్రేట్ ‘’,ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ ‘’,ది జ్యూ ఆఫ్ మాల్టా అండ్ ఎడ్వర్డ్ ది సెకండ్ ‘’.అంతవరకూ అలంకార శాస్త్రాన్ని అంతగొప్ప ఉపయోగించిన వారు లేరు .ధ్వని ప్రాదాన్యతనిచ్చి కవిత్వానికి శోభ తెచ్చాడు .అనిబద్ధ కవితకు మహర్దశ పట్టించి అదొక కొత్త భాషా ప్రక్రియ గా తీర్చాడు .మాటలను సంగీత ధ్వనిగా మార్చి సంగీతమే వింటున్నామేమో, వాయిద్య సమ్మోహనం లో కొట్టుకు పోతున్నామేమో అన్నంత శ్రావ్యమైన పదాల కూర్పు తో విశేషం గా ఆకట్టుకొన్నాడు .అతని శబ్ద సృష్టి ఎల్లలను దాటి’’ బ్లాక్ బస్టర్ ‘’విజయాన్ని సాధించింది .డాక్టర్ ఫాస్టస్ శిఖరాయ మానం గా నిలిచింది . అంతకు ముందు ముందెన్నడూ ఇంగ్లీష్ కవిత్వం లో వినని శబ్దాలను ప్రయోగించి నూతనత్వానికి మార్గాగామి అయ్యాడు మార్లో .
మళ్ళీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు మార్లో .అజ్ఞాత వాదాన్ని సహించారు. కాని నాస్తిక వాదం నేరం ఆకాలం లో ..నాస్తిక వాద ముద్ర వేశారు మార్లో పై .దైవ దూషణ నేరం , మరికొన్ని చిల్లర దోషాలు మోపి ఇరవై నాలుగేళ్ల వయసులో జైలుకు పంపారు .విడుదలై బయటికోచ్చాడుకాని మరో అయిదేళ్ళ తర్వాత ‘’ప్రీవీ కౌన్సిల్ ‘’పూర్తీ విచారణ కు సిద్ధమవగా 30-5-1593లో మార్లో హత్య చేయబడ్డాడు .లెస్లీ హాట్సన్ అనే చరిత్రకారుడు మార్లో ను ఇంగ్రాం ఫ్రిజర్ అనే మార్లో తో బాటు తాగే వాడు డబ్బు తగాదా తో తేమ్స్ నది సమీపం లో డెప్త్ ఫోర్డ్ లో చంపాడని తేల్చాడు .మార్లో ఉద్రేకి. త్వరగా కోపం తెచ్చుకొనే స్వభావం ఉన్న వాడు .చిన్న తగాదాకే వారిద్దరి మధ్యా ఉద్రేకాలు పెరగటం తో ఫ్రిజర్ మార్లో ను తల పగల కొట్టాడు. అప్పటికప్పుడే మార్లో చనిపోయాడు .
మార్లో నాటక రచయితా అయి ఉండక పోతే అతన్ని ఎవరూ ఇప్పటిదాకా గుర్తుంచుకొనే వారు కాదేమో ?అతను రాసిన ‘’ది పాషనేట్ షెపెర్డ్ టు హిస్ లవ్’’ఎలిజబెత్ కాలం నాటి లిరిక్కులకు అనుకరణయే .’’it lies not in our power to love or hate – for will in us is overruled by fate ‘’వంటి చిరస్మరణీయ కవితా పంక్తులు రాశాడు .షేక్స్ పియర్ మార్లో కవితలను మర్చంట్ ఆఫ్ వెనిస్ ,లో బాగా వాడుకొన్నాడు .అందుకే ‘’Marlowe is that affable familiar ghost in the eighty sixth of Shekespeare’s sonnets and his spirit appears in un mistakably in’’As you like it ‘’ when Phebes quotes the famous line with appropriateness and true appreciation ‘’అని తేల్చారు విమర్శకులు విశ్లేషకులు ,ఉదాహరణగా ‘’dead shepherd now I find thy saw of night –who ever loved ,that loved not at first sight ‘’చూపించారు .
నాటక రచయితగా గొప్ప పేరు సంపాదించినా అతని నాటకాలు శిఖరాయ మానం గా లేవు అని అన్నారు .శిఖరం చేరి తడబడి జారిపోయాయి అని వారి భావం .అతని విషాదంత నాటకాలు ‘’ sprinkled with the brains of slaughtered men compounded of cruelty ,stewn with individual murder and whole sale massacres .’’దీనికి కారణం అతను సంఘానికి దూరమై ఏకాకి జీవితం గడపటం ఆత్మాన్వేషణలో అనేక ప్రశ్నలు వేసుకొని సంతృప్తి కర సమాధానాలు పొందలేక ,ప్రపంచం మీది కసితో ద్వేషం పెంచుకొని రాయటమే .Marlowe lived wrote ,and died at top pitch –wrestling with his compelled creatures the last note of extremity from passion in poetry ‘’
![]()
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-14-ఉయ్యూరు

