పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14

యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె

‘’యంగ్ జువెనైల్ ‘’అని పేరొందిన థామస్ నాషె ను తర్వాత ‘’రౌడీ హాస్యగాడు ‘’అన్నారు .’’లిజబెతన్ రెబిలియన్  అనీ ముద్ర వేశారు .ఇతనికాలం 1567-1601.సవ్యమైన నిర్డుస్టమైన ,కఠిన శిక్షలతో ఉన్న పాలనపై తిరగ బడ్డాడు .అతని భాషా భావాలు చాలా కర్కశం గా ఉద్రేకం గా ఉండేవి .ఇరవై తొమ్మిదో ఏట రాసిన చివరి నాటకం’’ది ఐల్ ఆఫ్ డాగ్స్ ‘’లో రాజ్యం లో ఉన్న లొసుగులను బయట పెట్టాడు .దానికి ప్రతిఫలం కొన్ని నెలల జైలు .’’ఎలిజ బెతాన్ జాకోబీన్ సాంగ్స్ ‘’లో ‘’ a body of literary work more precious to the English than any other ,apart from Shakespeare and the translated Bible ‘’అని కవిత్వాన్ని అంచనా వేశారు .కాని అవన్నీ లభ్యం కాలేదు .కరపత్రరచనలో అంతవరకూ ఎవరూ ఇతన్ని మించలేదు .’’కల బర్ట్ కర్రి నెవ్ ‘’అన్నది నాషే రాసిందిగా అందరూ అంగీకరించారు .’’I am sick –I must die –Lord have mercy on us! ‘’అని రాసుకొన్నాడు

A crudely printed, full-length picture of a standing man. He is in Elizabethan-style clothing and chains are around his ankles

 

 

పెళ్లి ,చావు పాటల కవి –డాక్టర్ థామస్ కాంపి యాన్

1567-1620కు చెందిన ధామస్ కాంపియాన్ తనకు తానే ఒక నీతి శాస్త్ర గ్రంధం అని పించుకొన్నాడు .సంగీతం తో పాటు రచనలూ చేశాడు .అతని’’ బుక్ ఆఫ్ ఐర్స్’’ప్రసిద్ధి చెందింది .జీవితా చరిత్ర ఎవరికీ తెలియదు .రచనలన్నీ చరిత్ర లో కలిసి పోయాయి .మూడు వందల ఏళ్ళ తర్వాత పందొమ్మిదో శతాబ్దం చివర్లో మళ్ళీ అతన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు .’’లా’’ చదివాడు .ప్రాక్టిస్ చేసిన దాఖలాలు లేవు .కాని మెడిసిన్ లో ‘’కేయాన్ యూని వర్సిటి నుండి 1605లో డిగ్రీ పొందాడు .అందుకే ‘’డాక్టర్ ఇన్ ఫిజిక్స్ ‘’గా గుర్తించారు. చని పోయే దాకా వైద్యం చేస్తూనే ఉన్నాడు ..గొప్ప తెలివి తేటలున్నవాడు .హైమ్స్ ఒడ్స్ ,పెళ్లి పాటలు ,చావు గీతాలు ,రాశాడు సంగీతం సమకూర్చే వారికి  మార్గ దర్శి గా ఉన్నాడు .’’ఏ న్యు వే ఆఫ్ మేకింగ్ ఫోర్ పార్ట్స్ ఇన్ ది కౌంటర్ పాయింట్ ‘’,కు గుర్తింపు వచ్చింది .’’అబ్సర్వేషన్స్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెట్రి ‘’అనే విమర్శనాత్మ గ్రంధం లో క్లాసికల్ సాహిత్యపు సొగసులను అందులోని ఛందస్సును మెచ్చి మళ్ళీ అవే గతి అని తేల్చి చెప్పాడు .’’he protested against the vulgar and artificial rhyming ‘’.

