పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13
తళుకుల యుగం
ఎలిజ బెత్ శకం తరువాత శతాబ్దాల కాలం సురక్షితం గా ఉన్న మనిషి హోదా కుంచించుకు పోయింది .మనిషి అధిక్యతః పై సందేహాలేర్పడ్డాయి .రెండు వేల ఏళ్ళ తర్వాతా మనిషి విలువ ,అవసరం తెలిసి మనిషి లేనిదే ఏ గొప్ప కళ కూడా రాణించదు అనే భావం ఉంది .షేక్స్పియర్ ప్రభావం నిరంతర యుద్ధాల వలన తగ్గినా ఆయన సృజన మీద గౌరవం తగ్గలేదు.దేవుడు మనిషి కోసం ప్రాణ త్యాగం చేశాడు కనుక మనిషి కూడా దేవుడికోసం చని పోవటానికి సిద్ధ పడ్డాడు . దెయ్యాలు భూతాలతో పాటు భూమి మీద దేవతలూ మానవునితో సంచరించారు .విశ్వానికి భూమి కేంద్రమై మనిషి భూపాలకుడయ్యాడు .’’man is the beauty of the world ,the paragon of animals ‘’అన్న భావం స్పష్టమైంది .సృష్టి అంతా మానవునికి లొంగి ఉండేదే అని’’ జార్జి హెర్బర్ట్’’ అన్నాడు. ‘’హుకర్ ‘’జీవజాలం అంతా మనిషి చెప్పు చేతల్లో నడవాల్సిందే అన్నాడు .షేక్స్ పియర్ మరణం తర్వాత మనిషి ప్రక్రుతి తో విభేదించటం ,తనలోని అంతఃకరణ తో పోరాటం ఎక్కు వైంది. ఈ కొత్త వేదాంతం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నాడు .నిజం గా అది స్వర్ణ యుగం కాక పోయినా ‘’తళుకుల యుగం ‘’అయింది .ఆ కాలం లోనే పుట్టాడు బెన్ జాన్సన్ .
మొట్ట మొదటి రాజాస్థాన కవి – బెన్ జాన్సన్
బెన్ జాన్సన్ ఎలిజబెత్ యుగం వాడే అయినా ఆలోచనలు ,విరుద్ధ భావాలు మాత్రం తరువాతి తరానికి సంబంధించినవే .అతని భావాలు పరస్పర విరోధం .ముతక వ్యంగ్యం అయినా చాలా లాజికల్ ఆలోచనలున్నవాడు .నాటకాలు కవితలు రాశాడు .ఏది చేసినా ఎదురొచ్చాయి . 1572లో లో పుట్టాడు బెంజమిన్ జాన్సన్ అసలు పేరు. కాని ‘’బెన్ జాన్సన్’’ గా నే అందరూ పిలిచారు .లండన్ వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి అక్కడి టీచర్ అయిన విలియం ‘’కాండెన్’’ ప్రభావానికి లోనైనాడు .పై చదువులకు ఆర్ధిక స్తోమత లేదు .తండ్రి పేరు మోసిన తాపీ మేస్త్రి. ఆ పనిలో తండ్రికి సాయం చేశాడు .కేంబ్రిడ్జి కాలేజి లో చదివాడు అంటారు కాని రుజువు కాలేదు .ఏ కాలేజీ లోను చదవ కుండా స్వయం గా చదువుకొని ,యూనివర్సిటి ట్రెయిండ్ గ్రాడ్యుయేట్ల తో ,నాటక రచయితలతో స్నేహం చేశాడు .ఇరవై ఆరేళ్ళకు నటుడై ,నాటక రచయితా అయి దర్శకుడూ అయ్యాడు జాన్సన్ .1598 నుంచి దియేటర్ తో పరిచయం ఉంది .
