పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31
హాలిక కవి –రాబర్ట్ బర్న్స్
మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా రాశాడు .25-1-1759లోస్కాట్ లాండ్ లోని ఐరిషైర్ లో కిల్ లోని అల్లోవే లో జన్మించాడు .తండ్రి విలియం బర్న్స్ స్వంత చేతులతో ఒక చిన్న కాటేజీ నిర్మించుకొన్నాడు .అంతా రైతు వాతావరణం .తల్లి కూడా అదే కుటుంబం నుంచి వచ్చింది .చదువు రాని స్త్రీ .బైబిల్ లో కొన్ని పేజీలు మాత్రం చదవ గలిగేది .జానపద కధలు చెప్పటం లో ఆరి తేరి ,పిల్లలకు ఆ కధలతో వినోదం పంచేది .ఆమె సోదరి కూడా వీరితోనే ఉండి ఆమెకు పాటల్లో గృహ క్రుత్యాలలో తోడుగా ఉండేది .ఆరవ ఏట బర్న్స్ అల్లోవే స్కూల్ లో జాన్ మర్డాక్ దగ్గర విద్య నేర్చాడు..ఆ మేస్టారికి ఫుడ్డూ బెడ్డూ అన్నీ ఈ రైతులే చూసేవారు .నిర్దుష్టమైన ఇంగ్లీష్ ను పిల్లలు నేర్వాలని ఆయన తాపత్రయం .తండ్రి బర్న్స్ కు పొలం పనులు నేర్పాడు. మూడు వారాలు సెలవ ఇస్తే దూరం గా ఉంటున్న గురువు గారు మద్రోక్ దగ్గకు వెళ్లి చదువుకొనే వాడు
తండ్రికి మొదటి బ్రేక్ డౌన్ ,కొడుకు మొదటి కవిత ఒకే సారి వచ్చాయి .పది హేనవ ఏట రైమ్స్ తో కవిత్వం రాశాడు .కూలీల కష్ట జీవితాలను పేదరికాన్ని కవిత్వీకరించాడు .పంటలు వాటికి పట్టే చీడ పీడలూ కవిత్వం లో చోటు చేసుకొన్నాయి .పందొమ్మిది లో కుటుంబం లోచ్లీ కి మారి ఏడేళ్ళు ఉండి పోయారు .ఇరవైలో అలిసాన్ బేగ్ బీ అనే పని కత్తే ను ప్రేమించి ముగ్గు లోకి దించాడు ..ఆమెపై కవితలూ రాశాడు .ఇక్కడి వాతావరణం నచ్చక ఇర్విన్ వెళ్ళాడు .తండ్రి అప్పులపాలై క్షయ సోకి చావు బతుకుల మీద ఉన్నాడు .తండ్రి దగ్గరకు చేరి సేవ చేశాడు .అతనిలోని రచయిత బయటికి వచ్చి విజ్రుమ్భించాడు .తండ్రి మరణానికి ముందు ‘’కామన్ ప్లేస్ బుక్ ‘’మొదలు పెట్టి రాస్తున్నాడు మనసులో మెదిలిన ప్రతిభావాన్నీ కాగితం పై పెట్టాడు .తండ్రి పోయిన తర్వాత వ్యవసాయం చేశాడు నకిలీ విత్తనాలు ,అదనుకు సాగు చేయక పోవటం తో నష్టాల్లో కూరుకు పోయాడు .పెట్టు బడులే రాలేదు .
ఈ వూరు వదిలేసి పక్కనే ఉన్న మాచ్లిన్ చేరాడు .అక్కడ అందమైన అమ్మాయిలూ సరదా అబ్బాయిలతో కాల క్షేపం చేశాడు .ఎలిజ బెత్ పాటన్ అనే మరో పని అమ్మాయి ని వలచాడు .ఆమెతో అక్రమ సంతానాన్ని పొందాడు .తండ్రి అయ్యాననే గర్వం తో’’ఏ పోఎట్స్ వెల్కం టు హిజ్ లవ్ బిగాతెన్ డాటర్ ‘’ ఒక కవిత రాసి పేపర్ కు పంపాడు .పుట్టిన పిల్లను బర్న్స్ తల్లే పెంచింది .ప్రియురాలికి ఇరవై పౌండ్లు ఇచ్చి సర్దు బాటు చేసుకొన్నాడు. ఆమె తలిదండ్రులను చేరింది .తెలియని జబ్బు ప్రవేశించి బాధిస్తోంది .రాసిన కవితలను చేతి వ్రాత ప్రతులనే అందరికీ ఇచ్చే వాడు .స్టాంజాలు రాయటం లో కొత్త పుంత తొక్కాడు .అందుకే వాటిని ‘’బర్న్స్ స్టాం జాలు ‘’అనే ముద్రపడింది .’’జాలీ బెగ్గర్స్ ‘’అనే కవిత తరతరాలుగా చదివించింది .ఇందులో జంతువుల ఆత్మ ఘోష ఉంది .
