పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40
విక్టోరియా కాలపు ప్రేమ కధలు
మొనోలోగ్స్ సిద్ధ హస్తుడు – రాబర్ట్ బ్రౌనింగ్
బ్రౌనింగ్ జీవించిన డెబ్భై ఏడు సంవత్సరాలలో న్పందోమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ అనేక ప్రశాంత విప్లవాలను చవి చూసింది .విక్టో రియన్ కాలం లో మార్పులు నెమ్మదిగా వచ్చినా అవి గణ నీయమైనవి .కారల్ మార్క్స్ కు అప్పటికి అంత సీను లేదు ..పార్ల ర మెంట్ లో డబ్బున్న వాళ్ళకే ఓటు హక్కు అనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది . సమాన వోటు హక్కు కోసం ప్రజలు పట్టు బడుతున్నారు ..చారిటా న్ ల ఈ ఉద్యమం క్రమంగా బలపడి అనుకొన్నవి సాధించారు .ఆ శతాబ్ది మధ్యలో కాని బాల కార్మికుల పని పై ఆంక్షలు రాలేదు .ఫక్తరీ కూలీల జీవితాలు బాగు పడలేదు .యెలిజ బెత్ బారెట్ బ్రౌనింగ్ ‘రిక్రై ఆఫ్ ది చైల్డ్ ”థామస్ హుడ్ ”సంగ్ ఆఫ్ ది షర్ట్”లే వీటిని సాధించాయి . డార్విన్ పరిణామ [ సిద్ధాంతం సైన్సుకు మతానికి మధ్య చిచ్చు పెట్టింది ..బైబిల్ చెప్పిందే నమ్మాలి అన్న దానికి సవాలుగా నిలిచింది ..విశ్వమ్ లో మానవుడి ఉనికికి ప్రాదాన్యమేర్పడింది .
సాహిత్యం లోను ఎన్నో మార్పులోచాయి ..విక్టో రియన్ నవల అయిన స్కాట్ నవలపై ఏవ గింపు కలిగింది . కల్పనా సాహిత్యాన్ని డికెన్స్ విజ్రుమ్భించి రాసి మెప్పిస్తున్నాడు .నిజాయితీ కంటే బాధ్యతకు ఎక్కువ గౌరవం లభిస్తోంది . అదిగో ఇలాంటి నేపధ్యం లోనే రాబర్ట్ బ్రౌనింగ్ కవి7-5-1812నకంబర్వేల్ లో ఉద యించాడు అందరు ఇంగ్లాండ్ కవుల్లా కాకుండా ఇతని వ్రేళ్ళు వెస్ట్ ఇండీస్ లో ఉన్నాయి .తాత గ్రియోల్ రక్తం ఉన్నవాడుఅదే నల్ల రంగు బ్రౌనింగ్ కు వచ్చి యెర్ర ఇంగ్లాండ్ కవులకు భిన్నం గా ఉండేవాడు .తల్లి సార వీదర్మన్ జర్మన్ జ్యూఅయిన నావికుని కూతురు ..ఈతాతనె బ్బ్రొఉనింగ్ షిప్ఓనర్ అనే వాడు .ఈయన డూండీ లోని స్కాటిష్ స్త్రీని పెళ్లి చేసుకొన్నాడు .తల్లి నుండి తనకు సంగీతం సంక్రమించిందని బ్రౌనింగ్ చెప్పాడు .
