పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41
పందొమ్మిదవ శతాబ్దం -చీకటి వెలుగులు
విక్టోరియన్ యుగాన్ని”వింత ”యుగం అని సాధారణం గా అంటారు ..చాలా సీరియస్ గా రాసిన వారూ చాలా సుందరం గా కమ్మగా రాసిన వారూ ఉన్నారు .జీవితాన్ని తేలిక గా తీసుకొని రాసిన వారూ ఉన్నారు .నీతికి నిబద్ధులైన వారు ,,అజాగ్రత్త గా ఉన్న వారు ఉన్నారు ..సమాజం లో తల్లులు భరించ రానిది ,ఆడపిల్లలు చదవకుండా విడిచి పెట్టనిదీ లేని కవిత్వం రాసి పేరు పొందిన వాడు టెన్నిసన్ కవి .కాలమ్ ,1870 .
విక్టోరియన్ కాలం లో పదవీ గౌరవాలే పరమార్ధాలు .దీనికె బెర్నార్డ్ షా ”సెవెన్ డేడ్లి వర్త్యూస్ ”అన్నాడు .మ ధ్య తరగతి ప్రజలు నీతికి పోరాడారు ..స్పెన్సర్ ”అభివృద్ధి అకస్మాత్తుగావచ్చేదికాక పోయినా అవసరమే ”అన్నాడు . భౌ తిక వాదాన్ని నియంత్రించక పొతే ప్రమాదం అన్న వారూ ఉన్నారు .కార్మిక న్యాయాలు ,ట్రేడ్ యూనియన్ ల హక్కులు ,సహకార సంస్థలు ,వాటి ఉద్యమాలు ,కామన్ వెల్త్ దేశాలలో ప్రపంచ సోదర భావం వంటివి చోటుచేసుకొన్నాయి .
lలఘు కవితలలలో మేటి అయిన ఆస్థానకవి -ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్
ఈ విరుద్ధ భావాలను కవిత్వం లో నింపిన వాడు ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ 6-8-1809లో లింకన్ షిర్ లోని సోమర్బై లో పన్నెండుగురు సంతానం లో నాలుగవ వాడుగా పుట్టాడు ..ఏడవ ఏట లౌత్ స్కూల్ కు పంపారు చదువు బాగా రావాలని హెడ్ మాస్టారు పిల్లల తలను పుస్తకాలతో బాదేవాడు ..పన్నెండు ఏళ్ళకే స్కూల్ వదిలి ,పందొమ్మిది వరకు తండ్రి దగ్గరే చదివాడు .తండ్రికి క్లాసిక్స్ అభిమానం అయితె కొడుకు హోరేస్ రాసిన ఓడ్స్ బట్టీ పట్టిన తరువాతే యూనివర్సిటీకి పంపాడు …తండ్రితమ్ముడి వలన మోసపోయి ఆస్తి పోగొట్టుకొని మూడీ గామారాడు .ఇద్దరు పిల్లలకు నరాల బలహీనత ..ఇంకొడు మత్తుమందు కు బానిస .యెప్పుడూ నెల మీదే పడి ఉండేవాడు ..ఈవిష యాలన్నీ కవిత్వం లో రాసుకొన్నాడు కవి టెన్నిసన్
చదవటం రాక ముందే టెన్నిసన్ కవిత్వం చెప్పాడు .యెనిమిదెడి ఏళ్ళకే బ్లాంక్ వేర్స్ లో ఆరువేల పంక్తుల మహా కావ్యాన్ని రాసిన చిన్నారి పెద్దకవి పద్నాలుగులో మిల్టన్ రాసిన ”సామ్సన్ అగోనిస్టెస్ ”.ను వ్యాఖ్యానించి వివరణా త్మకం గా రాసి విమర్శకుల జాబితాలో చేరాడు రెండు . నాటకాలు ”ఆర్మ గడాన్ ”అనే కవిత రాశాడు .దీనినె తర్వాతా మార్చి ”టిం బుక్టూ ”పేర ముద్రింఛి బహుమతి పొందాడు ..బైరాన్ మృతికి విచారించి ,అడవుల్లోకి వెళ్లి రాళ్ళ మీద ”బైరాన్ ఈజ్ డేడ్ ”అని రాసి మనసులోని బాధ పోగొట్టుకొన్నాడు ..సొదరుడు చార్లెస్ తోకలిసి ”పోయెమ్స్ బై టు బ్రదర్స్”రాసి అచ్చు వేశాడు ..ఇంకొ సోదరుడు ఫ్రెడరిక్ రాసిన నాలుగు కవితల్ని అరవై ఏళ్ళ తర్వాత ప్రసిద్ధ కవిగా పెరుపొందినా చేర్చి ”కలేక్టేడ్ వర్క్ ”లో చేర్చి ప్రచురించిన పెద్దమనసు టెన్నిసన్ ది
