మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్
బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్ దగ్గర పైరా బంద్ లో జన్మించింది .తండ్రి జహీరుద్దీన్ మొహమ్మద్ ఆబూ ఆలి హైదర్ సేబార్ పెద్ద జమీందార్ మాత్రమె కాక గొప్ప విద్యా వేత్త . రోకియాకు ఇద్దరు సోదరిలు ముగ్గురు సోదరులున్నారు .పెద్దన్న ఇబ్రహీం ,పెద్ద చెల్లెలు కరీమున్నీసా ల ప్రభావం ఈమెపైన ఎక్కువ గా ఉండేది .కరీమున్నీసాకు బెంగాలీ భాష లో చదువుకోవాలని ఉన్నా తలి దండ్రులకు మాత్రం ఆరేబిక్ ,పర్షియా భాషలల మాధ్యమం లో చదువు నేర్వాలని కోరారు .ఇబ్రహీం తన ఇద్దరు చెల్లెళ్ళు రోకియా ,కరీమున్నేసా లకు ఇంగ్లీష్ ,బెంగాలీ భాషలు నేర్పాడు .వీరిద్దరూ గొప్ప రచయిత్రులయ్యారు .
కరీమున్నీసా పద్నాలుగవ ఏటనే వివాహం చేసుకొని కవయిత్రి గా ప్రసిద్ధి చెందింది .ఆమె కుమారులిద్దరూ బ్రిటిష్ ప్రభుత్వం లో మంత్రులుగా పని చేశారు . రోకియా 1896లో పదహారవ ఏట ఉర్దూ భాషాభిమాని అయిన ఖాన్ బహదూర్ షెఖావత్ హుసేన్ ను వివాహ మాడింది .ఆయన భారత దేశం లోని బీహార్ రాష్ట్రానికి చెందిన భాగల్పూర్ జిల్లాకు డిప్యూటీ మేజిస్ట్రేట్ గా పని చేసేవాడు .భర్త ప్రోత్సాహం తో బెంగాలీ ,ఇంగ్లీష్ లను నేర్చుకొన్నది .ఆ నాటి జన సామాన్య భాష అయిన బెంగాలీనే ప్రధాన భాష గా ఎంచు కొని లోనే రచనలు చేయాని ,దానివలననే తన మనోభావాల వ్యాప్తి జరుగుతుందని భావించింది .1902లో మొదటి వ్యాసం ‘’పిపాస ‘’(దాహం )బెంగాలీ భాష లో రాయటం తో ఆమె రచనా రంగ ప్రవేశం చేసింది .
1909లో భర్త హుసేన్ మరణిస్తూ కొంత డబ్బు తీసి ఉంచి ఆ ధనం తో మహిళలకు పాఠశాలను ఏర్పాటు చేయమనికోరాడు .ఆయన కోరికను తీరుస్తూ అయిదు నెలల తర్వాత ‘’సఖావ త్ మోరియల్ గర్ల్స్ హైస్కూల్‘’ను స్థాపించి భర్త ఆత్మకు శాంతి చేకూర్చింది .ఇప్పటికీ ఈ విద్యాలయం విద్యా సేవ చేస్తూండటం ముదావహం . మహిళలు ధైర్యం గా ముందుకు రావాలని ,సంస్కరణలలో పాలుపంచుకోవాలని రోకియా అభిలషించింది .కాని ఆ నాటి సంప్రదాయ కుటుంబాలు అంత ధైర్యం చేయలేక పోయాయి .కనుక ఆమే ఆశించిన సంస్కరణ నెమ్మదిగా నే సాగింది
1916లో ‘’ముస్లిం మహిళా సంఘం ‘’ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ,ఉద్యోగానికి దోహదం చేసింది .1926లో కలకత్తా లో జరిగిన ‘’బెంగాలీ మహిళా విద్యా సదస్సు ‘’కు అధ్యక్షత వహించింది .దీనితో మహిళా విద్యా ప్రాదాన్యాన్ని అందరికీ తెలియ జేసింది .ఇలాంటి ఎన్నో సదస్సులలో చర్చలలో పాల్గొని మహిళా హక్కులకోసం పోరాడిన ధీర వనితరోకియా బేగం .
