నా దారి తీరు -82
బదిలీకో ఉపాయం
ఆ రోజుల్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ ఉ వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాకు ముందే ముట్ట చెప్పాల్సిని ముట్ట చెప్పి కమ్యూటేడ్ లీవ్ ఆయన సలహాపై రెండు నెలలు పెట్టి ఇంట్లో కూర్చోవాలి .పది హీను రోజులు దాటగానే మళ్ళీ వెంటపడి ఆరోగ్యం బాగానే ఉందని మీడియాల్ సర్తిఫికేట్ సంపాదించి అంట దూరం లో పని చేయ లేనని స్వగ్రామం దగ్గరకు బదిలీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి .గుమాస్తాను ముందే మెయింటేన్ చేస్తే వెంటనే అన్సిదర్ చేసి ఖాళీ ఎక్కడుందో చెప్పి వీలయితే రాజీయ ప్రయత్నం చేయమని చెప్పి ,ఆ హాలీలో ఎవరినీ నిమ్పకుమ్డా చూసి మనకు దక్కెట్లు చేస్తారు .అలాగే మ బి ఇ డి గుమాస్తా ‘’రాజు గారిని ‘’ప్రసన్నం చేసుకొని , రాజీయ ప్రయత్నాలతో బాటు ,కృష్ణాజిల్లాటీచర్స్ గిల్డ్ నాయకులను ఇంఫ్లుఎంస్ చేశాను .అప్పుడుగిల్డ్ ప్రెసిడెంట్ గా ఉన్న గన్నవరం హిందీపండిట్ శ్రీ తోటకూర అప్పరాయ వర్మ(తానా అధ్యక్షుడుగా పనిచేసిన ప్రసాద్ తోటకూర గారి తండ్రి )నయు కొల్లూరి తర్వాత ముఖ్యమైన ఆత్మీయులు .ఆయన్ను అలిసి చెప్పాను ఆయనకు నేనంటే గొప్ప అభిమానం .అన్డుఅని తప్పక తన వంతు సాయం చేస్తానన్నారు .ఆయను జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గర మంచి చనువు గౌరవాలున్నాయి ఆయన మాటు విలువ నిచ్చేవారు చైర్మన్ గారు .అది నాకు ఒక రకం గా కలిసోచ్చింది .నేను నా ప్రయత్నాన్నిగట్టిగానే చేశాను .ఉయ్యూరు నుంచి పెనుగాంచి ప్రోలుకు రావాలంటే ఉదయాన నాలుగింటికే లేచి ప్రభావతి అన్నం వండి టిఫిన్ చేసి కూరా నారా చేసి కారియర్లో సర్ది ఇస్తే బస్ లో బయల్దేరి బేజా వాడ చేరి అకడి నుండి నందిగామ బస్ కో దొరక్క పొతే జగ్గయ్య పేట బస్సో ఎక్కి చిల్లకల్లు దిగి ,అక్కడి నుండి పెనుగంచిప్రోలు షటిల్ ఎక్కి వెళ్ళేవాడిని .చాలా రిస్క్ అయిన ప్రయాణం .ఓపిగ్గా చేసేవాడిని.ప్రభావతి పడిన శ్రమ అంతా ఇంతా కాదు .