పందొమ్మిది లో చార్లెస్ తో కలిసి కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజి లో చేరి మెట్రిక్ పాస్ అయ్యాడు అక్కడే ఆనందం గా ఉండలేక ఇంటి మీద మనసు మల్లింది .”ది అపోజిల్స్ ”అనే క్లబ్ ను స్నేహితులతో కలిసి స్తాపించాడు ..సైన్సును అభిమానిన్చినా అందులో దూసుకు పోలేక పోయాడు.డి గ్రీ పొందకుండానే కేంబ్రిడ్జి ని వదిలేశాడు .అండర్ గ్రాడ్యు ఎట్ గా ఉండగానే”పోయెమ్స్ చీఫ్లీ లిరికల్ ”రాసి ముద్రించాడు .అతి గా ఉందనిపించినా తియ్యదనామ్ ఎక్కువైందని పించినా ”మారియానా ”,వంటి వాటిలో సంగీతం అలరించింది మూడేళ్ల తర్వాత మరో కవితా సంకలనం తెచ్చాడు ..కీట్స్ ను చీల్చి చెండాడిన వాడే దీన్నీ అదే ధోరణి లో విమర్శించాడు ..తన ఆత్మ గౌరవం దెబ్బ తిందని టెన్నిసన్ అనుకొన్నాడు .. ఉపయోగం లేనిదైనా అందులోని సంగీత ధ్వనులు మెచ్చ కుండా ఉండలేక పోయారు
ఇరవై మూడులో హెన్రి ఆలం అనే చరిత్ర పరిశోధకుడు ,తండ్రి ముఖ్య స్నేహితుడు అనుకోకుండా హోటల్ రూం లో రక్తం గడ్డ కట్టి చనిపోతే చలించిపోయి , బయటికి రాలేక పోతున్నాడు .అయన పై ”ఇన్ మెమోరియం ”అనే కవిత రాశాడు ..దేవుడు అంటే ఏమిటో కొంచెం అవగాహనకు వచ్చాడు . కీట్స్ ,మిల్టన్ ల ఎలిజీ ల లాగా కాకుండా దీన్ని స్వీయ భావ ప్రకటన గా రాశాడు .ఇది కవిత మాత్రమె కాని జీవిత చరిత్ర కాదని చెప్పాడు .”ring out ,wild bells to the wild sky -the flying cloud ,the frosty light -the year is dying in the night -ring out ,wild bells ,and let him die ”
”ring out the old ,ring in the new -ring ,happy bells ,across the snow -the year is going ,let him go -ring out the false ,ring the true ”.. అనేవి అందరూ తరచుగా వాడే వె అంతగా జనం లోకి చొచ్చుకు పోయింది ..సొదరుడు చార్లెస్ కు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాతా నల్ల మందుకు అలవాటు పడ టం తో కాన్సిలయింది ..టె న్నిసన్ పద్నాలుగేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఎమిలీ ని పెళ్లి చేసుకొన్నాడు …ఈ హుషారులో మెమోరియం విడుదల చేశాడు అదే సమయం లో వర్డ్స్ వర్త్ కవి చని పోవటం తో ఆస్థానకవి గా టెన్నిసన్ నియమింప బడ్డాడు ..పుట్టిన కొడుకుకు ”హల్లాం ”పేరు పెట్టాడు ..ఇన్ని విజయాలు సాధించినా టెన్నిసన్ ప్రజల కవి అని పించుకో లేక పోయాడు .కాని విద్యావంతులలో ప్రముఖుడు గా నిలిచాడు అయిదేళ్ళ తర్వాత ”ది ప్రిన్సెస్” రాసి ప్రచురించాడు ..ఇన్దులొ సంగీతాన్ని స్త్రీ సమస్యలతో మేళ వించాడు .. ఇవాళ దీన్ని పట్టించుకొనే వారెవరూ లేరు