తండ్రిపైనే బ్రౌనింగ్ ఎక్కువ ఆధార పడ్డాడు .. తండ్రి వెస్ట్ ఇండీస్ లోని కిట్స్ లో చెరుకు వ్యవసాయం చేసే వాడు ఽఅ క్కడి బానిసల పై దౌర్జన్యాన్ని ఎదిరిస్తే తండ్రి బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో పనిలో పేట్టాడు ఽఅ క్కద పెద్దమనిషిగా ,విద్యా వంతుడిగా ,బైబిల్ అభిమానిగా మారాడు .తండ్రి లైబ్రరీలో ఆరు వేల పుస్తకాలు వివిధ భాషల్లో ఉండేవి .ఇక్కదె పెరక్లియాస్ ,ఫాస్తాస్ ,మొదలైనవి చదివాడు ఈ విషయం లో జీవితాంతం తండ్రికి రుణ పడి ఉన్నాడు . తండ్రి మంచి రచయిత కూడా .”డెవలప్ మెంట్ ”అనే స్వీయ చరిత్ర కవిత్వం లో వీటిని బ్రౌనింగ్ వివరించాడు . లండన్ వర్సిటి లో చదివిన కొద్దికాలం లోనే కావలసింది అంతా నేర్చేశాడు ..పన్నేండవ ఏట తాను ఎమికావాలనుకోన్నదీ ఖచ్చితం గా నిర్ణయించుకొన్నాడు ..”ఇన్ కండిటా ”అనే కవితా సంకలాన్ని తెచ్చాడు ..తండ్రి మెచ్చుకొన్నాడు కాని దాన్ని నాశనం చేశాడు బ్రౌనింగ్ .
ప ధ్నాలుగో ఏట ఒక గొప్ప సంచలనమే సృష్టించాడు .”పాలిన్ ”రాసి దానికి ”ఫ్రాగ్ మెంట్ ఆఫ్ కన్ఫెషన్ ”’పేరుతొ ఇరవై ఒక్క ఏట విడుదల చేశాడు .దానికి తానే అధికారినని ముప్ఫై నాలుగవ ఏట కాని చెప్పుకో లేదు .దీన్ని కలేక్తేడ్ పోయెమ్స్ లో చేర్చి ప్రచురించాడు .
ఇరవై రెండులో విదేశీ యాత్ర చేశాడు .రష్యా లో రెండు నెలలు ఉండి రినైసేన్స్ డాక్టర్ పెరక్లియాస్ ను కలిశాడు ..ఈ ప్రభావం తో నలుగు వేల పంక్తుల ”పారసేల్సాస్ ”రాశాడు ..దీని ఖర్చు తండ్రి పెట్టాడు .దీన్ని చదివిన నటుడు విలియం మార్కేదీ తనకొక నాటకం రాసి పెట్టమని అడిగాడు ..”స్త్రఫోల్డ్స్ ”రాసి1837 లో ప్రచురించాడు ..దీనిని కోవెంట్ గార్డెన్ దియేటర్ లో అయిదు అంకాల నాటకం గా ప్రదర్శించారు ..నటులు బాగా చేయలేదని బ్రౌనింగ్ యిదేమి నాటకమని డైరెక్టర్ తిట్టుకొన్నారు .జీవితం లో దియేటర్ నాటకం రాయను అని భీష్మించాడు .కాని రెండేళ్ళ తర్వాతా విజ్రుమ్భించి రాశాడు .
మొదటి సారి ఇటలి వెళ్లి వెనిస్ అందానికి ముగ్ధుడయ్యాడు .”సార్దేల్లా ”అనే రైమేడ్ పోయెం రాశాడు .ఇది ఆరు వేల లైన్ల కవిత ..సంకల్ప బలం తో దేనినైనా సాధించ వచ్చు అనేది ఇందులో సారాంశం ..కార్ లైల్ భార్య ఇదేమి కవిత్వం అంటే ,టెన్నిసన్ మొదటి చివరి పంక్తులు బాగున్నాయని దేప్పాడు .అవే -who will may hear Sodello ;s story told ”అనే మొదటిది ”who would has heard sordello;s story told”అనే రెండో లైనూ