‘’పల్లాదిస్ టామిన’’లో నటనను మెచ్చుకొన్నారు .’’ఎవిరి మాన్ ఇన్ హిస్ హ్యూమర్ ‘’లో షేక్స్పియర్ నే ఒక పాత్రను చేసి రాశాడు .విజయాని సాధించిన ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు .చావు రోజులు దగ్గర పడ్డాయి .అదే ఏడాది 1598లో తోటి నటుడు గాబ్రియల్ స్పెన్సర్ తో తగాదా పడి చంపేశాడు . ఉరి శిక్ష పడింది కాని తప్పించుకొన్నాడు. బెన్ .జైల్లో ఉండగా రోమన్ కేధలిక్ అయ్యాడు .వదిలేశారు .కాని ఆస్తిని అంతటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .ఎడమ బొటన వేలు నరికి శిక్షించారు .పన్నెండు ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ చర్చికి చేరాడు .
ముందే పెళ్ళాడాడు .పెళ్లి అయిన అమ్మాయిలతో శృంగారించాడు.భార్య కు చాలా కాలం దూరం గానే ఉన్నాడు .తలతిక్క ,పొగరు బోతుతనం ,చెడ తిరుగుడు ,తోటి నటులతో తగాదా పడటం, కవులను అసహ్యించుకోవటం చేస్తూ అందరికి దూరమయ్యాడు .షేక్స్ పియర్ చేత ప్రశంసలు పొందాడు .బేకన్ ,బ్యూమాంట్ ఫ్లెచర్ ,సిడ్ని డోన్నే లు ఆరాధించారు .జాన్సన్ ముఠాకు చెందినా యువ కవులు ‘’we are the tribe of Ben and made jonson the first dictator in the history of English literature ‘’అని బెన్ ను ఆకాశానికి ఎత్తేశారు .ఉడుకు రక్తం తో యవ్వనం లో పచ్చిగా తిరిగాడు దేన్నీ లక్ష్య పెట్టలేదు .కొద్ది కాలం తర్వాత బాణీ మార్చాడు .కామెడీని ఒదిలి చారిత్రిక ట్రాజేడీలను రాశాడు .అందులో సేజనాస్ ,’’హిస్ ఫాల్ అండ్ కార్తిలిన్ ,హిస్ కాన్స్పిరసీ మాత్రమె విజయ వంతమైనాయి .
ఎలిజ బెత్ తర్వాతా మొదటి జేమ్స్ రాజు అయ్యాడు . .రాజుకు ఇస్టమను కొని ఒపెరాలు బాలేట్లు గ్రీకు ,రోమన్ సెటైర్స్ ఆధారం గా తయారు చేశాడు .అనుభవం లేని నటులు వీటిని నటించారు .కవితల కంటే వీటికే ఆదరణ పెరిగింది .ఒక దశాబ్దం లోనే వీటిని రాసేశాడు .ముప్ఫై నలభైల మధ్య ‘’వోల్పోన్ ,ఆర్ దిఫాక్స్ ,ఎపికోసీన్ ఆర్ ది సైలెంట్ విమెన్ ,ది ఆల్కెమిస్ట్ జాన్సన్ సాహిత్య సేవ కు మెచ్చి రాజు పెన్షన్ ఏర్పాటు చేశాడు .రాజు జాన్సన్ ను మొట్ట మొదటి ‘’ఆస్థాన కవి ‘’ని చేశాడు .శాశ్వత వార్షికాన్ని , ఒక టన్ను వైన్ ను ఇచ్చాడు .నలభై అయిదేళ్ళ వయసు లో లండన్ బోరు కొట్టి స్కా ట్ లాండ్ చేరాడు .అక్కడకవులతో పరిచయాలు పెంచుకొన్నాడు .’’ ఎడిన్ బర్గ్ బర్జేస్’’అయ్యాడు .ఆరోగ్యం క్షీణించిపోయి బలహీన పడు తున్నాడు .అతని లైబ్రరి తగలడి పోయింది .షాక్ తిన్నాడు .మళ్ళీ ఒక వెలుగు వెలగాలని ప్రయత్నించాడు సేటైర్ లే తనను బతికిస్తాయని అనుకొన్నాడు .అందులో ‘’ఇనిగ్నో జోన్స్’’ వంటి వారిని ఉతికి ఆరేశాడు .
