నా దారి తీరు .-83
ఆత్కూరు ఉద్యోగం
ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి .అదీ తొమ్మిదిన్నర కి అక్కడ ఉండాలి .కంకి పాడు లో బస్ అందుకోవటం ,అక్కడ జంక్షన్ బస్ పట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉండేది .ఇంటి దగ్గర సుమారు ఏడున్నరే బయల్దేరాల్సి వచ్చేది .అప్పటీ ప్రభావతి అన్నం వగైరా వండి రెడీ చేస్తే ఇంత’’కతికి ‘’ఆదరా బాదరా ముక్కూ నోటా కుక్కుకొని వెళ్ళే వాడిని .వీలయితే టిఫిన్ కూడా మధ్యాహ్నానికి తయారు చేసిచ్చేది .ఆక్కడ పని చేసినంత కాలం ఉరుకులూ ,పరుగుల జీవితమే అయింది .సాయంత్రం నాలుగున్నరు స్కూ ల్ అయిపోగానే అక్కడి నుంచి నడిచి సెంటర్ కు వచ్చి గన్నవరం వెళ్ళే బస్ పట్టుకొని ,అక్కడి నుంచి కంకి పాడు బస్సుఎక్కి అక్కడ దిగి ఉయ్యూరు వెళ్ళే బస్ అందు కోవాలి .ఇప్పుడున్నంత బస్ ఫ్రీక్వేన్సీ ఆ రోజుల్లో ఉండేవి కావు .చాల ఇబ్బందులు పడాల్సి వచ్చేది .ముఖ్యం గా గన్నవరం నుండి బయటం పడటం మహా ఇబ్బంది గా ఉండేది .బస్ లు దొరక పొతే గన్నవరం దగ్గర యెర్ర మట్టి లారీలు లేక కంకర లారీలు ఎక్కి రావాల్సి వచ్చేది . కాబిన్ లో ఖాళీ లేక పొతే పైన కూర్చోవాల్సి వచ్చేది .బట్టలన్నీ యెర్ర దుమ్ముతో నిండిపోయేవి ఇంటికొచ్చేసరికి .ఇదీ ఆత్కూరు ఉద్యోగం ‘’సౌఢభ్యం ‘’
అక్కడ చేరిన మర్నాడే సాయంత్రం గన్నవరం లో దిగి హైస్కూల్ దగ్గర రోడ్డులో ఉన్న శ్రీ అప్పరాయ వర్మ గారింటికి వెళ్లి కలిసి చేరినట్లు చెప్పి ధన్యవాదాలు తెలియ జేశాను. ఆయనా సంతోషించారు .హెడ్ మాస్టారు చాలా మంచివారని సిన్సియర్ అని డ్యూటీ మైండెడ్ అని చెప్పారు .అంటే ఆయన్ను మెప్పించటం అంత సులువు కాదని చెప్పకనే చెప్పినట్లు . హెడ్ కోటేశ్వరరావు గారు తెల్లని మల్లెపూవు లాంటి గ్లాసో పంచె తెల్ల చొక్కా తో ఉండేవారు .ముందు రెండుపళ్ళమధ్య కొద్దిఎడం .నవ్వు ముహం లో కనిపించేది కాదు .సీరియస్ గా ఉన్దేవారేప్పుడూ .అంతా టైం ప్రకారం నిర్దుష్టం గా జరగాలని కోరేవారు .అలాగే జరిపేవారు .ఇంగ్లీష్ చెప్పేవారు .సోషల్ మేష్టారు వెంకటేశ్వర రావు ప్రక్కనే ఉన్న పేద అవుటుపల్లి గ్రామస్తుడు .రోజూ సైయిల్ మీద ఆక్కడినుంచే వచ్చేవారు .సరదామనిషి .హెడ్ గారీ తలలో నాలుక .పెదవుతూ పల్లి లో జోసెఫ్ తంబి ఆశ్రమం ఉంది ఆయన ఆరాధనోత్సవాలు ఘనం గా నిర్వహిస్తారు .అకడ మిషన్ గర్ల్స్ స్కూల్ ఉంది .