ఇలా విమర్శలోచ్చినా మంచి రచన చేసి విజయం సాధించాలని నిశ్చయించాడు ..”పిప్పా పాస్సీ ”నాటిక రాశాడు .”కింగ్ వికార్ కింగ్ చార్లెస్ ”,రిటర్న్ ఆఫ్ ది ద్రూసేస్ ”,బ్లాట్ ఇన్ ది స్కచియాన్ ”కోలంబెస్ బర్త్ దే ”రాసి వదిలినా దేనికీ పేరు రానే లేదు .డ్రమాటిక్ . లిరిక్స్ డ్రమాటిక్ రొమాన్స్ అండ్ లిరిక్స్ రాశాడు .రెండవ సారి ఇటలీ వెళ్ళినప్పుడు షెల్లీ కీట్స్ సమాధులను సందర్శించాడు .ఈ స్పూర్తితో ”లేడీ జేరాల్డైన్స్ కోర్ట్ షిప్ ”రాశాడు
బ్రౌనింగ్ కుం ఆడ వాళ్ళపై వ్యామోహం కలగ లేదు ..ఒక వేళ అవకాసం వస్తే తన కంటే పెద్ద వాళ్ళ నే ప్రేమించాడు ఆరేళ్ళు పెద్దదయిన ఎలిజబెత్ బారెట్ తో లవ్ లెటర్స్ జరిపాడు అమె గ్రీకు లాటిన్ లలోన్ దిట్ట . తండ్రి క్రూరుడు బ్రౌ నింగ్ ను స్నేహితునిగా చూసింది ..ప్రెమా దోమా అంటే కుదరని చెప్పింది ..నలభై లొఆమె ఆరోగ్యం దెబ్బతింటే ఇటలీ తీసుకు వెళ్ళాడు ..నయమ్ అయింది .ఇద్దరు దగ్గరయ్యారు కొడుకు పుట్టాడు .”సానేట్స్ ఫ్రం పోర్చుగీస్ ”రాశాడు .ఇది ”లవర్స్ పాస్ వర్డ్ ”గా కొన్ని త రాలను ప్రభావితం చేసింది .వర్ద్స్ వర్త్ మరణం తో తనకు కు ఆస్థాన పదవి దక్కుతుందని ఆశించింది ఎలిజ బెత్ కాని టెన్నిసన్ కు దక్కింది . .భర్తకంటె పేరు ప్రఖ్యాతులు పొందింది ఒక రకం గా బ్రొనింగ్ ను బారెట్ భర్త అనేవారు .విక్తొరియన్ కాల రచయితలలో నగ్రగామి అని పించుకోండి ఎలిజ బెత్ .”డి క్రి ఆఫ్ డి చిల్ద్రెన్ ”,మ్యూసికల్ ఇన్స్ట్రుమెంట్స్ ”,ఆరోరా లీ మాత్రమె జనానికి గుర్తున్నాయి .
భార్య ప్రభావం నుండి బయట పడటానికి ఇటాలియన్ కవిత్వం వైపు వెళ్ళాడు .సాహిత్యమ్ లో ఇటలియే తన యూని వర్సిటి అన్నాడు .బ్రొనింగ్ కు తండ్రి తరఫునుంచి వచ్చిన డబ్బు కంటే భార్య సంపాదనలో లభించిందే ఎక్కువ ..వీరి కుటుంబ స్నేహితుడు జాన్ కెన్యా చనిపోయి వీరికి పదకొండు వేల పౌండ్ల డబ్బు ఇచ్చాడు ..బ్రొనింగ్ కు కొడుకు పుట్టాడు .విచరమ్ అలముకొంది .”మెన్ న్ అండ్ విమెన్ ”1855లో రాశాడు .ఇక రాసే వాటన్నిటిలో సంగీతం మేళ వించాడు .భార్య లోని కవిని మెచ్చాడు భర్త బ్రౌనింగ్ .ఫ్లా రెన్స్ లో ఆమె జబ్బు పడింది ..ఉబ్బస వ్యాధి బ్రౌనింగ్ ను పీడిస్తోంది చనిపోయింది తర్వాతా ఇరవై ఎనిమిదేళ్ళు బతికాడు .
