పూర్వాంగ్ల ముచ్చట్లు -25
డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్
‘’మార్గ రేట్ లూకాస్ ఎంత రొమాంటిక్ లేడీ యో అంత రొమాంటిక్ గా రాసింది ‘’అన్నాడు సామ్యుల్ పెపీస్ .ఈమెతో బాటు దీటుగా రాసిన మరి ఇద్దరు ఆఫ్రా బెన్ ,అన్నే ఫించ్ అనే స్త్రీ కవులు .మార్గరెట్ లూకాస్ 1623లో లో బాగా పేరున్న కుటుంబం లో పుట్టింది .సోదరులు సాహసులైతే సోదరిలు పధ్ధతి ఉన్నవారు .కాని మార్గ రేట్ కు మాత్రం రోమాన్స్ వంటిన పుట్టిన విద్య .నడవటం నేర్చిన నాటి నుండే ఇందులో దిగింది .బ్రిటన్ అంతర్యుద్ధం లో వీరి కుటుంబాన్ని ప్రవాసానికి పంపారు. లూకాస్ హేన్రిట్టా మేరియా కు చెలికత్తె గా చేరింది .యాభై ఏళ్ళ న్యూ కాజిల్ డ్యూక్ ఈమెను చూడగానే ప్రేమించి పెళ్ళాడాడు .రాజుతో బాటు తాత్కాలికం గా దూరమైనా మళ్ళీ లండన్ చేరారు .రేస్తోరేషన్ తర్వాత భర్తను డ్యూక్ ను చేశాడు ఈమె డచేస్ అయింది .ఖరీదైన దుస్తులు ధరించి అందం గా అలంకరించుకోనేది .ఏ ఉత్సవం లో పాల్గొన్నా అందరూ తనకోసం ఎదురు చూడాలని ఆలస్యం గా వచ్చేది .అరడజన్ స్త్రీలు ఆమె కారేజ్ ను లాక్కోచ్చేవారు అంత వైభవం ఒలక బోసింది .రాయల్ సోసైటీలోకి దురుసుగా ప్రవేశించేది .దేస్కార్టేస్ హాబ్స్ మొదలైన ఫిలాస ఫర్ ల తో తనకున్న విభేదాలను బహిర్గతం చేసేది .హాబ్స్ ‘’ఏ నీతి పుస్తకం లోను లేనంత నీతి మార్గరెట్ దగ్గర ఉంది ‘’అన్నాడు .ఇంతటి వైభవం గా జీవించిన ఆమె యాభై వ ఏట 1673లో మరణించింది .సైన్స్ ఫిలాసఫీ లను అలవోకగా రాసింది .’’అబ్సర్వేషనన్స్ అపాన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలాసఫీ ,దిస్క్రిప్షణ్ ఆఫ్ ఏ న్యు వరల్డ్ ‘’అనే సైన్స్ ఫిక్షన్ రాసింది .
మార్గరెట్ కవిత్వం ప్రాధమికం గా నే ఉన్నా మహిళా ప్రభావం ఉండేది . ఫాంటసి ప్రాధాన్యత నిచ్చింది .చెట్లు జంతువులుగా కనిపిస్తాయి .పది హేడు ,పద్దెనిమిది శతాబ్దాలలో స్త్రీలు తేనే ,గులాబి పూల వంటివారని కవులు వర్ణించారు

గూఢచారి కవి – ఆఫ్రా బెన్
జాన్ ,ఏమిస్ ల కూతురు ఆఫ్రా బెన్ ఒక వేగు గా గుర్తింపు పొందింది .కెంట్ లో 1640లో ఒక మంగలి కుటుంబం లో పుట్టింది .ఇంగ్లాండ్ అధీనం లో ఉన్న సురియం గయానా లలో చదివింది .పద్దెనిమిదో ఏట ఇంగ్లాండ్ చేరింది .సాటిలేని మాట కారి .ఇరవై ఆరేళ్ళ వయసులోనే భార్తాను కోల్పోయింది .రెండవ చార్లెస్ కు డచ్ యుద్ధం లో గూఢ చారి గా పని చేసింది .మిలిటరీ వ్యూహం లో మంచి నేర్పున్న మహిళా .చాలా విలువైన ,ముఖ్య సమాచారాలను సేకరించి రాజుకు అందజేసింది .కాని ఆమె కు ఇంటా బయటా శత్రువులున్నారు .కుట్రలు పన్ని ఆమె ను రాజుకు దూరం చేశారు .ఆఫ్రా పేదలు ఉండే చెరసాల లో బంధించి హింసించారు .