ఇరవై ఆరులో ఒక తాపీ మేస్త్రి కూతురు జీన్ ఆర్మార్ ను ప్రేమించాడు .తండ్రి ఒప్పుకోలేదు .సాక్షుల సమక్షం లో పెండ్లాడి లీగల్ మారేజీ చేసుకొన్నాడు .మామ కు కోపం వచ్చి ఇతన్ని అల్లుడే కాదు పొమ్మన్నాడు .వినే వాడిది పాపం కవితలు పిలిచి వినిపించేవాడు .జమైకా వెళ్లి చెరుకు సాగు చేద్దామనుకొన్నాడు .ఇంతలో ఇంకో పాలమ్మే మేరీ కాంప్ బెల్ అనే అమ్మాయిని లైన్ లో పెట్టుకొన్నాడు .ఆమెను ‘’హైలాండ్ మేరీ’’అని పిలిచి కవిత్వం చిందించాడు .ఆమెకు కడుపోచ్చింది .పిల్లను కనీ ఆమె చనిపోయింది. బర్న్స్ అనారోగ్యం పాలయ్యాడు .చనిపోయిన మేరీ పై ఎలిజీ రాశాడు .జమైకా వెళ్లి చెరుకు సేద్యం చేశాడు .ఇక్కడా నెత్తిన చేతులే .మామగారి తో అసమర్దుదనిపించుకొని వ్యవసాయం లో దెబ్బతిని ఏమీ సాధించలేని వాడని ముద్రపడ్డాడు. చివరికి కవిత్వమే శరణ్యం అనుకొన్నాడు .జాలీ బెగ్గర్స్ ను ఒక మారుమూల ఊరిలో ప్రింట్ చేశాడు మూడు షెల్లింగుల రేట్ పెట్టాడు .చాలా మంది ఎగపడి చందా రారులై నారు ప్రింట్ చేసి డబ్బు బాగా సంపాదించాడు .ఒక్క నెలలో ఒక అజ్ఞాత పల్లెటూరి అంత్య ప్రాసల కవి కవిత్వాన్ని ఆరు వందల మంది పోషించి వెలుగు లోకి తెచ్చారు ఇరవై ఏడు లో ‘’సేలేడోనియా బార్డ్ ‘’అని ఆ అమాయక అక్షరం ముక్క రాని ప్రజల చేత కీర్తింప బడ్డాడు బర్న్స్ .స్కాటిష్ మాండలికం లో ఉన్న ఇంగ్లీష్ శైలిలో వాటిని నగిషీలు చెక్కాడు .ఇంగ్లీష్ కవిగా గుర్తింపు పొందాలని ఉవ్విళ్ళూరుతున్నాడు .కిల్మర్నాక్ పోయెమ్స్ గా పిలవ బడే ఈ కవితలు నలభై మూడు .ఇందులో చేత్తకవితలూ ఉన్నాయి .ఒక మంచి కవిత ను చూద్దాం –
‘’is there in human form ,that bears a heart –a wretch a villain lost to love and truth –that can with studied ,sly ,ensnaring art –beasty sweet jenny;s un suspecting youth ‘’
ఈ సంకలనం డబ్బు నిచ్చింది .దానితో ఆశ పెరిగి అదృష్టాన్ని పట్నం లో పరీక్షించుకొందామని ఎడిన్ బర్గ్ చేరాడు .అక్కడి సాహితీ ప్రముఖులేవరూ స్వాగతించలేదు .’’పొలం లో పెంట పోగు మీద పెరిగిన పుష్పం గా ‘’అందరూ భావించారు .మనిషి అధైర్య పడ్డ్డాడు .పేరు ప్రఖ్యాతులు ఒక్క సారిగా రావని గ్రహించాడు .క్రమం గా జనం దగ్గరకు వస్తున్నారు .ప్రతిభకు గుర్తింపు వచ్చింది .చిన్న చిన్న సన్మానాలు చేస్తున్నా వారి మధ్య తానూ తేలి పోతున్నట్లు భావించాడు డబ్బు వస్తోందికాని మానసికానందం లేదు .ఎరల్ ఆఫ్ గ్లేన్కారిన్ సహాయం తోతన కవితల రెండవ ఎడిషన్ తెచ్చాడు .చేతిలో డబ్బు ఆడుతోంది .కాని మానసిక ప్రశాంతత కరువైంది .సరిహద్దు రాష్ట్రాలు తిరిగాడు ప్రయోజనం కనీ పించలేదు .పల్లె జనుల పాటలు వింటూ వాటి ని సరి చేస్తూ హాయిగా గడిపాడు .
