పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11
ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2
1592వరకు లండన్ లో షేక్స్ పియర్ ఏమి చేసిందీ తెలియదు .అప్పుడే ‘’ఆరవ హెన్రి ‘’నాటకం మొదటి భాగం అచ్చు అయింది .అప్పటికి ఆయనకు ఇరవై ఎనిమిది .రాబర్ట్ గ్రీన్స్ తాగుడు ,వ్యభిచారం తో సర్వం కోల్పోయి బుద్ధి తెచ్చుకొని తన బాచ్ లోని ముగ్గుర్ని తన పతనానికి వారే కారణం అని తిట్టాడు ..షేక్స్పియర్ పై నిప్పులు కక్కాడు .కింది తరగతి నటులకు కే వ్రుత్తి అనే భావం తో గ్రీన్ నాటకాలు రాయటం మానేశాడు .గ్రీన్ రాసిన ‘’గ్రోట్స్ వర్త్ ఆఫ్ విట్’’ ను షేక్స్ పియర్, ఆయన అనుచరులు వ్యతిరేకించారు .
గొప్ప నటుడు గా విలియం పేరు పొందాడు .గ్రీన్ అతని మిత్రుల విమర్శ దాడి వలన షేక్స్పియర్ అప్పటికే లబ్ధ ప్రతిస్టూడైన నాటక రచయిత అని తెలుస్తోంది .నటన కు శిక్షణ కావాలి ,దాన్ని ఆచరణ లో పెట్టాలి .అందుకే లండన్ లో ఉండి పోయాడు .కనుక ఆయన జీవితం లోని దాదాపు మొదటి సగ భాగం అంటే ఆయన 28వ ఏడు వరకు అజ్ఞాతం లోనే ఉండి పోయింది .పల్లెటూరి వాడు నాగరికుడై వేలిగాడని భావించాలి .ఇంగ్లాండ్ లో అగ్రగామి నటుడుగా ,నాటక రచయితా గా భాసించాడు .ఇది ఇలా ఉంటె తాను షేక్స్ పియర్ అక్రమ సంతానాన్ని అని విలియం ‘’డేవ్ నట్ ‘’ అనే వాడు ప్రకటించి కలకలం రేపాడు .అతని కధనం ప్రకారం షేక్ చేతిలో పెన్నీ కూడా లేకండా లండన్ వచ్చాడని ఒక దియేటర్ లో డోర్ కీపర్ గా ఉద్యోగం చేశాడని ,యజమాని నాటకం చూడటానికి వచ్చినప్పుడు అతని గుర్రాలను మాలిష్ చేసేవాడని ,ఇది యజమాని దృష్టిలో పడిందని’’చిన్న ఉద్యోగం ‘’ఇచ్చాడని కుర్రకారు నటుల్ని పోగేసి నాటకాలు ఆడించాడని వారిని ‘’షేక్స్ పియర్ బాయ్స్ ‘’అనే వారని వారు తమ ఇళ్ళకు తీసుకు పోయే వారని కోతలు కోశాడు . బహుశా ఆ ఉద్యోగం’’ ఎక్స్ ట్రా నటుడు ‘’అయి ఉండ వచ్చు .నాటకాలు బాగా లేక పొతే సీన్లు మార్చి రాసేవాడని కూడా వాడు ఉవాచ .
ఆ రోజుల్లో నాటకాలను రచయిత నుంచి కొని తెచ్చుకొని నాటక కంపెనీలు స్వంతం చేసుకొనేవి .వాటిని యదా తదం గా ఆడేవారు కాదు. మార్పులూ చేర్పులూ చేసి ఆడించేవారు .పూర్తిగా తయారయ్యేసరికి రచయిత రాసినది అంతా దాదాపు పూర్తీ గా మారిపోయేది .ఈ పనులను షేక్స్ పియర్ చేత చేయించి ఉండ వచ్చు .దీంతో నాటక రచయితలతో గాఢ పరిచయం లభించి ఉండ వచ్చు .ఈ కుర్ర షేక్స్ పియర్ అలా మార్చ బడిన నాటకాలన్నిటికి ‘’రచయిత ‘’గా గుర్తింపు పొంది ఉండ వచ్చు .డోవర్ విల్సన్ అనే ఆయన ‘’ఎరల్ ఆఫ్ సౌత్ యాం టన్’’కు విలియం వ్యక్తీ గత సేవ చేశాడన్నాడు .పల్లెటూరి స్కూల్ మేస్టర్ గా చేసిన అనుభవం విలియం కు ఉంది .అందుకని ఎరల్ కు ట్యూటర్ గా ఉండి ఉంటాడు. స్పానిష్ ఆర్మోడా సైనికం గా బ్రిటన్ ను బెదిరించినప్పుడు విలియం ప్రత్యక్ష అనుభవం సంపాదించి ఉండ వచ్చు ..ఇరవై అయిదుకు పోర్చుగల్ నౌకా పరిశోధన తెలిసి ఉండచ్చు .ఇవన్నీ ఆయన నాటకాలలో సంభాషణలకు ముడి సరుకు అయి ఉండ వచ్చు .