55లో గుండెపోటు వచ్చి ,పాక్షిక పక్షవాతం వచ్చింది .రెండవ సారి గుండె పోటూ వచ్చింది .అయినా తొమ్మిదేళ్ళలో కొత్త నాటకాలు రాశాడు .బాగా జబ్బు పడ్డాడు .కోలుకో లేని స్థితి .డబ్బులు లేవు .మానసికం గా కుంగి పోయాడు .అరవై నాలుగేళ్ల వయసులో 6-8-1637నబెన్ జాన్సన్ బాల్చీ తన్నేశాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఖననం చేశారు.సమాధి పై ‘’o Rare Ben Jonson ‘’అని రాసిన ఫలకం ఉంచారు .నిజాయితీగా ఉన్నాడు కాని కొద్ది గర్వం కొంప ముంచింది .తన నాటకాలను’’కలేక్టేడ్ ప్లేస్ ‘’గా ముద్రించుకొని చూసుకొన్న మొదటి నాటక రచయితా గా బెన్ జాన్సన్ చరిత్ర సృష్టించాడు .ఈ రోజుల్లో బెన్ జాన్సన్ ను గౌరవిస్తారుకాని ప్రేమించే వారు లేరు .రచనలు ఉత్సుకత తో చదువుతారు కాని ఆశ్చర్యంపొందలేరు ‘’.Jonson does not possess the real magic ,the genius to transform ‘’అంటారు .
కవిత్వం లో అనితర సాధ్యమైన ప్రతిభ చూపాడు .మనిషి మీది కోపం ,తిరస్కార పూర్వక హాస్యం ,విసుగు లను అతని సంగీత శబ్ద మార్మికత తో మర్చి పోతారు .’’drink to me only with thine eyes ‘’,అన్నాడు queen and huntress ‘’బాగా పేలాయి .మచ్చుకి ఒక కవిత –it was a beauty that I saw –so pure ,so perfect as the frame –of all the universe was lame –to that one figure ,could I draw –or give last line of it a law .
‘’a skein of silk without a knot –a fair march made without a halt –a curious form without a fault –a printed book without a blot –all beauty and without a spot !’’.
కవిత్వమే అన్ని ప్రక్రియల కంటే ఉన్నతమైనది అని ,ట్రాజేడి ఆనందాన్ని అందిస్తూ జీవిత సత్యాలను బోధించాలని చెప్పాడు .కామెడి మనసుకు హత్తుకొని మంచి శైలి తో ఉండాలన్నాడు .’’ఎవెరి మాన్ ఇన్ హిస్ హ్యూమర్ ‘’నాటకం లో లండన్ నగర యదార్ధ స్థితి కళ్ళకు కట్టించాడు .మనిషిలోని దురాశకు ,మోసానికి సాక్షాలు ‘’వోల్పోన్ ‘’మరియు ‘’ఆల్కెమిస్ట్ ‘’నాటకాలు .ప్రతి మనిషి హాస్య ప్రాణి గా ఉండాలని బెన్ జాన్సన్ ఆశించాడు .అతని విమర్శలు ఆరోగ్య కరం గా ఉండి మార్గ దర్శకాలయ్యాయి .అతను ఒక ముఠాను ఏర్పాటు చేసుకొన్నాడు .వీరినే ‘’tribe of Ben ‘’అన్నారు .వాళ్ళను జాగ్రత్తగా నిబ్బరం గా బుద్ధి ,మనసూ పెట్టి రాయమని హితవు చెప్పాడు .
![]()
![]()
గురువు విలియం కామ్ డెన్
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-14-ఉయ్యూరు