.దీనితో రోకియా మొదటి ముస్లిం స్త్రీ వాద మహిళా గా గుర్తింపు పొందింది ..కొరాన్ లో చెప్పబడిన మత పద్ధతులను పాటించాలనే ఆమె అందరికి చెప్పేది ‘’.అంజుమాన్ ఏ ఖవాతీన్ ఏ ఇస్లాం ‘’ సంస్థ ముస్లిం లను పెడమార్గం పట్టిస్తోందని విమర్శించేది .జీవితాంతం త్తనుస్తాపించిన సూల్ అభి వ్రుద్ధికోసం కృషి చేస్తూ ,తన మనోభావ వ్యాప్తికి రచనలు చేసింది .9-12-1932న 52వ ఏట బేగం గుండె జబ్బుతో మరణించింది .ఆమె మరణించిన డిసెంబర్ తొమ్మిదవ తేదీని ‘’రోకియా దినం ‘’(రోకియా డే)గా బంగ్లాదేశ్ ప్రభుత్వం గౌరవం గా నిర్వహిస్తోంది ముస్లిం స్త్రీలు పరదా నుండి బయట పాడాలన్న ఆమె పోరాటం నెమ్మదిగా విజయ వంతమై అన్నిట్లో మహిళా ప్రాధాన్యత పెరిగింది .స్త్రీ సాంఘిక ఉన్నతి సాధించాలన్న ఆమె వాచితం నేర వేరింది .ఇంటింటి కీ తిరిగి తలిదండ్రులను ఒప్పించి స్కూల్లో చేర్పించింది . స్కూలు లో కూడా పరదా ఉంటుందని నచ్చ చెప్పింది .
ముస్లిం మహిలలో సాంఘిక భద్రత కలిపించటం ,వారిలో సాన్ఘియా సంస్కరణాభిలాష రగుల్కొల్పటం కోసం తీవ్రం గా రోకియా పని చేసింది .దీనికోసం కధలు ,వ్యాసాలూ ,నవలలు పుంఖాను పుంఖం గా రాసింది .బెంగాలీ భాష మాట్లాడే ముస్లిం మహిళల కస్టాలు ,సమస్యలు ,అణచ బడే మతాచారాలు ఇస్లాం మతాన్ని స్వార్ధం కోసం వాడుకొనే వారి పట్ల అసహనం ,కనీస మానవత్వం చూపించని సంఘ పెద్దలను ఆమె రచనల్లో వ్యంగ్యం ,అధిక్షేపణ ,లతో అలిపి ఎండ గట్టింది .ముస్లిం పురుషులతో బాటు స్త్రీలూ సమాన హక్కులు కల్పించాలని పోరాడింది .మతం పేరిట ముస్లిం మహిళలను చదువుకు దూరం చేయటం ఆమె సహించలేదు .ఇస్లాం మతం లో మహిళలు చదువు కో కూడదని ఎక్కడా లేదని తెలియ జెప్పింది .
పిపాస అనే వ్యాసం కాక మోతీచూర్ అనే రెండు సంపుటాల వ్యాసాలూ ,దేలీసియా హత్యా ,జ్వన్ ఫల్ ,నారీ సృష్టి ,నర్స్ నేల్లీ ముక్తిఫల్ ,సుల్తాన్స్ డ్రీం ,సావోగాట్ అనే పద్య సంపుటి ,పద్మరాగ్ అనే స్త్రీ వాద ధోరణి రచన ,అవరోధా భాషిని ,బోలిగార్తో అనే కధ ,నారీర్ అధికార్ ,గాడ్ గివ్స్ మాన్ రోబ్స్,ఎడ్యు కేషన్ ఐడియల్స్ ఫర్ దిమోడరన్ ఇండియన్ గర్ల్ ,మొదలైన వైవిద్య భరిత రచనలను కవిత్వం, కధలు ,నవలా ,వ్యాసం, లాజిక్ ,ఆలోచనసంస్కరణ,అభివృద్ధి ,ముందు చూపు ,సమానత్వం ,మహిళాహక్కు లను మేళవించి రాసింది
You have moulded me from childhood.. your love is sweeter than honey which after all has a bitter after-taste; it is pure and divine like Kausar [the stream of nectar following in heaven mentioned in the Qur’an].
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు
, .