పునర్వైభావాన్ని రచనల ద్వారా సాధించాలని నిర్ణయించుకోంది.సహజ రచనా చాతుర్యం అలవడింది .తన సాహసాలను ప్రేరణ నిచ్చేట్లునాటకాలు రాసింది .దాదాపు పది హేనును నాటకాలు రాసింది .అందులో ‘’రోవర్ ‘’బాగా క్లిక్ అయింది .మధ్యమధ్య కవితలూ నవలలూ రాసి మెప్పించింది .చిన్న నాటి స్మృతులను ‘’ఒరనూకో ‘’,లో రాసుకొన్నది .అదొక బానిస కదా .ఫిలాసఫికల్ ఫిక్షన్ .ప్రజా భిమానాన్ని ఎక్కువ కాలం పొందలేక పోయింది .యాభై ఏళ్ళకే చనిపోతే వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేసి గౌరవించారు .నాటకాలు ఆమె లో ఒక పార్శ్వాన్ని ,కవిత్వం రెండో పార్శ్వాన్ని తెలియ జేస్తాయి .మగాదిలాగా రాసిందన్నారు కాని మించి రాసింది .
All women together, ought to let flowers fall upon the grave of Aphra Behn… for it was she who earned them the right to speak their minds… Behn proved that money could be made by writing at the sacrifice, perhaps, of certain agreeable qualities; and so by degrees writing became not merely a sign of folly and a distracted mind but was of practical importance.[13]
![]()
అన్నే ఫించ్
1661లో అన్నే కింగ్స్ మిల్ లో అన్నే ఫించ్ – విలియం కింగ్స్ మిల్ ,కు సౌత్ యాంప్ టన్ వద్ద సిద్ద్ మాన్తాన్ లో పుట్టింది .ఇరవై రెండో ఏట రాజ దర్బార్ లో మెయిడ్ గా చేరింది .కల్నల్ ఫించ్ ను పెళ్ళాడింది .చిన్నప్పుడే కవిత్వం రాసింది .డ్రాడేన్ ను పోప్ ను చదివి అర్ధం చేసుకోంది .వీరిలా అతిగా పోకుండా రాసింది .ఆలోచనాత్మకం గా స్త్రీ వాదం గా రాసింది .హాయిగా తోటలో విశ్రాంతి పొందేది .పల్లె పట్టు సొగసుల్ని కవిత్వం లో ప్రతిఫలింప జేసింది ..తానూ అమితం గా ప్రేమించి ఇష్టపడిన చోటే అరవైలో చని పోయింది .ఆమెను వర్డ్స్ వర్త్ ‘’ఏ నేచురల్ రేవేరీ ‘’అని కీర్తించాడు .అందులో తాజా గ్రామీణ ఇమేజరీ ఉంటుంది .’’if for a woman I would die ‘’the Ateist and the acorn ‘’కవితలు స్నిగ్ధ మనోహరం గా ఉంటాయి .’’if they re denied ,I on my self can live –and slight those aids unequal chance can give –when in the sun my wings can be displayed –and in retirement I can bless the shade’’అనేది ఆమె కవితల్లో ఒకటి .కింగ్ విలియం కు విధేయత ప్రకటించే ప్రమాణం చేయటానికి తిరస్కరించింది .హాయిగా జీవించినా కింది వారి దుఖాన్ని గురించి రాసింది. ఆమెను మేలాన్కలి వుమన్ అన్నారు .
![]()
చార్లెస్ సిడ్నీ
1639లో రోచెస్టర్ లో పుట్టిన చార్లెస్ సిడ్నీ వాదం కాలేజి లో చదివి ‘’మెర్రి గాంగ్ ‘’లో చేరి రెండవ చార్లెస్ కాలం లో పనికి మాలిన రెండు ట్రాజేడీలు రాసి ,కొద్దిగా నయం అనిపించినామూడు కామెడీలు రాసి కల కలం సృష్టించాడు .శ్రోతలకు వీనుల విందు చేశాడు .మంచిపాటలే రాశాడు
.![]()
రిచార్డ్ లీ,ఆంబ్రోస్ ఫిలిప్స్ ,థామస్ పార్నెల్ ,జాన్ బ్రియాన్
వీరి గురించి అప్పుడప్పుడు మాత్రమె చెప్పుకొంటారు ముగ్గురూ 1649 ,1675 ,1679ల లో పుట్టి 1779 ,1718లలో చనిపోయారు .లీ ని ‘’చిత్ర కవి ‘’ ఫిలిప్స్ రాసిన ఈక్లోగ్స్ ‘’అప్పటిగోప్ప కవిత్వం అన్నారు .’’నంబి పంబీ ‘’అనే మారు పేరు .డబ్లిన్ లో పుట్టిన పార్నెల్ ఇలియడ్ ను అనువాదం చేసి చని పోయిన తర్వాతా పబ్లిష్ అయి పేరొందాడు .ఓడ్స్,కదాత్మకాలు పవిత్ర కవితలు రాశాడు .
