పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12
ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )
చనిపోవటానికి కొద్ది కాల ముందు దాకా డబ్బును మదుపు చేశాడు షేక్స్ పియర్ .యాభైల్లో రియల్ ఎస్టేట్ ను బ్లాక్ ఫ్రాయార్స్ లో కొన్నాడు .ముగ్గ్గురు భాగ స్వాములను చేర్చుకొన్నాడు .భార్యకు వీటిపై అధికారం లేకండా చేయటమే ఈ భాగస్వామ్యానికి కారణం .ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు మనవాడి కోసం ఎదురు చూస్తున్నాడు .వాడికి తన పేరు పెట్టి ఈ మొత్తం ఆస్తికి వారసుడిని చేయాలని ఆలోచన .కూతురు సుసాన్నా డాక్టర్ జాన్ హాల్ ను పెళ్ళాడి కూతురు ఎలిజ బెత్ ను కన్నది .చిన్న కూతురు జూడిత్ థామస్ ఇన్సి ని పెళ్లి చేసుకొన్నది కాని షేక్స్ పియర్ మనవడి కోరిక తీరలేదు .
రాసిన నాటకాలను తిరగ రాయటం మార్పులూ చేర్పులూ చేయటం తో గొప్ప నాటక రచయిత గా గుర్తింపు పొందాడు .నాటక శాలయే జీవితం ,ఊపిరి ,శ్వాస గా జీవించాడు .మొదంతా విషాదాంత నాటకాలు రాసి విజ్రుమ్భించి కీర్తిని మరింత పెంచుకొన్నాడు .చాలా కాలం కామెడీ లానే నమ్మి రాశాడు . కాని మనకు మాత్రం హామ్లెట్ ,మేక్ బెత్ ,కింగ్ లియర్ వంటి విషాదాంతా లనే మనం గుర్తు పెట్టుకొని ఆయన మొహాన్ని ‘’స్టోన్ ఫేస్ ఆఫ్ ట్రాజేడి’’గా గుర్తుండి పోయాడు .ఎవడైనా ఏడుపు మొహం పెడితే ‘’షేక్స్పియర్ మొహం ‘’అనే ముద్ర పడి పోయింది .ఆయన జీవితం అంతా ఖుషీ గానే గడిచింది అని మరవ రాదు . ‘’యాజ్ యు లైక్ ,ట్వేల్ఫ్త్ నైట్ ,కామెడి ఆఫ్ ఎర్రర్స్ ,లవ్స్ లేబర్ లాస్ట్ ‘మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’మొదలైన హాస్య నాటకాలలో మాటల గారడీ తో గొప్ప హాస్యం సృష్టించాడు .శ్లేష తో పకడ్ బందీ అయిన పాత్రలతో ,పాత్రల పేర్లే నాటకాల పేర్లు గా చెలామణి చేసి అందర్నీ అలరించాడు .
చక్కని సన్నివేశాలు ,హృదయానికి హత్తుకొనే సంభాషణలు ,మానసిక సంఘర్షణలు తో నాటకాలకు జీవం పోశాడు .తేలిక మాటలను ఎలిజ బెత్ కాలపు స్త్రీ ,పురుషులు ఆదరించారు .నాటకం లో అంతర్నాటకం నడిపి సస్పెన్స్ ను సృస్టించాడు .బూతులు ,చౌక బారు మాటలంటే షేక్స్ పియర్ అసహ్యించుకొన్నాడు .ఆయన లోని ‘’జీనియస్ ‘’తన ప్రతాపాన్ని అన్ని కోణాల్లోనూ చూపించాడు .షేక్స్ పియర్ ను కామెడీ రచయితలలో ఒకడిగా ,ట్రాజేడికింగ్ గా ముద్ర వేశారు .1609లో ‘’షేక్స్ పియర్ సానేట్స్’’వెలువడ్డ్డాయి .దానిని ‘’one of the great literary enigmas ‘’అంటూ పొంగిపోయారు విమర్శకులు .a
షేక్పియర్ వ్యక్తిత్వం గురించి ‘’with his key he unlocked his heart ‘’అన్నాడు వర్డ్స్ వర్త్ .’’Shakspeare’s secret was inscrutably his own ‘’అన్నాడు మాధ్యూ ఆర్నోల్డ్ .ఎలిజబెత్ కాలం లో సానెట్ ను పల్లకీ లో పెట్టి ఊరేగించి నంత వైభవం పొందింది .నాటకాలలో మానసిక సంఘటనలు ,లోతైన అవగాహన ఉన్నాయి . మేక్ బెత్, కింగ్ లియర్ వంటి వారి మనసులు విషాదాంతం గా విడిపోయాయి .షేక్స్ పియర్ ప్రకృతికి దర్పణం వంటి వాడు .మనిషి పడిన గందర గోళం ను అతని తెలివి తేటల తో కూడిన హాస్యం కంటే బాగా ప్రతిఫలింప జేశాడు .షేక్స్పియర్ పాత్రలు ‘’were rocked by ungovernable passions ‘’అని మెచ్చారు .’’shakspeare’s genius flares up ,flickers ,and falls ‘’అని తేల్చారు .
