నాన్సెన్స్ సీరియళ్ళు ఆపండి

నేను కొద్దిగా ఇష్టపడే చానల్ మా చానల్న అందులో  చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టం గా చూస్తాను .దానికి ముందు వచ్చేవి మరీ అసహ్యం గా అసహనం గా అతిగా ,నీచ మనస్తత్వాలకు ప్రతిరూపాలుగా ఉంటున్నాయి .రాత్రి ఏడున్నరకు వచ్చే ”కాంచన గంగ ”తలాతోకాలేకుండా పరిగెత్తుతూనే ఉంది . అందులోఅత్తా కోడలు పాత్రలు స్త్రీ లు సిగ్గు పడేలా చేస్తున్నాయి వల్గారిటి పరాకాస్ట  గా ఉంది .కొదల్ని భర్తనూ చంపే ప్రయత్నాలే ఏ భాగం లో చూసినా .ఒళ్లంతా  నగలు దిగేసుకొని గ్లామర్ కు గ్రామర్ మిస్టేక్ లేకుండా సింగారించుకొని ఆ అత్తా కోడళ్ళు ఆడుతున్న నాటకం భీభత్సం గా ఉంటోంది  మొగుడు కాని  కాని మొగుడితో కోడల్ని కాపురం చేయమని అన్ని రకాల ఒత్తిళ్ళూ తెస్తుంది అత్త. అత్తకు సపోర్ట్ కొడుకు భార్య కోడలు.  వీరిద్దరి పాత్రల్నీ యెంత త్వరగా ముగిస్తే అంత మంచిది మొగుడు దు  కానికిరాయి  మొగుడు వచ్చి డబ్బుకోసం కక్కూర్తి పడి , ఎక్కడో ఒకమ్మాయిని రెప చేసి చంపి వచ్చి ఇక్కడ కిరాయి మొగుడుగా బతుకుతూతప్పించుకు తిరుగుతూ  ఆ ఇంటి ఒకే ఒక మనవరాలినీ అత్తా కోడళ్ళ ప్లాన్ తో చంపటానికి సిద్ధం .ఇదెమి దౌర్భాగ్యపు సీరియలో అర్ధం కావటం లేదు యెడ తెగని హింస  మనిషి  ప్రయత్నం కంటే దైవ ఘటన పెద్ద కోడల్ని కాపాడుతూ ఉంటుంది తాగుడుకు బానిస అయిన మరిదిని సన్మార్గం లోకి మార్చిన కోడలు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో అవమానాల్లో ,అపాయం లో క్షణ క్షణ భయం తో జీవించి మనల్ని హిమ్సిస్తోంది ”.ఇమ్మీడి యెట్లీ  స్టాప్ దిస్  నాన్సెన్స్ సీరియల్ ”