షార్ట్ హాండ్ పిత –జాన్ బిరామ్
జాన్ బిరామ్ 1692-1763వాడు .హిమ్స్ రాశాడు .పాస్టో రల్ రైమ్స్ ,దయాలిక్ట్ వెర్సెస్ రాశాడు .’’ది యూనివర్సల్ ఇంగ్లీష్ షార్ట్ హాండ్ ‘’కనీ పెట్టి మాంచెస్టర్ లో బోధించాడు .లేఖా సాహిత్యం లో దూసుకు పోయాడు .’’జర్నల్స్ అండ్ పేపర్స్ ‘’కు మంచి పేరు .ఇందులో ఆ కాలం నాటి నిత్య జీవితాన్ని డైరీ లాగా రాశాడు . అంటాలజిస్టులు తప్ప అందరూ బ్రియాన్ ను మర్చిపోయారు అతని ఎపిగ్రం గుర్తింపు పొందింది .’’God bless the king –I mean the faith;s defender –god bless –no harm in blessing –our pretender –but who pretender or who is king?-god bless us all ,that is quite a different thing ‘’మచ్చుకు ఒకటి .
![]()
జాన్ గే
1685లో పుట్టి 1732లో చనిపోయిన జాన్ గ్రే విట్ ఉన్నకవి నాటకాలు ఒపెరాలకు లిబర్టోలు ,నీతి కధలు జానపదాలు ,పట్నకవితలూ ,రాజకీయ సెటైర్లూ రాశాడు .బారన్ స్టేబుల్ లో బీద వాడుగా పుట్టి పదేళ్ళకే అనాధ అయ్యాడు మెట్రో పాలిటన్ జీవితం లో అడుగు వర్గాల దయ నీయ స్తితిని స్వయం గా అనుభవించీ చూసి చాలించాడు .లండన్ లో సిల్క్ మర్చంట్ దగ్గర పని చేశాడు ‘’ది ఆర్ట్ ఆఫ్ వాకింగ్ ది స్ట్రీట్స్స్త్రీ ఆఫ్ లండన్ ‘’లో ఆ నగర ఆనందం విషాదాలను చూపించాడు .వీటినే నలభై ఏళ్ళ వయసులో ‘’దిబెగ్గర్స్ ఒపేరా’’లో రాస్తే జాన్ రిచ్ దర్శకత్వమ్ చేశాడు .దీనితో డబ్బు వచ్చింది .దాన్ని ‘’made rich Gay and Gay rich ‘’అని చమత్కరించాడు .ఇందులో ప్రభుత్వాధికారుల మీద సెటైర్లు బాగా పండాయి పేలాయి . ప్రధాని సర్ రాబర్ట్ వాల్ పోల్ ను ఉద్దేశించి రాశాడు .అతని అవినీతి భాగోతాన్ని చీకటి వ్యాపారాన్ని చీల్చి చెండాడాడు .హాన్దిలియాన్ ఒపేరా అవక తవకలు ఎండ గట్టాడు .. దీనికి ఈక్వేల్ రాయాల్సి వచ్చింది .’’పోలీ ‘’రాశాడు .రాజకీయ కారణాలతో బాన్ చేశారు అతాని అదృష్టం దోలాన్దోలమానం అయింది .ఫేబుల్స్ కవితల్లో వచ్చిన డబ్బు అంటా అయిపొయింది సౌత్ సీ స్కాండల్ అనే ఆర్ధిక దోషం పై చర్చ జరిగింది కొద్ద్దికాలమే జీవించినా సుఖ పడ్డాడు నలభై ఏడులో చని పోయాడు .ఆరు వేల పౌండ్ల నిలువ ధనాన్ని చని పోయేటప్పటికి సంపాదించాడు అతాని ప్రాభవానికి వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఖననం చేశి గౌరవించారు .