దంపతులు ఐల్ ఆఫ్ వైట్ లో స్తిరపడ్డారు .”టు సేక్రేడ్ పైప్స్ ”’రాశాడు 1855 లో రాసిన ”మౌడ్”ను మెలోడ్రామ గా వదిలాడు అది ”చిన్న హామ్లెట్ ”అని చెప్పుకొన్నాడు .కని పసలేదన్నారు .”ఐడిల్స్ ఆఫ్ ది కింగ్”రాసి అందులో ఆరవ శతాబ్దానికి చెందినా ఆడ మగ వారిని గురించి ”క్వీన్ ఈనోక్ ఆర్డెన్ ”గురించి రాశాడు .చివరి కాలం లో టెన్నిసన్ అత్యుత్తమ కవిత రాశాడు .దెబ్భై లో ”బలడ్స్ అండ్ ఆదర్ పోయెమ్స్”రాశాడు .ఇప్పుదె అనేక గౌరవాలు అందుకొన్నాడు ఽఅక్స్ ఫర్డ్ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది గ్లాస్గో యూని వర్సిటి రెక్తార్శిప్ ఇస్తానంటే తిరస్క రించాడు ..ప్రధాని గ్లాడ్ స్టన్ తో కలిసి నార్వే డెన్మార్క్ టూర్ చేశాడు ..యెనభై లో నరాల బలహీనత తో గౌట్ వచ్చింది ..ఇన్ఫ్ల్యు ఎంజా సోకింది .ఱచన మాత్రం మాన లేదు .ప్రూ ఫులు సరిదిద్దుతూనే ఉన్నాడు .”సిమ్బలీన్ ”లో ఒక పాసేజి పై చూపుడు వ్రేలిని ఉంచి చూస్తూ 6-10-1892అర్ధ రాత్రి మరణించాడు ఽఅయన శవ పేటిక లో షేక్స్ పియర్ నాటకాన్ని ఉంచి వెస్ట్ మినిస్టర్ ఆబ్బె లో గౌరవ లాంచనాలతో సమాధి చేశారు .
ఆ కాలం లో బాగా ప్రాచుర్యం పొంది ,బాగా చదవ బడిన కవి టెన్నిసన్ మార్గ దర్శి కాదుకాని పూర్వకవుల దారిలో పయనించి గొప్ప కవితా సేద్యం చేసి మంచి పంటలే పండించాడు”he was one of the best and one of the worst of poets” అంటారు .సెంటి మెంట్ ను ఎక్కువ గా వాడుకొన్నాడు.”what does little birdie say -in her nest at peep of day?-let me fly ,says little birdie -mother ,let me fly ” అనే లైన్లు అందరి మనస్సులో ఉండిపోయాయి .టె న్నిసన్ ను ”a cross between the traditional ministrel and the conventional maiden aunt ” అని ఆట పట్టించారు టెన్నిసన్ కు జనాన్ని తనతో లాక్కుపోయే కవితా బలం లేదంటారు .చివరగా”if the style was not the complete man ,it was the expression of the artist who was a perfectionist in verbal felicities .few poets have had a finer ear for the delicate nuances of sound ,and still fewer have surpassed Tennyson;s undulating ease ,his limpid lyricism ,and some times matchless music ”.
రాసిన ప్రతిదానినీ పెర్ఫెక్షన్ కోసం అనేక మార్లు మార్చి రాసిన ఏకైక కవి టెన్నిసన్ గ్రీకు ,లాటిన్ కవిత్వం లోని నాణ్యమైన భావనలను ఛందస్సును చక్కగా ఉపయోగించుకొన్నాడు విక్టోరియన్ కవులలో క్రమ పధ్ధతి భావాలను అనుసరించి ఉత్తమ కవి గా భాసించాడు .తన కవిత్వం తో ప్రేరణ కల్గించలేక పోయినా వ్యక్తిత్వం తో ప్రభావితం చేశాడు జీవితాన్తమ్ డిప్రెషన్ తో బాధ పడుతున్నా కవితాధార ఆగిపోనీకుండా ఇంకి పోనీకుండా కాపాడుకొన్నాడు .”saddest of all English poets ”whose technical mastery of verse and language proved a surface to his poetry;s depth to the abyss of sorrow ” అని ఇలియట్ కవి టెన్నిసన్ కవి పై ముద్ర వేశాడు . సుమారు నలభై దాక రచనలు చేశాడు
సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14–కాంప్ -మల్లాపూర్ -హైదరా బాద్