   రాత్రి ఎనిమిదింటికి వచ్చే ”అష్టా చమ్మా ”మరీ దారుణం .ప్రెమించుకొన్న వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోరు.  తెగ సాగదీస్తారు కాని అంగుళం కూడా కదా కదలదు వారిద్దరి మధ్యా ముద్దు మురిపాలు జరగవు.  భరించలేని తలకాయ నెప్పి మనకు .ఇన్దులొ స్వప్న పాత్ర ఎప్పుడూ క్రూరంగా ఆలోచిస్తూ తను వలచిన వాడికి తన మీద ప్రేమ లేక పోయినా అన్ని రకాల వెకిలి చేష్టలూ చేస్తూ ,తండ్రిగా భావింప బడే వాడినితల్లిగా భావించే ఆవిదనూ  ,తను ప్రేమించిన వాడు వలచిన దాన్నీ,అడ్డం   వచ్చిన  ఆ అమ్మాయి కుటుంబాన్ని కిరాయి రౌడీలతో చంపే ప్లాను సాగుతూనే ఉంటుంది . అంతం లేదు ఇంతలో తగుదునమ్మా అని ”గీతాంజలి ”ప్రవేశం ఆ కర్కోటకు రాలికి వత్తాసు .ప్రెమికుడి  తల్లి నిమిషానికో మాట .యెటో  తేల్చుకోలేని ఇంటి పెద్దాయన  మాటలు  మర్చి పోయి,గుమ్మిడి కాయలో వీల్ కుర్చీకి పరిమితమైన న ఆయన భార్య అవిడ కు  తలమీద  ఏదో దెబ్బతగిలి మాటలు వచ్చి అసలు నిజం బయట పెట్టె దెప్పుడో ఈజీడిపాకం ఆగి పోయే దెప్పుడో తెలీదు అ సహజమైన సీరియళ్ళను మా చానల్ ప్రసారం చేస్తున్నందుకు అభిశంశించాలి .యెప్పుడా అష్టా చెమ్మాఆట  ఆగిపోతున్దిరా బగ వంతుడా   అని వేయి కళ్ళతో చూసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు.  ట్రాష్ ఇక ఆపెయ్యండ హే ..
  కాని రాత్రి ఎనిమిదిన్నరకు వస్తున్న” శశి రేఖా పరిణయం ” బాగుంటోంది ” శశి బి టెక్”వేషం వేస్తున్న అమ్మాయి హావ భావాలతో మహా ముచ్చటగా ఉంది .బుల్లి తెరకు ఒక కొత్త వయ్యారాన్ని సింగారాన్ని నటనను చిలిపితనాన్ని తెచ్చింది ఆ పిల్ల పేరేమిటో నాకు తెలియదు కాని ఆ నటన అద్వితీయం .నాకు తెలిసి నంత వరకు నాటక ,సినీ టివి రంగాలలో ఇంతకూ ముందు నటించిన ఏ నటీ మణులూ ఇంత    బాగా చేయలేదని ధంకా బాజా ఇంచి చెప్పగలను అనితర  సాధ్యమైన నటనను హావభావాలను నవ రసాలను ఒలికిస్తోంది ఆ పిల్ల  ”అమ్మానీ నటనకు జొహార్.” .బుల్లి తేర బంగారానివి నువ్వు .నీ టేలెంట్ ఎవరు కనీ పెట్టి ఈ సీరియల్ లో నీతో చేయిస్తున్నారో వారి అన్వేషణకు అభినందనలు ”కీప్ ఇట్  అప్ తల్లీ” ఈ సీరియల్ లో హీరో” అభి”కళ్ళ జోడుతో ఉన్నా బానే చేస్తున్నాడు అతని తల్లి పాత్ర చేసే ఆమె సీనియర్ నటియే  .”మేకప్ చెడి పోతుందేమో ననే భయం తో జాగ్రత్తత తో పాత్ర  ను చేస్తున్నట్లని పిస్తోంది   బల రామయ్య విగ్రహం పుస్టి యే  .దబ్బింగ్ జానకి నాయనమ్మ పా త్రలో మేకప్ ఎక్కువగా ఉన్నా బానే చేస్తోందిఆమ్మను మనవ రాలు ”బాలా ”అని పిలవటం సరదాగా ఉంది మి గిలిన పాత్రల గురించి పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు .ఉన్నంత  లో కాస్త రిలీఫ్ ఇస్తున్న సీరియల్ .శశి రేఖా పరిణయం
   ఏ సీరియల్ లోనైనా పాత సినిమా పాటలను సందర్భానికి తగినట్లు పెట్టి పబ్బం గడుపు కొంటున్నారు
 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-  15-5-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

2 Responses to నాన్సెన్స్ సీరియళ్ళు ఆపండి

  1. SIVARAMAPRASAD KAPPAGANTU's avatar SIVARAMAPRASAD KAPPAGANTU says:

    ఆ దిక్కుమాలిన సీరియళ్ళు చూడటం మానేయ్యండి సార్. మీరు, మీ చుట్టుపక్కలవాళ్ళు ఈ చండాలపు సీరియళ్ళు ఎందుకు చూడటం మానేశారో ఆ చానెల్ వాడి.కి “తెలుగులో’ ఉత్తరం వ్రాయండి. బుధ్ధి అనేది ఉంటే మారతాడు లేదంటే వాడి గొయ్యి వాడే ఇంకా బాగా లోతుగా తీసుకోవటం మానడు.

    ఆపైన ఆ సీరియళ్ళు స్పాన్సర్ చేస్తున్న కంపెనీలకు మీ భావాలు చెప్పండి. ఆ సీరియళ్ళ వల్ల ఆ స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఉత్పాదనలు కొనాలంటే అసహ్యం కలుగుతున్నది అని వాళ్ళకి మీ అభిప్రాయం తెలియచెప్పండి.

    Like

  2. శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU's avatar శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU says:

    ఆ దిక్కుమాలిన సీరియళ్ళు చూడటం మానేయ్యండి సార్. మీరు మీ చుట్టుపక్కలవాళ్ళు ఈ చండాలపు సీరియళ్ళు ఎందుకు చూడటం మానేశారో ఆ చానెల్ వాడికి “తెలుగులో’ ఉత్తరం వ్రాయండి. బుధ్ధి అనేది ఉంటే మారతాడు లేదంటే వాడి గొయ్యి వాడే ఇంకా బాగా లోతుగా తీసుకోవటం మానడు. ఆపైన ఆ సీరియళ్ళు స్పాన్సర్ చేస్తున్న కంపెనీలకు మీ భావాలు చెప్పండి. ఆ సీరియళ్ళ వల్ల ఆ స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఉత్పాదనలు కొనాలంటే అసహ్యం కలుగుతున్నది అని వాళ్ళకి మీ అభిప్రాయం తెలియచెప్పండి

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.