”డ్రా మాటి స్ పెర్సానే ”1864లో రాసి ప్రచురించాడు .డెత్ ఇన్ ది మ డెసర్ట్ ,యూత్ అండ్ ఆర్ట్ ,చైనీస్ పజిల్ మొదలైనవి రాశాడు
డెత్ పునర్ముద్రణ పొందింది 1868లో ”రింగ్ అండ్ ది బుక్ ”తెచ్చాడు .ఒక రోజు మార్కెట్ కు వెడుతుంటే పదిహేడవశ తాబ్దికి చెందిన లాటిన్ పుస్తకం న పడింది దాన్ని ఆధారం గా రాశాడు తండ్రి చనిపోయిన తర్వాత ,భార్య మరణం తర్వాత రెండో పెళ్లి ఆలోచన చేయలేదు జోలియా వేట్ వుడ్ తో సన్నిహితం గా ఉన్నా హద్దులు దాట లేదు చివరి ఇరవై ఏళ్ళలో ఎన్నో రాసి ప్రచురించాడు ..ఒక నిష్ణాతుడైన సర్జన్ లా బాంక్ ప్రెసిడెంట్ లా కని పించేవాడు
1881లో మొదటి సారిగా బ్రౌనింగ్ సొసైటీ ఏర్పడింది .దీనికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటు ఎడిటర్ ఫ్రెడరిక్ జేమ్స్ ఫర్నివాల్ కారకుడు ఆ తర్వాత ఎన్నో క్లబ్బులు ,సొసైటీలు డిస్కషన్ గ్రూపులు ఏర్పడ్డాయి .దెబ్భై లో మాంచి హుషారుగా ఉన్నాడు .”డ్రమాటిక్ ఐడిల్స్ ”రాసి ముద్రించాడు .”ది ఇన్ ఆల్బం” రాశాడు .. ఇంకా ఎన్నో రాశాడు అయనలొని సృజన ఆగలేదు .లిబరల్ అయినా అన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరయ్యే వాడు .కొదుకు పైంటర్ అయి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు జలుబుతో ప్రారంభమై హార్ట్ ఎటాక్ తో 12-12-1889న నవ్వుతూ కను మూశాడు .వెస్ట్ మినిస్టర్ ఆబీ లో పోఎట్స్ కార్నర్ లో సమాధి చేశారు
బ్రౌనింగ్ ను ఆశా వాది అంటారు ”God is in heaven -all is right with the world ‘అన్నదే ఆయన తత్త్వం .అయనలొ గొప్ప టెక్నిక్ ఉంది ఛందస్సును విచ్చల విడిగా మార్చి రాశాడు ..సాహిత్యం లో గొప్ప శక్తి సంపన్నుడైన కవి గా బ్రౌనింగ్ నిలిచి పోయాడు ‘
Brounning;s restless energy is inherent in the incalculable range of his interests .he seems to have determined as G;k Chesterton observed ”to leave no spot of the cosmos unadorned by his poetry ”and he almost succeeded ”.
ఈ నాడు బ్రౌనింగ్ డ్రమాటిక్ మోనో లాగ్స్ నే బాగా అభిమానిస్తున్నారు అందులో వక్త స్వభావం ఖచ్చితం గా బయట పడుతుంది ఇవి సాలిలోక్వి లాగా కాకుండా పూర్తిగా పాత్రను ఆవిష్కరిస్తాయి మానవుని విషయం లో దైవ చేస్ట ల్ని తెలియ జేస్తాడు ఇలియట్ ,ఎజ్రా పౌండ్ లు ఈ మోనో లోగ్స్ ను బాగా వాడుకొని సుసంపన్నం చేశారు నాటకీయ కవిత్వాన్ని బ్రౌనింగ్ అద్భుతం గా తీర్చి దిద్ది మార్గ దర్శకుడైనాడు భార్యా భర్తలు స్పిరిట్య లిజం కు ఆకర్షితులైనారు .దీని ప్రభావం వలననే దృఢమైన కొడుకు ”పెన్ ”పుట్టాడు చివరి రచన ”అసలాండో ”బ్రౌనింగ్ మరణించిన రోజే పబ్లిష్ అవటం యాదృచ్చికం జీవితకాలం లో ఎన్నో అవార్డులు పొందాడు .లండన్ యూని వర్సిటి కి జీవితకాలం గవర్నర్ గా ఉన్నాడు . గ్లాస్గో కు లార్డ్ రెక్టార్ షిప్ కు ఆహ్వానించినా ఉపన్యాసాలివ్వాల్సి వస్తుందని వద్దన్నాడు .సుమారు అరవై రచనలు రాసి ప్రచురించిన సాహిత్య జీవి బ్రౌనింగ్
![]()
![]()