ఇలా పుకార్ల షి కారుల్లో ఇప్పటి దాకా గడిపాం .ఇప్పుడు నిజ చరిత్ర తెలుసు కోవటానికి 1593కు వద్దాం .’’వీనస్ అండ్ అడోనిస్ ‘’అప్పుడే అచ్చయింది .ఒక ఏడాది తర్వాత ‘’ది రెప ఆఫ్ లూక్రేస్ ‘’వచ్చింది .చాలా నిబద్ధత తో వీటిని రాసి తన సంతకం తో ముద్రించాడు వీటిని షేక్స్ పియర్ .అద్భుత విజయం సాధించి పది ఎడిషన్లు పొందాయి .అంతే స్టార్ తిరిగింది . మరో పదేళ్ళలో ‘’పల్లాడిస్ టామియా ‘’విడుదల అయింది .ముప్ఫై రెండేళ్ళ వయసులోనే విలియం పన్నెండు నాటకాలు రాసినట్లు పదహారవ శతాబ్దికి చెందినా ఫ్రాన్సిస్ మేర్స్ రాశాడు .ఇందులో కామెడీలు ట్రాజేడీలు కలిసే ఉన్నాయి .కవిగా నాటక రచయితా గా’’ సవ్య సాచి అయి, మంచి పేరు తెచ్చుకొన్నాడు .మేర్స్ ‘’the sweet wittie soul of Ovid lives in the mellifluous and honey tongued Shakespeare ‘’అని శ్లాఘించాడు .’’వీనస్ అండ్ అడోనిస్ ‘’పై విరుద్ధ అభిప్రాయాలోచ్చాయి –వీటిని ‘’a couple of ice houses ‘’అంటూ అతను చేసిన తప్పులు లెక్కలేనన్ని అని హాజ్లేట్ అన్నాడు. కాల్రిద్జ్ మహాశయుడు ‘’shakespeare wrote as if he were a visiting god from another planet charming you to gaze on the movements of Venus and Adonis as you would on the twinkling dances of vernal butterflies ‘’అన్నాడు .యువతకు అందులోని అందం ,అద్భుతం ,విధానం ,ఇంద్రియ అనుభవం పిచ్చ పిచ్చ గా నచ్చాయి .దీన్ని నాటకాల పై అమితాసక్తి ఉండి నాటకాలను తరచుగా చూసే సౌతాంప్ టన్ ఎరాల్ కు అంకితమిచ్చాడు .
దీని విజయం తో విలియం ఎరల్ కు మంచి మిత్రుడు ,పాట్రన్ అయ్యాడు ఈయనకే ‘’లూక్రీస్ ‘’అంకితమిచ్చాడు .పందొమ్మిదేళ్ళ షేక్పియర్ కు ,ఇప్పటి ముప్ఫై ఏళ్ళ షేక్ కు ఏంతో మార్పు ను గమనిస్తాం .’’I love I dedicate to your lordship is without end where of this pamphlet without beginning but a superfluous moity –what I have done is yours what I have to do is yours being part in all I have devoted yours ‘’అని అత్యంత విధేయత తో అకితం చేశాడు .ఇందులోని కద కూడా ‘’ఓవిడ్ ‘’లోని కధే .లూక్రేస్ ముద్రించిన తరువాత సౌతాం ప్ టన్కు కొత్త కళతో బాటు కొత్త యుగమూ వచ్చింది .ఎరల్ దొర కవికి ఒక వెయ్యి పౌండ్ల ధనాన్ని కానుక గా అందజేశాడు .దీని విలువ ఇప్పుడు యాభై వేల డాలర్లు అవుతుంది .ఈ డబ్బునూ అంతకు ముందు నటుడుగా నాటక రచయితా గా సంపాదించిన దానినీ బాగా లాభాలు ఆర్జించి పెట్టె ‘’చాంబర్లీన్ కంపెని ‘’లో పొదుపు చేశాడు .ఇక భరోసా వచ్చింది .డబ్బుకు వెంపర్లాడాల్సిన పని లేదు కనుక కాలాన్ని నాటక రచనకే అంకితం చేశాడు .కవి దార్శనికుడై నాటక రచయిత గా పరి వర్తనం చెందాడు .
