పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18
టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్
దక్షిణ వేల్సు లో సిల్యూరులు అనే తెగ కు చెందినా వాడవటం వలన హెన్రి వాఘన్ ను ‘’సిల్యూరిస్ట్’’అన్నారు .పురాతన తెగకు చెందినా వాడే ..ఆగిన్ కోర్ట్ లో వాళ్లకు ప్రాతినిధ్యం ఉండేది .తండ్రి సర్ థామస్ వాగ్హన్ ను మూడవ రిచర్డ్ రాజు చాపించడని షేక్స్పియర్ నాటకం తెలియ జేస్తోంది .హెన్రి థామస్ లు కవలలు,17-4-1621లో జననం ఇంటి వద్దే ప్రాధమిక విద్య నేర్చి ఇద్దరూ ఆక్స్ ఫర్డ్ లోని జేసూస్ కాలేజి లో చేరారు థామస్ బి.యే. పాసై ఆల్కమిస్ట్ గా మాజిక్ డీలర్ గా అయ్యాడు .డిగ్రీ కాకుండానే హెన్రి లండన్ వెళ్లి మెడిసిన్ చదివి ఇరవై మూడో ఏట డాక్టర్ అయ్యాడు .బ్రిటన్ అంతర్యుద్ధం అతని వ్రుత్తి పై ప్రభావంకలిగించింది .రాజు గారి రౌటేన్ హీత్ యుద్ధ రంగం లో వెల్ష్ అంగ రాక్షక ఆశ్విక దళం లో ఒకడైనాడు .రాయలిస్ట్ గా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు .రెండేళ్ళ తర్వాత రిటైర్ అయి, వైద్య సేవ చేస్తూ వ్యాధిగ్రస్తుల పాలిటి ఆపద్బాన్ధవుడై ,కవిత్వాన్ని కూడా రాస్తూ గడిపాడు .బ్రేక్ నాక్ లో అర్ధ శతాబ్దం వైద్య సేవలో గడిపాడు .తర్వాత స్వంత ఊరు ‘’న్యూటన్ బై అస్క్ ‘’లో 7323-4-1695న చని పోయాడు .
వాఘన్ మతం మార్చుకొని బతకాల్సి వచ్చింది .సివిల్ వార్ ఫలితాల వైపరీత్యం వలన ,జబ్బు పడటంవల్ల అన్న చావు ,స్నేహితుల మరణాల తో కుంగి పోయాడు . ప్రపంచం లో మానవ దుఖాలను చూసి చలించాడు .ఇవన్నీ ‘’సైలెంట్ సింటిలన్స్’’రెండవ భాగం లో ప్రతి ఫలించాయి .24లో మొదటి భాగం వచ్చింది .’’పోయెమ్స్ ‘’లో ఎలిజబెత్ యుగాంతర ధోరణి కనీ పిస్తుంది .వాగ్హన్ ,హెర్బర్ట్ ల మధ్య పోలిక ఉందని అంటారు కాని భేదమే ఎక్కువ కనీ పిస్తుంది .హెర్బర్ట్ వాడిన అలంకారాలు చర్చి సాంప్రదాయం లో ఉంటాయి .వాఘన్ వి ప్రక్రుతి పరం గా ఉంటాయి .పరిశీలన తో కంటే ప్రేరణ తో వాగ్హన్ కవిత్వం రాశాడు .హీర్బ్బర్ట్ ఇమేజెస్ సాంద్రం గా గా ఉంటె వాగ్హన్ వాటిని పలచన చేస్తాడు .మేధావి కవి గా కంటే భావోద్రేకం ఉన్న కవి గా గుర్తింపు పొందాడు .ప్రక్రుతి ప్రేమికుడు మాత్రమే కాదు సృష్టి కర్త అయిన దేవుడికీ దగ్గరయ్యాడు .’’vaughan was with man’s love of God ,he was also convinced of God;s need of man , a love beyond logic ,an essential mysticism which the intellect can never explain ‘’.ప్రకృతిని భౌతికాతీత ద్రుష్టి తో చూశాడు .అతని కవిత్వాన్ని ఆస్వాదిద్దాం .
‘’there is in God some say –a deep but dazzling darkness ,as men here –say it is late and dusky ,because they –see not all clear .-of for that night where I in Him –might live invisible and dim ‘’
సెక్యులర్ భావాలు కొన్ని అతనిలో కనిపిస్తాయి .వీటిని తరువాతి తరం కవులు ఆదర్శం గా తీసుకొన్నారు .తన కాలం కవుల కంటే భిన్నం గా రాశాడు .సమాజ దీన స్తితికి జాలి పడ్డాడు .దేవుడిని ,ప్రకృతిని ,స్వీయ అనుభవాలను రంగ రించి కవితలు రాసి అందరికంటే భిన్నత్వం చూపాడు .అతని కవిత్వం లో అ కాలానికంటే ఆధునిక భావాలు ఉండటం ప్రత్యేకత .’’Vaughan is recognized as another example of a poet who can write both graceful and effective prose .he influenced the work of such poets as words worth ,Tennyson and Siegfried Sasson .అమెరికా సైన్స్ ఫిక్షన్ రచయిత ‘’ఫిలిప్ కే డిక్ ‘’కూడా వాగ్హన్ ప్రభావం తన మీద ఉందని చెప్పాడు .
