పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17

రిచార్డ్ క్రాషా

ప్రఖ్యాత ప్యూరిటన్ బోధకుడు విలియం క్రాషా కు రిచర్డ్ క్రాషా1612లో పుట్టాడు .మత బోధన మీదే అభిమానం .రోమన్ చర్చి పై మనసు మళ్ళింది .’’యాంటి పాపిస్ట్’’ అయిన తండ్రికి ఇది వ్యతిరేకం .లండన్ లో పుట్టి పెం బరాక్ లో ,చార్టర్ టన్ లలో చదివి ,మత ప్రచారకుల మధ్యనే నడి వయసు గడిపాడు .అబ్రహాం కౌలీ కవికి దగ్గరయ్యాడు .కౌలీ కవిత్వం లో మెళకువలు నేర్పటమే కాక ఆర్ధిక సాయమూ చేసేవాడు .ఇంగ్లాండ్ అంతర్యుద్ధ సమయం లో ఆర్ధికం గా పేదరికం  అనుభ వించలేక పారిస్ చేరాడు .కౌలీయే రిచార్డ్ ను లండన్ తీసుకొచ్చాడు .ప్రవాసం లో ఉన్న రాణి హెన్రి ఎట్టా మేరియా దృష్టికి క్రాషా విషయాన్ని తీసుకు వెళ్ళాడు .ఆ ఏడాదే క్రాషామతం మారాడు రోమ్ కు   చెందిన కార్డినల్ పలాట్తో.కు ప్రైవేట్ సెక్రటరి అయ్యాడు .తరువాత లోరాటో లోని హోలీ హౌస్ కేధడ్రిల్ కు’’ సబ్ కానన్ ‘’గా పదివి పొందాడు .రాజకీయం గా ,వ్యక్తీ గతం గా కుట్రల్లో కూరుకు పోయాడు .36వ ఏట అకస్మాత్తుగా16-8- 1649లోక్రాషా జీవితం నుంఛి కనుమరుగయ్యాడు  .

‘’స్టెప్స్ టు ది టెంపుల్’’అనే క్రాషాపుస్తకం అతని ప్రవాస కాలం లోనే వెలువడింది .ఇది హెర్బర్ట్ రాసిన ‘’ది టెంపుల్ ‘’ను పోలి ఉందన్నారు కాని పూర్తిగా తేడాగానే ఉంది .హెర్బర్ట్ స్తిమితం గా ఉన్న చోట క్రాషా విజ్రుమ్భించాడు .హెర్బర్ట్ దిపూర్తీ ఇంగ్లీష్ ధోరణి అయితే ,క్రాషాదిఇటాలియన్ స్పానిష్ ధోరణి లో ఉంటుంది .మత ఉత్సవాలను హెర్బర్ట్ ప్రోత్సహిస్తే  క్రాషాఅందులోనూ నాటకీయతను ప్రవేశ పెట్టి కొత్తదనం తెచ్చాడు .నగిషీలు చెక్కాడు అలంకారం చేశాడు .క్రాషాకవిత్వం ‘’so ornate ,so overembellishedthat it is sme times hard tosee the poetry because of the words ‘.His images are alternately gorgeous and grotesque ‘’అంటారు మేరీ మాగ్దలీన్ సజీవ శిల్పాన్ని కవితలో మన ముందుంచాడు .’’two walking baths two weeping motions –portable and compendious oceans ‘’.కల్పనా సృజనా జమిలిగా ప్రవహిస్తాయి నలభై రెండు స్టాంజాలలో  ఆమె అద్వితీయ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ అది సహజ లావణ్యం అని ,అది ఆమెకే స్వంతం అని రాస్తాడు .

‘’సెయింట్ టేరస’’పై చెప్పిన కవిత క్రాషా కవితల్లో తల మానికం గా భావిస్తారు .ప్రతీకలను వాడటం లో నిష్ణాతుడు .భాషా గౌరవం అనే ఉక్కు ఛట్రంలో బిగిసి ఊపిరాడక కొట్టుకొన్న కవులకు వాటిని ‘’క్రాష్ ‘’చేసిన  క్రాషా ఆదర్శ ప్రాయుడైనాడు .క్రాషా రచనలను మొదటి సారి విలియం టంబుల్ ఒక పుస్తకం గా ముద్రించాడు .క్రాషా రాసిన ‘’బుల్లా’’అంటే నీటి బుడగ కవిత ఇలియట్ కార్టర్ కు  ప్రేరణ కలిగించింది . ‘’లో దిఫుల్ ఫైనల్ సాక్రి ఫైస్ ‘’కు జేరాల్ద్ ఫింజి సంగీతాన్ని సమకూర్చాడు .లాటిన్ కవి ‘’కాతలాస్ ‘’రాసిన కవితను జార్జి ‘’కం అండ్ లెట్ అజ్ లివ్’’గా ఇంగ్గ్లీష్ లో రాశాడు దీనికి జూనియర్ సామ్యుల్ వెబర్ ఇంగ్లీష్ లో సంగీత చేశాడు .