30వయసులో ఫిలిప్ రోసేస్టర్ అనే తోటి సంగీత కారుని తో కలిసి ‘’ఏ బుక్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ లో మొదటి సగానికి  లిరిక్స్ రాయటమే కాకుండా మొత్తం సంగీతాన్న్ని పర్య వేక్షించాడు .ఈ ప్రయత్నం ఫలవంత మైంది ఈ ధోరణిలోనే మరో మూడు  అంకిత భావం తో తపన తో చేసి ముద్రించాడు .మెడిసిన్ కంటే మ్యూజిక్ కు ప్రాధాన్యత నిచ్చాడు .’’ఫోర్త్ బుక్ ఆఫ్ ఆర్ట్స్ ‘’రాశాడు .దీనిపై కామ్పియాన్ ‘’The apothecaries have books of Gold ,whose leaves being opened ‘’.,are so light that they are subject to be shaken ,with the least breath –yet rightly handed ,they serve both ornament and use ‘’అని రెండు రకాల ప్రయోజనాలను పేర్కొన్నాడు .

కామ్పియాన్ రాసిన లలిత ,పారదర్శక లిరిక్స్ చాలా సున్నితమైనవే అయినా మనసుపై గొప్ప ప్రభావాన్ని చూపాయి .అతను అన్నట్లు కదిలించాయి కూడా ..అతని లిరిక్స్ లో ‘’the superfluous  of his deeper  studies’’ఉంటాయి .వాస్తవ కవిత్వాన్ని సరి అయిన మత భావాలతో జత చేసి చెప్పటం అతని ప్రత్యేకత .’’beauty since you so much desire ‘’లాంటివి గుర్తుండి పోయే మాటలు .కవిత్వం పై కామ్పియాన్ కు ఉన్న భావాలను సామ్యుల్ డేనియల్ తిరస్కరించి కవిత్వానికి’’ రైం’’(అంత్య ప్రాస )అవసరమే నన్నాడు .కామ్పియాన్ పెళ్లి చేసుకోలేదు పిల్లలూ లేరు .1-3-1620న చనిపోయాడు .ఆరోజే వెస్ట్ ఫ్లీట్  స్ట్రీట్ లో సెయిం ట్ డం స్టన్లో అంత్య క్రియలు చేశారు .15-2-1567న జన్మించిన కామ్పియాన్ యాభై మూడేళ్ళు మాత్రమె జీవించాడు .

Thomas Campion (12 Feb. 1567–1 Mar. 1620)

 

జంట కవులు – ఫ్రాన్సిస్ బీమాంట్ ,జాన్ ఫ్లేచేర్

‘’A perfect union of genius and friend ship ‘’అని పేరు తెచ్చుకొన్న ఫ్రాన్సిస్ బీమాంట్ 1584-1616కాలం వాడు .పన్నెండు ఏళ్ళ  వయసులో ఆక్స్ ఫర్డ్ లో చేరాదు అప్పటికే  అదిరిపోయే రెండు ట్రాజెడీలను రాసిన ఘనుడు .ఇవి మార్లో రాసిన ‘’టంబర్ లైన్ ‘’,షేక్స్ పియర్ రాసిన ‘’టైటాస్ ఆండ్రోనికస్ ‘’లకు అనుకరణలు .లా చదివి పది హేనేళ్ళ వయసుకే ‘’మిడిల్ టెంపుల్ ‘’లో మెంబర్ అయ్యాడు .కొద్దికాలం లో లండన్ నాటక రచయితల సంఘం లో చేరాడు .ఇందులో ఫ్లెచర్ ఒక భాగ స్వామి .ఫ్లెచర్ కు సృజన ఎక్కువ. దానికి ముడి సరుకు బీమాంట్ అందించే వాడు .బెన్ జాన్సన్ కూడా తాను రాసింది సరి చేయటానికి బీ మాంట్ కే ఇచ్చే వాడు .ఫ్లెచర్ తో కలిసి పదమూడు నాటకాలను రాశాడు బీ మాంట్.‘’మొదటి బీమాంట్ ఫ్లెచర్ ఫోలియో ‘’35నాటకాలతో1647లో విడుదల అయితే  1679లో 53తో విడుదల అయింది .బీమాంట్ రాసినవి చాలా సీరియస్ గా గొప్ప నీతి బద్ధం గా ఉంటాయి .జంట రచనలు చేస్సినా అందులో ‘’సింగులర్ బ్యూటీ అండ్ పవర్ ‘’ఉందని మెచ్చుకొంటారు .జంట కవనం ఈ ఇద్దరితోనే ప్రారంభమైందని చెప్ప వచ్చు .