శ్రీ తిరుమల గిరి క్షేత్రం –వెలమకన్ని వారి ఊసులు
.పెనుగంచిప్రోలు నుండి మక్క పేట మీదుగా జగ్గయ్య పేట కు వెళ్ళే దారిలో ‘’తిరుమల గిరి ‘’అనే క్షేత్రం ఉంది .చిన్న కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు . .ఈ ప్రాంతం వారికి దాదాపు తిరుపతి తిరుమల లాంటిది .మహిమ గల దేవునిగా భావించి ఆరాధిస్తారు .చిల్లకల్లుకు అయిదు కిలో మీటర్ల దూరం. ఆటోలో వెళ్ళాలి .చాలా ప్రశాంత వాతావరణం లో ఆలయం ఉంటుంది .ఒక సారి వెళ్లి దర్శించు కొన్నాను .ఇక్కడే మా కజిన్ బ్రదర్స్ వెలమకన్ని శోభ నాద్రి సోదరులకు వందల ఎకరాల పొలం ఉంది .దీనిలో పంటలు పండేవి కావు .పశువుల మేతకు ఉపయోగపడే పుల్లరి భూములు .ఉయ్యూరు చుట్ట్టు ప్రాల ప్రాంతాలనుండి గొడ్లను తోలుకొని వచ్చి ,పుల్లరి చెల్లించి మేపుకొని మళ్ళీ ఇళ్ళకు తోలుకు వెడతారు .మా మామయ్యగారి ఎడ్లూ ,పశువులు అలాగే ఇక్కడికి తోలుకొచ్చి మేపేవారు పాలేళ్ళు . బక్క చిక్కిన పశువులు మోకాలు ఎత్తు పెరిగిన పచ్చ గడ్డిలో మేసి బాగా బలిసి మళ్ళీ ఇళ్ళకు చేరేవి .ఆ కాలం లో ఒక పాలేరు ఇక్కడే ఉండేవాడు .లేక వీరే కాపలా కాయించి డబ్బు తీసుకొనే వారు .
వీరిది జగ్గయ్య పేట కు ముత్యాల దాటినా తర్వాత ‘’శోభ నాద్రిగూడెం అగ్రహారం ‘’ఆక్కడా స్వంత ఇల్లు మెట్టా ,మాగాణి పొలాలు వేల కొలదిల ఎకరాలున్నాయి .అగ్రహారం అంతా వెలమకన్ని వారిదే .స్వంత వ్యవసాయం నౌకర్లు, చాకర్లు పాలేళ్ళు గొడ్లు గోదా బోలెడు లంపటం ఉంది .శోభనాద్రి మామ్మ ,మా మామ్మ స్వయానా ఆ క్కచెల్లెళ్ళు .అంటే మేము అక్క చెల్లెళ్ళ మనుమలం అన్న మాట .మా మామ్మ చెల్లెలు సూరి సౌభాగ్యమ్మఅంటే మా బుల్లిమామ్మ గారిది ఉయ్యూరు .ఆమె చిన్న కొడుకే సూరి లక్ష్మణస్వామి బాబాయి . ఆయన్ను వెలమకన్ని వారికి పెంపుడు ఇచ్చింది మామ్మ .ఆయన భార్య సత్యవతి పిన్ని .బాగా స్థితి పరుదవటం వలన దాయాదులు అసహనం తో లక్ష్మణ స్వామి బాబాయికి ఒక కూతురు శారదక్కయ్య, ఇద్దరు కొడుకులు శోభనాద్రి ,రాముడు పుట్టిన తర్వాత ఉదయాన బహిర్భూమికి వెళ్లి వస్తుంటే తుపాకి తో కాల్చి చంపేశారు ఆయనూ లసేన్స్ద్ తుపాకీ ఉండేదట .ఆ రోజు పొరబాటున తీసుకు వెళ్ళటం మరిచిపోయాడట .అదే అదునుగా దాయాదులు కిరాయి మనిషి తో ఆల్చి చంపించారు .ఈ ముగ్గురు పిల్లలూ చిన్న వారే .వారిని పోషించుకొంటూ వ్యవహారాలను చూస్తూ వ్యవసాయం చేయిస్తూ కోర్టు లలో వ్యాజ్యాలు గెలుస్తూ సత్య వతి పిన్ని పడిన కస్టాలు అంతులేనివి . ఒంటి చేతిమీద ఇన్ని వ్యవహారాలను చక్క పెట్టింది పిన్ని .