ఎడిన్ బర్గ్ లో స్కాటిష్ సాంగ్స్ ను’’స్కాట్స్ మ్యూజికల్ మ్యూజియం ‘’వెలువరించే ప్రాజెక్ట్ లో జేమ్స్ జాన్సన్ వచ్చి సహాయం చేయమంటే చేశాడు .అవి ఆరు వాల్యూములుగా తెచ్చారు .అందులో బర్న్స్ ఎక్కడ సరిదిద్దాడో ఎక్కడ స్వంతవి చేర్చాడో తెలీకుండా చేశాడు .వినటానికి మహా కర్ణ పేయం గా వచ్చాయి .బర్న్స్ జీఎవితం లో ఇదొక గొప్ప ఎచీవ్ మెంట్ అయింది .ఈ ప్రాజెక్ట్ వలన బర్న్స్ ఒక’’ లిరిక్ రైటర్’’ అని పేరు వచ్చింది .ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు .రెండో సారి ఎడిన్ బర్గ్ కు వచ్చినప్పుడు ఆగ్నెస్ మాక్లి హోస్ ను ప్రేమించాడు .ఆమె ఇతనికి తగిన అమ్మాయి .అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టారు. కాని పెళ్లి చేసుకోలేదు .అదృష్టం కలిసొచ్చి ఎక్సైజ్ లో ఆఫీసర్ ఉద్యోగి అయ్యాడు .నిత్ నది ఒడ్డున డం ఫ్రైస్ లో చిన్న వ్యవసాయ క్షేత్రం కొన్నాడు .జీన్ కు ఇద్దరేసి కవల పిల్లల్ని కన్నది నలుగురూ రోజులే బతికి చనిపోయారు .అప్పడు పెళ్లి చేసుకోన్నాడామెను .దాన్ని’’I gave her a matrimonial title to my corpus ‘’ అని కవిత్వీకరించాడు .జీన్ గ్రుహిణిగా ప్రింటర్ గా ,సహకరించింది .స్మగ్లింగ్ ను అరికట్టే ఉద్యోగం చేస్తూ ఏడాదికి యాభై పౌండ్ల జీతం పొందుతున్నాడు .జీన్ స్వయం గా పొలం పనులు చేస్తూ చేయిస్తూ ఉండేది మరో బిడ్డ జననం .ఇక్కడి నీరస జీవితం బోర్ కొట్టింది .
ముప్ఫై రెండులో అన్నే పార్క్ అనే బార్ లో అమ్మాయిని పడేశాడు ప్రేమలో. ఆమె ఆరాధనలో మళ్ళీ కవిత్వం దూకి పారింది .ఈ ప్రేమకు ఒక కూన కూడా పుట్టింది .అక్కడ జీన్ మరో పిల్లాడిని కన్నది. ఐలిష్ లాండ్ వ్యవసాయం ఏమీ కూడు పెట్టటం లేదని గ్రాహించి మొత్తం అంతా అమ్మేశాడు .డంఫ్రైస్ కి మకాం మార్చి వచ్చే కొద్ది జీతం తో బతికాడు .అయిదేళ్ళు ఇక్కడే ఉండి చనిపోయాడు .రాజకీయాలు ,పౌర సమస్యలపై రాశాడు .1776అమెరికన్ కాంగ్రెస్ ను మెచ్చుకొన్నాడు .ఫ్రెంచ్ విప్లవాన్ని సమర్ధించాడు .1792లో నిత్య గర్భిణి అని పించుకొన్న జీన్ ఇంకో పిల్లఎలిజ బెత్ ను ప్రసవించింది .పొలం లో పంట పండించా లేక పోయినా భార్య జీన్ కడుపు పండిస్తున్నాడీ హాలిక కవి .ఇదివరకటిలానే ఈ సంతానమూ దక్కలేదు .బర్న్స్ కుఫిట్లు ,తాగుడు వలన వాత రోగం వచ్చింది .అయినా ‘’జాన్ ఆండెర్సన్ మై జో ‘’,అనే పురాతన బూతుకదను ఆధునిక పరిభాషలో మార్చి వివాహ బాంధవ్యాన్ని బలపరచేట్లు రాశాడు .కిల్మార్ నాక్ ఎడిషన్ తర్వాతా ఆరేళ్ళకు కొత్త ఎడిషన్ తెచ్చాడు అందులో ఇరవై తొమ్మిది కొత్త కవితలున్నాయి .ఇందులో కొన్ని ‘’రౌడీ రైమ్స్ ‘’కూడా చేరాయి .