సైన్స్ మేష్టారు హనుమంత రావు ఏలూరు వర్క్ షాప్ లో చాలా ఏళ్ళ క్రితం పరిచయమైనా వాడు .లాబ్ ఇంచార్జ్ .లాబ్ కూడా పెద్దదే .హార్ట్ పేషెంట్ అనిజ్ఞాపకం .మంచి స్నేహితుడు .లంచ్ టైం లో ఇంటికి స్కూటర్ మీద తీసుకోని వెళ్లి భార్య తో టిఫిన్ చేయించి టీ తో సహా ఇచ్చేవాడు .ఆవిడా చాలా సంస్కారం తో అన్నయ్యగారూ అంటూ ఆప్యాయం గా పలకరించేది .ఇద్దరు పిల్లలని గుర్తు .వాళ్ళూ సరదాగా ఉండేవారు .అలాగే ఒక జూనియర్ తెలుగు పండిట్ విజయ లక్ష్మి అని గుర్తు .స్కూల్ లో ఖాళీ పీరియడ్స్ లో చాలా ఆత్మీయంగా మాట్లాడేది .వాళ్ళ ఆయన అక్కడ పోస్ట్ మాస్టారు .ఆమె కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించి టిఫిన్ చేసి పెట్టేది .స్కూల్ కు కాఫీ ఫ్లాస్ తీసుకొచ్చి నాకు కూడా కాఫీ ఇచ్చేది .ఇలాంటి ఆత్మీయులు ఇక్కడ లభించటం నా అదృష్టం . అలాగే వాలేశ్వర రావు గారనే సెకండరీ గ్రేడ్ టీచర్ నల్లగా లావుగా తెల్లటి నేత పంచె చొక్కా ఉత్తరీయం తో ఉండేవారు .గొప్పకవి .మా ఇద్దరికీ ఖాళీ దొరికితే సాహిత్యం తో కాలక్షేపం చేసేవాళ్ళం .ఆయన రాసిన పద్యాలు వినిపించేవారు .చాలా ధారా శుద్ధితో పద్య రచన చేశారు .విశ్వనాధ వారి శిష్యులు కూడా .విశ్వనాధ అంటే వీరాభిమానం ఆయనకు .నాకూ అంతే కనుక మా సాన్నిహిత్యం మరీ ఎక్కువైంది .అయన రిటైర్ అయి బెజవాడ దగ్గర ముత్యాలంపాడు లో ఉండేవారు .ఒక సారి ఉయ్యూరు వచ్చిమా ఇంటికి వచ్చారు .అప్పుడు మా శ్రీమతి ఊర్లో లేదు .నేనే వండు కుంటు న్నాను .కనుక ఆతిధ్యం ఇవ్వలేకపోయాను కాని ఉయ్యూరులో శివాలయ అర్చకుడు రాఫ్ట్ మేష్టారు నా శిష్యుడు మామిళ్ళ పల్లి సోమేశ్వర రాకు బంధువులు ఆయన .వాళ్ళ ఇంటికే వచ్చానని అక్కడే భోజనం చేస్తానని చెప్పారు .ఉయ్యూరు లో సాహితీ మండలిని మా గురువుగారు స్వర్గీయ లంకా బసవా చారి మేష్టారు మా అందరితో కలిపి ప్రారంభించిన రెండు మూడేళ్ళ తర్వాత జరిపిన కవి సమ్మేళనాలలో వాలేశ్వర రావు గారిని వచ్చి పాల్గొన మని కోరేవాళ్ళం. వచ్చి చక్కని చికని కవిత్వం రాసి వినిపించేవారు .తను రాసిన పద్యాల పుస్తకాలు అందరికీ ఇచ్చేవారు .ఆత్కూరు లో గబ్బిట వారున్నారు .ఒక సరి వారింటికి వెళ్లాను .ఎప్పుడో తరాలు విడిపోయిన వారు .కూరాడలో బందర్లో ఆత్కూరులో ఉండే వీరిని ఆ ఊరి గబ్బిట వారుగా పేర్కొంటారు .స్కూల్ లో అటెండరు పాలు తెచ్చి ఆఫీ డికా షన్ వేసి ఇంటర్వెల్ లో కలిపిందరికి ఇచ్చేవాడు నేల అవగానే లెక్క చూసి అందరికీ డబ్బు సమానం గా వేసి వసూలు చేసేవాడు .ఇంకో లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు దీన్ని పర్య వేక్షించేవాడు ఈయనా చాల మంచివాడు తర్వాత అక్కడే హెడ్ మాస్టర్ గా పని చేశాడు .