‘’life is a jest and all things show it –I thought so once and now I know it ‘’.మంచికవిత .డ్రై డే న్ పోప్ లంత క్రూరం గా రాయలేదు ‘’a satire without spite ‘’గ రాయటం ఇతని ప్రత్యేకత .అతను రాసిన కవిత్వం అంతా నిరాపెక్షనీయ కవిత్వామే అన్నారు .పల్లె వాడైనా పట్నం లో గుర్తింపు పొందాడు .
![]()
జోనాధన్ స్విఫ్ట్
ఈ పేరు వినగానే గలివర్స్ ట్రావెల్స్ అందరికి గుర్తోస్తుంది .నిజానికి ఆయన కవికాడు . 1667లోడబ్లిన్ లో పుట్టి 1745లో చనిపోయాడు .తీవ్రమైన చురుకుదానం భావోద్వేగాలతో రగిలి పోయాడు .జీవితా చరమాంకం లో కవిత్వం రాశాడు డ్రైడేన్ కవికి కజిన్ .తండ్రి చనిపోయిన తర్వాతా అంకుల్ దయాదక్షిన్యాల మీద బతికాడు .ఇరవై రెండేళ్లకే ఇంగ్లాండ్ లోని సర్ విలియం టెంపుల్ అనే దూర బంధువుకు సేక్రేఅతరి అయ్యాడు .టెంపుల్ తన కన్నా తెలివి తేటల్లో తక్కువ వాడు అంతేకాక అక్కడి స్ట్రిక్ట్ డిసిప్లిన్ ను భరించలేక పోయాడు .ఏదో మంచి జరుగుత్న్డనే ఆశతో పదకొండేళ్ళు అలానే లాగించాడు .లాభం లేదనుకొని ఎయిర్ లాండ్ చేరుకొన్నాడు డబ్లిన్ లో సెయింట్ పాట్రిక్ కు డీన్అయ్యాడునలభై లో .ఇక్కడా ,లండన్ లోనూ గడిపాడు కాలం మత బోధ , రచనలు చేస్తూ ఉన్నాడు .అడిసన్ స్టీవ్ ,పోప్ మొదలైన ప్రముఖులతో పరిచయాలేర్పడ్డాయి .రాజకీయం గా కరపత్రా రచనలో దూసుకు పోయాడు మతం లో విద్యా విధానం లో అవినీతిని బయట పెట్టాడు .ఐరనీ తో అందరికి చెమటలు పట్టించాడు .
ఈస్తర్ జాన్సన్ అనే అమ్మాయిని చిన్నప్పటి నుండి ప్రేమించాడు .టెంపుల్ వద్ద ఆమె తల్లి సేవకురాలు .ఈ పిల్ల ఆయన పిల్లె అను పుకార్లు షికార్లు చేశాయి .ఈ అమ్మాయికి ట్యూటర్ గా స్విఫ్ట్ ఉన్నాడు ఐర్లాండ్ లో స్తిరాపడి ఆమెనూ డబ్లిన్ లో ఉంచాడు .డబ్లిన్ వ్యాపారి కూతురు వెనిసా తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు .ఈస్తర్ తో ప్రేమ ఈమె తో సల్లాపాలు ఇబ్బంది పెట్టాయి .ఇద్దర్నీ మైంటైన్ చేశాడు ..కొద్దిరోజుల్లో వేనేసా ,మరో అయిదేళ్ళలో ఈస్తర్ మరణించారు .గలివర్స్ ట్రావెల్స్ ను యాభై వ ఏట రాశాడు .అరవై లో తాను పతనం చెందుతున్నట్లు గ్రహించాడు .చెవుడు బాగా వచ్చి బాధించింది .ఇంకో పదేళ్ళు బతికాడుకాని గార్దియన్లు అవసరమైనారు .పెరాలిసిస్ తో బాటు అఫెశియా జబ్బు వచ్చింది .డెబ్భై ఎనిమిదో ఏట చనిపోయాడు .తన సమాధి పై’’here lies jonathan Swift –where savage indignation can no longer tear his heart .అని రాయించాడు తన ఆస్తిని బుద్ధి మాంద్యులకు చికత్స చేసే హాస్పిటల్ కు రాశాడు .