లండన్ ను అకస్మాత్తుగా వదిలి స్వగ్రామం స్రాట్ ఫర్డ్ చేరుకొన్నాడు .లండన్ లో మానసికం గా కుంగి పోవటమే ఈ మార్పుకు కారణం .చని పోయే దాకా అక్కడే ఉండి పోయాడు .ఇక్కడ ఉండే మిగిలిన నాటకాలు రాసి పూర్తీ చేశాడు .ఆ ఊరి సమాజం లో అతి ముఖ్య వ్యక్తిగా గుర్తింపు పొందాడు .1616లో చివరి సారిగా వీలునామా రాశాడు .కూతుళ్ళకు వాటాలిచ్చాడు .స్నేహితులకు తలా కాస్తా ముట్ట చెప్పాడు.పుట్టబోయే మనవాళ్ళు మానవ రాళ్లకూ ఏదో కొంత రాశాడు రాసిన కొద్ది రోజులకే యాభై రెండేళ్ళ వయసులోఏప్రిల్ ఇరవై మూడున మరణించాడు .తన ఆస్తికి గార్డియన్ లను నియమించాడు . ..పార్ధివ శరీరాన్ని హోలీ ట్రినిటి చర్చి లో ఉంచారు . వెస్ట్ మినిస్టర్ ఆబ్బె లో గౌరవ ఖననం చేశారు సాహిత్య చరిత్రలో ఒక మేధావి ,గొప్ప సృజనాత్మికతను ప్రదర్శించి ,వ్యాపారం చేసి లబ్ధ ప్రతిస్టూడై చిన్న టౌన్ లో ఒక పౌరుడుగా జీవించ లేదు ఇది షేక్స్ పియర్ కే సాధ్యమైంది .జాన్సన్ తన జీవితకాలం లోనే రచనలను ముద్రించుకొని చూసుకొన్నాడు. కాని షేక్స్ పియర్ మాత్రం దీనికి విరుద్ధం గా తన రచనలను ముద్రించుకోవటానికి వాటిని తన కళ్ళ తో చూసుకోవటానికి ఇస్టపడ లేదు
షేక్స్ పియర్ మరణానంతరం ఆయన తో పని చేసిన నటులు ఇద్దరు జాన్ హమ్మిన్గ్స్ ,హెన్రి కాండెల్ లు .32నాటాకాల సంపుటిని ,అనుబంధం గా మరో పద్దేనిమిదిని ముద్రించారు .కొత్త తరహాలో చెప్పటం విలియం కు ఇష్టం .అందుకే ‘’every word doth almost tell my name ‘’అన్నాడు షేక్ .ప్రతి విషయానికి ఉన్న ఇరు పార్శ్వాలను స్పృశించాడు .హామ్లెట్ లో ఆయన చెప్పిన మాటలు ఆయన హృదయాన్ని తెలియ జేస్తాయి .’’what a piece of work of man !how noble in reason !how infinite in faculty!in form and moving how like an angel !in apprehension how like god!the beauty of the world !the paragon of animals 1’’
ఆయన మాటలు సామెతలుగా జనం నాలుకల మీద నిలిచి పోయాయి .’’there is a divinity thatshapes our ends ‘’-as flies to wanton boys are we to the gods –they kill us for their sport ‘’.
ఏ విదానమైనా ‘’moderation tolerance and decency ‘’నిర్మించ బడాలని భావించాడు .’’in an age of private intrigue ,political treachery and general turmoil ,he upheld conservative law ,natural order and harmony .’’భాషకున్న శక్తి ,మాటలకు వాటి మధ్య ఉన్న అను బంధం అందులోని సంగీత సౌలభ్యం ఆయనకు తెలిసి నంత ఎవరికీ తెలియ లేదు .’’the world of Shakespeare is one that continually being explored .shakespeare is one who was the universal dramatist ,the mirror of man kind .we become paart of his works .we can never encompass the universe he created –it contains us ‘’.
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-14-ఉయ్యూరు