ముప్ఫైలలో వ్యాధి పెరిగింది .ఇంకో ఏడాదికి మరీ క్షీణించి పోయాడు .ఆకలి లేదు.ఎముకల పోగుగా మిగిలాడు .గోరు చుట్టుమీద రోకటి పోటు లా ఒక పబ్లిషర్ బర్న్స్ ఒక బిల్లుకు డబ్బు చెల్లించలేదని కోర్తుకెళ్లాడు .జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమో నని మోనని భయ పడ్డాడు .భార్య జీన్ కు జాబు రాశాడు పరిస్తితి ని తెలియ జేస్తూ .అవే చివరి అక్షరాలు .21-71796న హాలికుడై ,నిరాశతో ఆల్కహాలికుడైన కవి రాబర్ట్ బర్న్స్ చనిపోయాడు .గొప్ప కవుల జాబితాలో బర్న్స్ చేరడు .లోతైన అంతర్ ద్రుష్టి ,ఊహా లేనికవి .భాష హోరేత్తిస్తుంది .రసహీంత ఇబ్బంది కలిగిస్తుంది .కాని ‘’Burns distilled a pure essence of the crude stuff of life ‘’అని తేల్చారు .’’a conciliation of the regional and the universal was finally accomplished .The overwhelming conflicts may have resulted in the death of the peasant ,but they brought everlasting life to the poet ‘’.
బర్న్స్ కవిత్వం లో రిపబ్లికనిజం తో బాటు రాదిక లిజం కూడా ఉన్నాయి .అతని దస్తూరి అనేక రకాలుగా ఉండేది అందుకని ‘’మానిక్ డిప్రెషన్ ‘’లో ఉండేవాడని తెలుస్తోంది .’’బ్లూ డేవిలిజం ‘’తో బాధ పడినట్లు అతనే చెప్పుకొన్నాడు .స్కాటిష్ కేనదియన్లు బర్న్స్ ను అమితం గా ఆరాధించారు .అమెరికా నవలా కారుడు స్టెయిన్ బెక్ బర్న్స్ కవితలో ఒక భాగాన్ని తీసుకొని ‘’ఆఫ్ మిస్ అండ్ మెన్ ‘’నవల రాశానని చెప్పుకొన్నాడు .సాలింజర్ కూ ప్రేరణ నిచ్చినకవి .బర్న్స్ రచనలు రష్యన్ భాషలోకి అనువాదం చెంది సామాన్యులను విశేషం గా ఆకట్టుకొన్నాయి .’’ఏ మాన్స్ ఏ మాన్ ‘’కవిత రష్యన్ లకు ప్రగతి శీలం గా అనిపించి’’ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ ‘’అన్నారు . 1924.రష్యాలోకి అనువదింప బడిన కవితలు ఆరు లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించాయి .బర్న్స్ పేరా ప్రత్యెక స్టాంప్ ను రష్యా ప్రభుత్వం విడుదల చేసింది .రాబర్ట్ బ్రౌన్ స్కాలర్శిప్పులిస్తున్నారు .బర్న్స్ పేరా అయిదు పది పౌండ్ల కరెన్సీ నోట్లు విడుదల చేశారు .’’ది గ్రేటెస్ట్ ష్కాట్ ‘’గా గౌరవించి ఆరాధిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-14ఉయ్యూరు –