స్కూల్ లో ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు నాతొ చాలా క్లో జ్ గా ఉండేవారు .వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి ఆతిధ్యం ఇచ్చేవారు .చాలా సరదా మనుషులు .స్కూల్ దగ్గర ఒక మామిడి తోట ఉండేది .అందులో పనస చెట్లు విరగ కాసేవి .నాకు ఆ కాయలు తెప్పించి ఇచ్చేవారు . ఇంటికి తీసుకోచ్చేవాడిని .డ్రిల్ మాస్టారు జగన్మోహన రావు .ఆ ఊరివాడే .పంచె కట్టుతో సోడా బుడ్డి కళ్ళ అద్దాలతో ఉండేవాడు .హెడ్ గారి టైల్ .లెక్కల మేష్టారు నల్లగా వెడల్పు ముఖం తో సఫారీ బట్టలతో ఉండే జగన్మోహన రావు .ఈయన రుద్రపాక హెడ్ మాస్టారు ఈడుపు గంటి వెంకటేశ్వర రావు గారి తమ్ముడూ ,డ్రిల్ మేస్టారూ అయిన రత్తయ్య గారి అల్లుడు .అప్పుడప్పుడు వచ్చి కనిపించి వెళ్ళే వాడు రత్తయ్య గారు .ఆయన మనవడు నైంత్ క్లాస్ ఇకడే స్కూల్ లో చదువుతున్నాడు .మంచి బ్రిలియంట్ .అన్నిటా ఫస్ట్ గా ఉండేవాడు .ఆ తర్వాత ఆతను బి టెక్ పాసై మంచి ఉద్యోగం సాధించాడని రత్తయ్య గారేప్పుడో కనిపించి చెప్పారు .రత్తయ్య గారు తాడిగడప లో సెటిల్ అయ్యారు .మా రెండవ కోడలు శ్రీమతి ఇందిరా వాళ్ళ తాతయ్యది అదే వూరు .ఒక సారి ఆవూరు వెళ్ళినప్పుడు రత్తయ్య కనిపించి ఏంతో ఆత్మీయత చూపారు .నేను అడ్డాడ హెడ్ మాస్టారు గా పని చేసినప్పుడు అక్కడ పని చేసి రిటైర్ అయిన రత్తయ్యగారిని ఒక ఉపాధ్యాయ దినోత్సవం నాడు సన్మానించాం .