పైరేటెడ్ నాటకాలకు ఆ కాలం లోను మంచి డిమాండే ఉంది .కాని కవిత్వానికి ముఖ్యం గా షేక్స్ పియర్ కవిత్వానికి ఇంకా ఆదరణ పెరిగింది .ఒక పబ్లిషర్ అత్యాసగా’’ పాషనేట్ పిల్ గ్రిం ‘’అనే పేరుతో షేక్స్పియర్ కవి రాసినట్లుగా పేరు పెట్టి అచ్చేసి దేశం మీద వదిలాడు .అందులో పాత తరం, కొత్త తరం కవులందరి రచనలు ఉన్నాయి .ఎగ బడి జనం కొన్నారు .తెరిచి చూసి ‘’మోసం గురో ‘’అన్నారు .1585-1596కాలం లో స్ట్రా ఫర్డ్ గురించి చరిత్ర ఏమీ లేదు .మనకవి ‘’ట్విన్స్’’ లో హామ్నెట్ పదకొండేళ్ళ వయసులో చని పోయాడు .అప్పటికి ఈయనకు ముప్ఫై రెండు .ఇంటికి వచ్చి చూసి వెళ్లి ఉంటాడని భావించాలి .తండ్రి పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతే అప్పులన్నీ తీర్చి ఆయన పరువు కాపాడాడు .అంతకు ముందు ఇరవై ఏళ్ళ క్రితం దర్జా గా తండ్రి వేసుకొన్న కోటు మళ్ళీ అప్పులు తీరిన తర్వాతా తండ్రి జాన్ వేసుకొని సమాజం లో ‘’జెంటిల్మాన్ ‘’అని మళ్ళీ పేరు పొందాడు .కొడుకు చాలవ ఇది .ఇంకో ఏడాదిలో కుటుంబ గౌరవం మరీ హెచ్చింది .విలియం స్త్రాఫోర్డ్ లో మరొక అతి పెద్ద బవంతి ని కొన్నాడు .దీన్ని ‘’న్యూ పాలస్ ‘’అన్నారు .దీన్ని ఎనిమిదవ హెన్రి కాలం లో అసలు నిర్మించిన వాడు సర్ హాగ్ క్లాప్తాన్ ‘’.
ముప్ఫై లలో షేక్ బాగా అదృష్ట వంతుడని పించుకొన్నాడు .పెట్టుబడులను తెలివిగా పెట్టి లాభాలు దక్కిన్చుకొన్నాడు .భార్య పొలాలకు దగ్గరలో శాట్టేరి లో నూట ఏడు ఎకరాల భూమి కొన్నాడు .న్యూ పాలస్ కు ఎదురుగా పెద్ద కాటేజీ ఫల వృక్షాలు మంచి తోటను కొన్నాడు .రెండు నాటక కంపెనీలలోబాటు న్యూ గ్లోబ్ కూ భాగస్వామి అయ్యాడు .నలభై ఒకటవ ఏట చర్చికి చెల్లించాల్సిన పన్నులన్నీ కలిపి నాలుగు వందల యాభి పౌండ్లు చేల్లిన్చేశాడు .దీని వలన ఎదాదికిఅరవై పౌన్ల వడ్డీ(పదిహేను శాతం ) పొందాడు .చివరికి ఈ వడ్డీలు ఈ లాభాలు పెట్టు బడులపై విరక్తి కలిగింది .స్త్రాఫార్డ్ సంఘం లో పెద్ద మనిషి గా జీవించాలనే నిర్ణయానికి వచ్చాడు

earl of southampton
.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-14-ఉయ్యూరు