 

Francis Beaumont.jpg

జాన్ ఫ్లెచర్

బీమాంట్ కంటే తొమ్మిదేళ్ళు ఎక్కువ కాలం జీవించిన జాన్ ఫ్లెచర్ 1579లో పుట్టి 1625లో మరణించాడు .అవిశ్రాంత నాటక రచయిత గా ఆకాలం లో పేరు పొందాడు .కోస్టల్ ప్రాంతం ‘’రై ‘’లో పుట్టాడు. కేంబ్రిడ్జి బెనేట్ కాలేజి లో చదివాడు .ఇరవైలలో లండన్ చేరాడు .స్పురద్రూపం ,మంచి పద్ధతుల తో అందరినీ ఆకర్షించాడు .పదహారు నాటకాలుస్వయం గా  రాశాడని  గుర్తింపు .బీమాంట్ తోకలిసి ఏడు లేక ఎనిమిది రాసి ఉంటాడు .థామస్ మిడిల్ట న్   తో కూడా జత కలిసి రాశాడు .షేక్స్ పియర్ కూడా వీరితో కలిసి ‘’టు నోబుల్ కిన్స్ మెన్ ‘’,కింగ్ హెన్రి ది యైత్’’నాటకాలు రాశాడు .’’ట్రాజీ కామెడి ‘’ రాయాలనే బల మైన కోరిక ఫ్లెచర్ కు ఉండేది .’ఆ కోరిక తీరకుండానే ’ప్లేగు ‘’వ్యాధి సోకి అర్ధంతరం గా నలభై ఆరో ఏట చనిపోయాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో చాసర్ కవి ప్రక్కనే సమాధి చేశారు .

నాటకాలు రాసినా, ఫ్లెచర్ కు  కవి గానే ఉండటం ఇష్టం .’’the touch is light and the tone lyrical ,the lines move with grace ,warmth and spontaneity .Although his range is not great he had a definite influence on his followers ‘’అని అతని కవితా వైభవాన్ని ఎస్టిమేట్ చేశారు .ఫ్లేచేర్ రాసిన ‘’ఎలిజీ’’లు లఘు కావ్యాలుగా నీతి బోధకాలుగా ఉండటంప్రత్యేకత –

‘’lay a garland on my hearse –of the dismal yew –maidens willow branches bear –say I died true ‘’

‘’My love was false ,but I was firm-from the hour birth –upon my buried body lie –lightly gentle earth ‘’

ఇలాంటి పంక్తులు ఫ్లెచర్ కవితల్లో కో కొల్లలు .ఇలాంటి తళుకు బెళుకులు అచ్చమైన బంగారం మెరుగుల్లా అని పించటమే ఈ’’తళుకు యుగ ‘’లక్షణం .షేక్స్ పియర్ అనుయాయి గా మంచి పేరు పొందాడు .ప్రేక్షకులు అర్ధం చేసుకో లేనంత వేగం గా అతని రచనలుంటాయి .అయినా షేక్స్ పియర్ రచనలు లాగా వీటికి కాలాతీత విలువలు లేక పోవటం తో మరచి పోయారు .ఇప్పటిదాకా ‘’రెలిజియన్ కవిత్వమే ‘’ఏఎ యుగాన్ని డామినేట్ చేసింది

John Fletcher (1).JPG  

సశేషం

శ్రీ  నృసింహ జయంతి(వైశాఖ శుద్ధ చతుర్దశి ) శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.