ఆత్కూరు లో నే రిటైర్ అయిన అర్జున రావు గారు అనే ఫిజికల్ సైన్స్ టీచర్ గారి పేరు వినటమే కాని ఎప్పుడూ చూడలేదు .ఆయనే ఒక సారి స్కూల్కు వచ్చి నన్ను పరిచయం చేసుకొని నా బోధనా విధానాన్ని చాలా మెచ్చుఒన్నారు .ఆయనే చాలా గొప్ప టీచర్ అలాంటి వారు నన్ను మెచ్చు కో వటం నా అదృష్టం . .తొమ్మిదో తరగతి కి రత్తయ్య గారి మనవడున్న సక్షన్ కు నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని .టెన్త్ నైంత్ లు ఫిజికల్ సైన్స్ బోధించేవాడిని .నా టీచింగ్ విధానం గురించి ఎప్పుడూ కామెంట్ చేయలేదు హెడ్ గారు .ఆయన బాగా గమనించేవారు .ప్రతివారితోనూ బిల్ అండ్ బెల్ గా వ్యవహ రించే వారు ఆయన నవ్వగా నేనెప్పుడూ చూసిన పాపాన పోలేదు నా విధి నిర్వహణా బిల్ అండ్ బెల్ గా నే జరిగిపోయింది .ఒక్కో సారి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిదయ్యేది . అందుకే ఆత్కూరు రావటం ఒక రకం గా ఇంటి నుండి రావటమే అయిణనా ఈ ప్రయాణం వగైరా చూస్తె ముందే చెప్పినట్లు నాపని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది .అలాగే లాగిస్తున్నాను యెంత పని చేసినా హుషారు ఉండటం లేదు. స్వేచ్చ ఉన్నట్లనిపించటం లేదు అంత రిజర్వేడ్ వాతావరణం లో పని చేయటం నా స్వభావానికి పూర్తిగా విరుద్ధం . ఇక్కడ ఉండాలనే కోరికా లేదు .ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్తితి .వార్షికయా పరీక్షలై పోయి పేపర్లు దిద్ది మారర్కుల లిస్టు లు హాన్దోవర్ చేశాను.నిశ్చింతగా ఉన్నా మనసులో ఏదో అందోళన . ఏప్రిల్ ఇరవై మూడోతేదీ తో స్కూల్ వర్కింగ్ డేస్ అయిపోయింది .ఆత్కూరు లో మెటర్నిటీ లీవ్ పెట్టిన ఆవిడ జాయింగ్ పెర్మిషన్ కోరిందట ఆమెను ఆత్కూరులో నాపోస్ట్ లో మళ్ళీ వేసి నన్ను జగ్గయ్య పేట దగ్గరున్న గండ్రాయి హైస్కూల్ కు అక్కడ జిల్లాలోనే జూనియర్ మోస్ట్ గా పని చేస్తున్న ఒక లేడీ సైన్స్ అసిస్టంట్ ను హూస్ట్ చేసి నన్ను అందులో వేశారు .కను ఆత్కూరు హెడ్మాస్టారుకార్డ్ర్ద్ ద్వారా నాకు తెలియ జేసి నన్ను ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయమే రిలేవ్ చేసేశారు .వేసవి సెలవలు కనుక ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి లో చేరాలి .
ఆత్కూరు లో రిలీవింగ్ ఆర్డర్ తేసుకొవటానికి వెళ్లాను .హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారు చాలా సాదరం గా ఆహ్వానించి టిఫిన్ కాఫీ తెప్పించి ఇప్పించారు . సిన్సియారిటీని బోధనను మెచ్చుతూ మాట్లాడారు . అక్కడె ఉన్న ఆఫీస్ అసిస్టంట్ గా ఉన్న కుర్ర గుమాస్తా ఇది చూసి బోల్డు ఆశ్చర్య పోయి ,నేను హెడ్ దగ్గర వీడోలు తీసుకొని బయటివస్తుంటే ‘’మాస్టారు –నేను చాల ఏళ్ళుగా ఇక్కడే పని చేస్తున్నాను హెడ్ గారి శిష్యుడినికూడా .కాని నాకు తెలిసి నంతవరకు ఆయన ఏ టీచర్ కూ స్వయం గా కాఫీ ఇవ్వగా,మెచ్చుకాగా నేను చూడలేదు .మీరు చాలా అదృష్ట వంతులు ఆయనుకు మమీ పైన ఉన్న గౌరవానికి , మీ టీచింగ్ సామర్ధ్యానికి నిదర్శనం ‘’అని ఏంతో సంబర పడ్డాడు .ఆతను ఈ ఊరికి దగ్గరలోనే ఏలూరు దారిలో ఉన్న ఊరివాడు చాలా మంచివాడు .అలా ఆళ్ళ కోటేశ్వర రావు గారి అభిమానాన్ని పొందాను .