వర్డ్స్ వర్త్ కు ప్రేరణ -ధామస్ ట్రహెర్నే
1636-37లో పుట్టి 27-9-2674లో చనిపోయిన’ ధామస్ ట్రహేర్నే’’ గురించి వివరాలు సరిగ్గాలేవు . వెల్ష్ లో హియర్ ఫోర్డ్ షూ మేకర్ కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో’’ బేసి నోస్ కాలేజిలో’’ చేరాడు .1657లో డిగ్రీ పొందాడు .క్రేడేన్ హిల్ లో ఒక ‘’పార్సనేజ్ ‘’గా పని చేశాడు .పదేళ్ళ తర్వాత సర్ ఓర్లాండో బ్రిడ్జ్ మాన్ కు ‘’చాప్లిన్ ‘’అయ్యాడు .ఓర్లాండో రాజ ముద్రికలను భద్ర పరచే ఉద్యోగి .అతనితో లండన్ వెళ్లి అతనితో తిరిగొచ్చాడు .అతనితోనే జీవించాడు .అతనితోనే ట్ర హేర్నేర్నే47వయసులో మరణించాడు .
విడవ కుండా రాసినా ధామస్ రచనలలో ఒక్క పుస్తకమే ‘’రోమన్ ఫోర్జేరీస్’’ అతని జీవితకాలం లో అచ్చయింది .ఆ తర్వాత రెండు వందల ఏళ్ళ దాకా అతని ఏ కవితా ముద్రణ భాగ్యం పొంద లేదు .ఆధునికులు వెతికి తీసి అతని కవిత్వపు విలువ ను నిగ్గు తేల్చారు .అతని వారసులకూ ఏమీ పట్ట లేదు . రెండు శతాబ్దాల తర్వాత ఒక బుక్ స్టాల్ లో వ్రాత ప్రతులు దొరికాయి .వాటిని కొన్ని షిల్లింగులు షాపు వాడికి చెల్లించి ఒక విద్వాంసుడు ‘’అలేక్సాండర్ బలూచ్ గ్రోసార్ట్ ‘’దక్కించుకొన్నాడు .వాటిని వాగ్హన్ కవి అముద్రిత కవితలను కొన్నాడు. పరిశోధకులు గ్రోసార్ట్ పొరపాటు పడ్డాడని నిర్ధారించి అవి ట్రాహేర్నే వే నని తేల్చి ,ముద్రించారు .
చర్చ ఆఫ్ ఇంగ్లాండ్ లో మినిస్టర్ గా ఉన్న ట్రాహేర్నే బగ వంతునిపై అచంచల విశ్వాసం ,విధేయత అణకువ ఉన్న వాడు .నిత్య సంఘటనలను కూడా దేవుని లీల గా భావించి తన్మయం చెందేవాడు .పసి పిల్ల వాడిలాగా ప్రపంచాన్ని చూసే వాడు. ప్రతిదీ ఆశ్చర్యమే ప్రతిదీ దేవుని మహత్తే ..గొప్ప జాగ్రుత స్థితి ,పసి పిల్లాడి స్వచ్చ మనస్తత్వం అతికి ఉండటమే కాదు అది కవిత్వం లో ప్రతి ఫలించింది కూడా .’’for him the mere act of wandering is wonderful ‘’ అని పిస్తుంది .’’Traherne;s singular verses are to use the title that headed his un published volume ‘’poems of felicity ‘’మెటాఫిజికల్ కవి గానే గుర్తింపు పొందాడు .అతని కవిత్వం లో ‘’there is a frequent discussion man;s almost symbolic relationship with nature as well as frequent use of literal setting that is an attempt faithfully re producing a sense of expression from a given movement a technique later used by William Words Worth .’’ఇలా ప్రక్రుతి కవి వర్డ్స్ వర్త్ ను ప్రభావితం చేసిన కవిగా చరిత్ర స్థాపించాడు .
ఆంగ్లికనిజం లో సెయింట్ గా గుర్తింపు పొందాడు .అమెరికా లోని ఎపిస్కోపల్ చర్చి ట్రాహర్నే మరణ దినాన్ని ‘’ట్రాహేర్నే ఫీస్ట్ డే ‘’గా గౌరవం తో నిర్వహిస్తారు .
![]()
సశేషం
దేవర్షి నారద మహర్షి జయంతి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-14-ఉయ్యూరు

