పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16
పునర్వైభవం తర్వాత
మరణం లో జీవిస్తూ మృత్యు కవితలు రాస్తూ తార్కిక విశ్లేషణ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసిన జాన్ డోన్నె అనుయాయులు పది హేడవ శతాబ్దిలో ఆది భౌతికత వైపే మొగ్గి ,విరుద్ధతలను ప్రకటిస్తూ గడిపారు .వీళ్ళది ‘’దొన్నె స్కూల్ ‘’అన్నారు .అభిరుచి ,టెక్నిక్ లో వీరు భిన్నమైన మార్గాలు తొక్కారు .గొప్ప ఊహా పిపాసులని పించు కొన్నారు .దీనితో కవిత్వానికి ఒక కొత్త భాష ,నూతనత్వం ,చిక్కదనం ,శైలి వాక్య నిర్మాణం వచ్చి మనసులకు ఆహ్లాదం కలిగింది .ఇందులో కొందరు’’ డోన్నె’’ కు ‘’ డ్రైడేన్ ‘’కు వారధి లా నిలిచారు .వారే జార్జి హెర్బర్ట్ రిచార్డ్ క్రాషా ,హెన్రి వాగన్ ,థామస్ ట్రాహేర్న్ .
హోలీ -జార్జి హెర్బర్ట్
జార్జి హెర్బర్ట్ 1593లో వేల్స్ లోని కాజిల్ ఆఫ్ మాంట్ గోమారీలో ,జన్మించాడు .తండ్రికున్న పది మంది సంతానం లో ఒకడు .అన్న హెర్బర్ట్ గొప్ప చరిత్రకారుడు ,వేదాంతి ,డిప్లమాట్ అయ్యాడు .హెర్బర్ట్ ఆక్స్ ఫర్డ్ లో చేరగానే కుటుంబం లండన్ కు వచ్చింది పన్నెండవ ఏట జార్జి వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేరాడు .పదిహేనవ ఏట కేంబ్రిడ్జి లో ‘’కింగ్స్ స్కాలర్ ‘’గా చేరాడు .ఇరవై వ ఏట ట్రినిటి లో ‘’పబ్లిక్ ఆరేటర్’’అయి ఎనిమిదేళ్ళు పని చేశాడు .అన్నలా సాహస జీవి కావాలని తపన పడ్డాడు .అతని మనసు, బుద్ధి దేవుడిపైనే ఉండేవి .ఇలా చిన్నతనం నుంచి ఉంది .తల్లికి రాసిన ఉత్తరం లో తాను దేవుని మనిషి నని అలాగే జీవిస్తానని తెలిపాడు .తల్లి స్నేహితుడు జాన్ డోన్నె ఇతన్ని కవిత్వం వైపే కాక చర్చి వైపూ తిప్పాడు .32వ ఏట అధికారాలు పొంది ,36వ ఏట ‘’రెక్టార్’’అయ్యాడు .జెన్ డాన్వార్ ను పెళ్లి చేసుకొన్నాడు .చర్చిలను నిర్మించటం అభివృద్ధి చేయటం లో కాలం గడిపాడు .మైళ్ళకొద్దీ నడిచి వెళ్లి సాలిస్ బరి లో చర్చి లో సంగీతం తో మత బోధ చెస్తో రైతులను కూడా ఆకర్షించాడు .కవిగా ,బోధకుడిగా సంతృప్తి పొందాడు .కాని ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు .
హేర్బర్ట్ కు క్షయ వ్యాధి ఎప్పుడు సోకిందో తెలియదుకాని 40వ ఏటనే పొట్టన పెట్టుకోంది .చావు సంగతి ముందే గ్రహించాడు. తగిన ఏర్పాట్లు చేసు కొన్నాడు .కామ్పియాన్ లాగా జార్జి సంగీతజ్ఞుడు కవి కూడా .తన పాటలను తానే సంగీతం కూర్చుకొని వీణ (lute)వాయిస్తూ పాడేవాడు .తాను ఒక దేవదూతను అనే భావం తో స్వర్గం లో గానం చేస్తున్న అను భూతితో పాడి శ్రోతలకూ ఆ అనుభవాన్ని కల్గిన్చేవాడు .అతని తన్మయత్వానికి ‘’హోలీ జార్జి హెర్బర్ట్ ‘’అనే వారు .దయ సాను భూతి ,మంచితనం కమ్మదనం హెర్బర్ట్ సొత్తు .డోన్నె లాగా మెటా ఫిజికల్ అయినా అతని కంటే సరళ స్వభావి .డోన్నె కున్న తీవ్రత హింస ఇతనిలో లేవు . శ్లేష ను చక్కగా వొదిగేట్లు రచన చేసే వాడు .చర్చి అతనికి దేవాలయం మాత్రమే కాదు రూపకాలన్కారాలకు వేదిక కూడా .రూపకం మీదే కవితా సౌధం నిర్మించాడు .చర్చి అంటే ఆధ్యాత్మిక భావాలకు ఆలవాలం అనే నమ్మకం కలిగించాడు .’’చర్చి నేల ,నమ్మకానికి పునాది .శిఖరం హృదయం .కట్టిన రాళ్ళు రప్పా వినయానికి ,వోర్మికి ప్రతీకలు .వీటిని కదలకుండా బంధించే సిమెంట్ లేక సున్నం ప్రేమకు చిహ్నం .చర్చిద్వారపు తాళం చెవి చేతుల్లో దాచుకొన్న పాపాలను విడిపించేది ‘’అని చాలా చమత్కారం గా రూపకాలలతో బోధనా ను పరి పుష్టి చేసేవాడు హెర్బర్ట్ .దేవుడికోసమే నటిస్తున్నాను భూమి మీద అనే వాడు .’’ Jesu!I- Ease- you ‘’ అని మన ‘’త్వమేవాహం ‘’ ను ఒంట బట్టిన్చుకోన్నట్లు అనే వాడు .అర్ధ వంతమైన అనేక ద్విపదలను రాశాడు .మచ్చుకొకటి .దీన్ని అనాగ్రాం (శబ్ద వ్యతిక్రమం )అంటారు .మన వాళ్ళు రాసిన బంధ కవిత్వం వంటిది .
