రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)
1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’
కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ .
2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ ‘’
సమర్ధుడు తగిన నాయకుడు,పాలకుడు యెంత వెతికినా –ఇంకోడు’’ ఏడీ?’’
3- అర్హత ఉన్నవారిని తన సహచర మంత్రులుగా చేర్చి పక్కన పెట్టి ముసలి ముఠా
శాఖలూ సమర్దులకే అప్పగించి కొత్తరక్తం ఎక్కించి ఉత్సాహం ఊపు నిచ్చిపేల్చాడుజోడు గుళ్ళపిస్తోలుఠా.
4-మంత్రిపదవి పొందింది రాహుల్ ను ముప్పతిప్పలు పెట్టిన ‘’ఇరానీ స్మృతి’’
పాపం ‘’మొద్దబ్బాయి’’ నిద్రపట్టకుండా తలచు కొంటాడేమో ‘’పరాభవ స్మృతి ‘’?
5-కాంగ్రెస్ కొంప ‘’ఖాళీ ‘’
పని చేయ దింక ఏ’’ మోళీ ‘’.
6-.ఎక్కిన మర్నాడే ‘’నల్ల కుబేర భరతం’’ పట్టటానికి ఏర్పాటు చేశాడు ‘’సిట్’’
పదేళ్ళు పాలించినా ఆదిశలో ముందుకు వెళ్ళకుండా చేసిన కాంగీ పాలన ‘’షిట్ ‘’.
7-కొత్త రాజధాని, రాష్ట్రం అభి వృద్ధికి దాతలను ప్రోత్సహిస్తున్న ‘’ఆంద్ర జ్యోతి ‘’
వరదలా వచ్చి పడుతున్న నిధులతో నిండుగా వెలగాలి ‘’ స్వర్ణాంధ్ర జ్యోతి ‘’.
8-పదికోట్ల మంత్రం జపించే సి.పి.ఐ ‘’నారాయణ ‘’
సి.పి.ఏం . ముందు భంగపడి అయ్యాడు అయ్యో ‘’వెర్రి నాయన ‘’
9-జగన్ పార్టీ ది పరనిందా,’’సొంత డబ్బా ‘’
మైసూరా ,వెంకన్న ముఠావాయించేది’’ పరస్పర డబ్బా ‘’.
10-ఓడినా సిగ్గురాని ఖద్దరు చేతి నేతలు
అది నేత్రి పాదాల పై ఇంకా పడి లేవని’’ పీతలు ‘’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-14-ఉయ్యూరు