శారదక్కయ్యనుబెజవాడలో ప్రఖ్యాత లాయర్ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారి పెద్ద కొడుకు లా చదివిన రామ చంద్ర మూర్తికిచ్చి వివాహం చేసింది పిన్ని .ఈ శారదా రామచంద్ర మూర్తి అక్కయ్యా బావ లనే ఈ నెల తొమ్మిదో తేదీ మేము హైదరాబాద్ లో తిరుమల గిరి లోని వాళ్ళబ్బాయి లక్ష్మణ స్వామి స్వంత ఇంట్లో కలిసి వచ్చాం .ఆయనకు తొంభై ,అక్కయ్యకు ఎనభై అయిదేళ్ళు .ఇద్దరూ మంచి ఆరోగ్యం గానే ఉన్నారు .తలిదండ్రులను కంటికి రెప్పలాగా చూసు కొంటూ అండగా ఉన్నాడు లక్ష్మణ్ .శోభనాద్రి ,రాముడు నాకు బెజ వాడలో ఇంటర్ లో క్లాస్స్ మేట్స్ . రాముడి పెళ్ళికి శోభనాద్రి గూడెం మొదటి సారి వెళ్లాను మా మామయ్యా గారబ్బాయి పద్మనాభం తో .. శోభనాద్రి గూడెం లో ఉన్న పొలాలు పులి చింతల ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తీసుకొని గొప్ప పరిహారం ఇచ్చింది అయిదేళ్ళ రక్రితం శోభనాద్రి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు రాముడికి ముందే వచ్చినా డాక్టర్ రమేష్ చేసిన ఆపరేషన్ వలన ఆరోగ్యం పొందాడు .వాడి పెద్దకొడుకు శోభనాద్రిపురం లో పోస్ట్ మాస్టర్ గా ఉంటూ ,కుటుంబం తో ఉండి వ్యవసాయం చేయిస్తున్నాడు .రెండు మూడులలో ఒకడు లాయర్ గా తిరుమల గిరిలో ఉన్నాడు .మూడోవాడు హైదరాబాద్ లో మంచి ఉద్యోగి .రాముడు జగ్గయ్య పేట సీతారామ పురం లో స్వంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు .శోభానాద్రికి ముగ్గురూ ఆడపిల్లలే. పెళ్ళిళ్ళు చేసిన తర్వాతే చనిపోయాడు .భార్య నందిగామ లో ఉంటోంది . శోభనాద్రి గూడెం లో వరి తక్కు వ గా పండేది .వేరు సెనగ ,పొగాకు ,పత్తి పంటలు పుష్కలం . మిర్చి బాగా పండేది .శోభనాద్రి మా ఉయ్యూరుకు వచ్చి ఎండు గడ్డి కొనుక్కొని లారీల మీద తోలుకు వెళ్ళేవాడు .
ఆత్కూరు కు బదిలీ
నేను పెట్టిన కమ్మ్యూ టెడ్ లీవ్ ను శాంక్షన్ చేసి సెలవలో ఉన్న నన్ను గన్నవరం దగ్గరున్న ఆత్కూరు హై స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేశారు .అది ఒక మెటర్నిటీ లీవ్లో వెళ్ళిన ఒకావిడ పోస్ట్ .అందులో వేశారు . నేను పెనుగంచిప్రోలులో గట్టిగా పని చేసింది నాలుగు నెలలే .సెలవలు ఒక ఇరవై అయిదు రోజులు .సెలవలలోనే వచ్చి పెనుగంచిప్రోలులో 11-2-86న రిలీవ్ అయ్యాను ఒక రోజు ట్రాన్సిట్ వాడుకొని .13-2-86 ఉదయం ఆత్కూరు హైస్కూల్ లో చేరాను .హెడ్ మాస్టారు శ్రీ ఆళ్ళ కోటేశ్వర రావు గారు .ఇదీ మూడు నాళ్ళ ముచ్చటే అయింది .ఒక రకం గా ణా పని పెనం లోంచి పొయ్యిలో పడ్డ చందం అయింది .ఆ వివరాలు తరువాత తెలియ జేస్తాను . సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-14-ఉయ్యూరు .