‘’పోయిట్రీ –ఏ రాప్సడి ‘’లో ఆయన ఐరాని అంతా గుప్పించాడు దీన్నే ఎప్పుడూ అందరూ ఉదహరిస్తారు .’’so naturalists observe a flea –has smaller fleas that on him prey –and hese have smaller still to bite them –and so proceed ad infinitum ‘’ఆయన కవిత్వం లో నిరాశ ఉండదు .’’he gave his little health he had –to build a house for fools and mad –and showed by one satiric touch –no nation wanted so much –that kingdom he hath left his debtor –I wish it soon may have a better ‘’అన్నకవిత చాలా ప్రసిద్ధం .
![]()
మాధ్యూ ప్రయర్
మాధ్యూ ప్రయర్ పెద్ద గా పేరున్న వాడుకాడు .1664లో పుట్టి 1721లో చనిపోయాడు .డ్రై డే న్ అనుయాయి .సమకాలీన పరిస్తులపై వ్యంగ్యాత్మకం గా చెణుకులు రాశాడు .తండ్రి పోయిన తర్వాతా లార్డ్ డార్సేట్ ప్రాపకం పొందాడు అతనే వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చేర్పించి చదివించాడు కేం బ్రిడ్జి లో సెయింట్ జాన్ కాలేజిలో చేర్పించాడు పదమూదేళ్ళప్పుడే ఓవిడ్ ,ఆరెస్ లను అనువాదం చేసిన చిన్నారి పిడుగు .చార్లెస్ మాంటేగ్ తో కలిసి డ్రై డే న్ రాసిన దాన్ని కధలుగా రాశాడు .కవిత్వం రాజకీయం రెండిటిలోనూ సవ్య సాచి అయ్యాడు .హాలండ్ రాయబారికి సెక్రెటరి హోదా వచ్చింది .పారిస్ లో సీక్రెట్ ఏజేంట్ గా నియమింప బడ్డాడు .టోరీలతో జత కలిపాడు .వారికోసం అనేక సమావేశాలు నిర్వహించి ‘’ట్రీటీ ఆఫ్ అత్రేచ్ట్ ‘’శాంతి ఒప్పందం సాధించాడు దీనికే అతని పేర ‘’మాట్స్త్ పీస్ ‘’అని పిలిచారు .
అన్నే రాణి మరణం తర్వాతా రాజకీయం గా బల పడే యత్నం చేశాడు .కాని తన్నింది .విగ్గులు జైల్లో పెట్టారు .రెండేళ్ళ తర్వాత విడుదలయ్యాడు .కంచే బాగు చేయటం ,సంపద వృద్ధి చేయటం లో కృత క్రుత్యుడైనాడు .యాభై నాలుగులో అతని మొదటి కవితా సంపుటి ‘’పోయెమ్స్ ‘’వెలువడింది .రచన లాభ సాటిఅని గ్రహించాడు .అమ్మకాలు చేస్తే నాలుగు వేల గినియస్లు లభించాయి .,ఇదీ లార్డ్ హార్లీ ఇచ్చిన నాలుగు వేల పౌన్డ్లూ కలిపి ఎస్సెక్స్ లో డౌన్ హాల్ కొన్నాడు .అందాగాడు కాకపోయినా మంచితనం తో స్నేహితుల్ని పొందాడు పదహారవ లూయీ స్నేహితుడైనాడు .క సారి ఆయన్ను రాజు వేర్సైల్స్ లాగా చిరస్మరణీయ వి ఏవైనా ఎర్పరచాడా అని అడిగితె ‘’monuments of my master;s actions are to be seen every where except in his own house ‘’అని రాయబారిగా ఉన్నా చమత్కరించాడు .
దాదాపు అన్ని ప్రక్రియలలోనూ ప్రయర్ రచన చేశాడు .లాంగ్ సాలిలోక్వీకప్లేట్స్ సెటైర్స్ ,వ్యాసాలూ బాలడ్స్ లను రాశాడు సద్యో కవితలు చెప్పాడు .’’be to her virtues very kind –be to her faults a little blind ‘’అన్న కవిత పేలింది .గుర్తుండి పోయే కవిత్వం రాశాడు .తనను గురించి ‘’nobles and heralds by your leave –here lies what once was Mathew prior –the son of Adam and Eve –can Bourbon or Nassau claim higher?
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-14-ఉయ్యూరు