ANA[MARY]GRAM
[ ARMY]
కవిత్వం లో సాంకేతికత ను జోడించి చెప్పాడన్నమాట .చాలా సరళం గా ఏంతో ప్రత్యేకం గా ఉంటాయి ఇవి .హెర్బర్ట్ రాసిన అమర గీతం –‘’o Almighty Love! Man is one world and hath –another to attend him ‘’.
‘’సెవెన్ టిప్స్ ఆఫ్ యామ్బిగ్యుటి ‘ హెర్బర్ట్ సృజనకు పరాకాష్ట గా భావిస్తారు .అతని కవిత్వాన్నిచదివి అర్ధం చేసుకోవటం కష్టమే . అనేక రూపకాలు పదచిత్రాలు సింబాలిజం తో ఒక పట్టాన కొరుకుడు పడేది కాదు .ఆ భాష ఈ ప్రపంచానికి చెందింది గా అని పించదు కూడా .డోన్నె తన బాధను అంతటిని ‘’డ్రమటైజ్ ‘’ చేసి చెబితే హెర్బర్ట్ తన బాధలను దిగ మింగుకొని దేవుడితో మాట్లాడాడు .డోన్నె లాగా తనను ‘’job ‘’గా వర్ణించు కోలేదు .వ్యతిరేకించకుండా అసమ్మతి మాత్రం తెలియ జేశాడు .పాపానికి ,ముక్తికి మధ్య సన్నని విభజన రేఖ ను చూశాడు .ప్రపంచ అసహాయ స్తితికీ స్వర్గ సుఖాలకూ అంతే.హెర్బర్ట్ ను గురించి చెప్పాలంటే ‘’humility ,orderliness ,serenity grace ‘’తో వికసించిన సంపూర్ణ కవి అనవచ్చు .అసాధారణమైన ప్రత్యెక వ్యక్తిత్వం ఉన్న వాడు .మానసిక చాంచల్యం లేని వాడు .క్రమ శిక్షణకు మారు పేరు .’’serenity came after internal conflict and a feeling of inadequacy –and underneath the grace ,the wit ,and whimsicality ,there is an unshakable fervor as reasonable as it is religious .Quiet ,alternately courtly and colloquial this is a poetry which begins in wonder and ends in certainty ‘’ అని హెర్బర్ట్ కవిత్వాన్ని అంచనా వేశారు .’’ఎ సోల్ కంప్రైసేడ్ అఫ్ హర్మోనీస్ ‘’అని కీర్తించారు .’’లెట్ ఆల్ దివరల్డ్ ఇన్ ఎవిరి కార్నర్ సింగ్ ‘’అన్న కవిత బహుళ ప్రచారమైంది .’’ఈస్టర్ వింగ్స్ ‘’కవిత చదవటానికే కాదు ఆకృతికి కూడా అదిరెట్లు ఉంటుంది .అత్యధిక నైపుణ్యం ,శైలి ఉన్న బ్రిరీష్ ఆధ్యాత్మిక కవుల్లో అగ్రేసరుడు హెర్బర్ట్ .
హేర్బర్ట్ ముప్ఫై తొమ్మిదేళ్ళు జీవించి 1-3-1633 న దైవ సన్నిధికి చేరుకొన్నాడు .’’
![]()
![]()
![]()
సశేషం
శ్రీ కూర్మ ,బుద్ధ ,అన్నమాచార్య ,రాదా కృష్ణ జయంతి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