 

అబ్రహాం కౌలీ

లండన్ లో 1618 లో సంపన్నుడైన పుస్తక విక్రేత ,పుస్తకాల షాపు యజమాని కి జన్మించాడు .మొదటి నుంచి చాలా జాగ్రత్త గా ఉండేవాడు .పదేళ్ళకే ‘’పైరమాస్ అండ్ తిస్బే ‘’అనే పురాణ శృంగార కవిత  రాశాడు .రెండేళ్ళ తర్వాతా మరో ఎపిక్ ‘’కాన్స్తాన్శియా అండ్ ఫైలేతాస్ ‘’తయారు చేశాడు .ఈ రెండు కవితలు ‘’పోయేటికల్ బ్లాసంస్ ‘’లో ప్రచురితాలు .అప్పటికి ఈ బుడ్డాడి వయసు పదిహేను .ఇరవైకి  మరో రెండు పుస్తకాలు వదిలాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేరాడు .తర్వాతా ట్రినిటీకాలేజి లో చేరి రాయలిస్ట్ దృక్పధం పై విపరీతం గా మాట్లాడటం వలన కేంబ్రిడ్జి నుంచి బహిష్కరించారు .ఆక్స్ ఫర్డ్ చేరాడు .స్టువార్ట్ రాజులు అండగా నిలిచారు .28కి పారిస్ లో ఉన్నాడు .ఈ ప్రవాసం లో హెన్రి ఎట్టా మేరియా కు సెక్రెటరి అయ్యాడు .పన్నెండేళ్ళు డిప్లమాటిక్ ఏజెంట్ గా వ్యవహరించాడు .రాణీకి చార్లెస్ కు మధ్య రహస్య రాయ బారం నడిపాడు .ముప్ఫై ఏడేళ్లకు ఇంగ్లాండ్ కు రాజు గారి వేగుగా  (స్పై) చేరాడు .క్రామ్వేల్ కు దొరికి పోయి జైలు పాలయ్యాడు .తిమ్మిని బమ్మిని చేసి బైలు పై విడుదలయ్యాడు ..రేస్తోరేషన్ కౌలీ పదవిని నిలిపింది .ఆక్స్ ఫర్డ్ చేరి మెడిసిన్ చదివాడు .కొద్ది పాటి ఆదాయాన్నిచ్చే ఒక చిన్న ఎస్టేట్ ను ఇచ్చారు .ఓల్డ్ కోర్ట్ లో హాయిగా జీవించాడు .’’that solitude which from his very childhood he had always passionately desired ‘’చిన్నప్పటి నుంచి కలలు కన్న ఒంటరి హాయైన జీవితం లభించి సంతృప్తి చెందాడన్న మాట .49వ ఏట 28-7-1667లో ఇహలోకం చాలించాడు .వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో అతని అంత్యక్రియలు నిర్వహించారు .కౌలీ బతికి ఉండగా పెద్దగా ఏ సాయం చేయని రెండవ చార్లెస్ రాజు ‘’cowley has not left behind him a better man in England ‘’అని మొసలి కన్నీరు కార్చాడు .

కౌలీ ప్రాభవం రాకెట్ లాగా అకస్మాత్తుగా పైకి ఎగిరి  అలాగే జారిపడింది . ఆ తరాన్ని ప్రభావితం చేసిన కవిగా కౌలీ గుర్తుండి పోతాడు .ఇవాళ అతన్ని పట్టించుకొనే వారుతక్కువే .’’దిఎనీద్’’అనే అతని రచన బైబిల్ లోని డేవిడ్ కధయే .’’ది దేవిదీస్ ‘’ కూడా నిజానికి దూరం గా ఉంటుంది .పిండార్స్ ముతకగా ఉంటుంది .కవిత్వాన్ని మొదలు పెట్టటం ముగించటం లో కౌలీ గొప్పప్రజ్న  చూపాడు .అతని బౌద్ద్ధిక తార్కిక జ్ఞానాన్ని కళ్ళెం వేసుకొని అదుపు లో పెట్టుకొని రాశాడు .చిన్న చిన్న కవితల్లో అసాదారణ ప్రతిభ చూపాడు .’’beauty thou wild fantastic ape –who dostin every country change thy shape ‘’మచ్చుకి ఒక ఉదాహరణ .’’Cowley’s paraphrases from Anacreon the Greek forerunner of Omar Khayyam ‘’అని అరువు సొమ్ము బరువు చేటుగా చేశాడని అంటారు .అతని వ్యాసాలను ఇప్పటికీ తరచుగా ముద్రించి ఆదరిస్తూనే ఉన్నారు .

  

సశేషం

బుద్ధ ,కూర్మ ,అన్నమయ్య ,రాదా కృష్ణ ,చిత్రగుప్త జయంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.