గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63

98-  బహు భాషావేత్త-అభినవ కాళిదాసు  పండిత భట్ట మధురానాధ శాస్త్రి

23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు  చెందిన అనేక  సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర వేత్త ,బహు భాషా శాస్త్రజ్ఞుడు .ఆధునిక సంస్కృత కవుల్లో ప్రాచీన ,నవీన రచనలు చేసిన మేధావి .సంస్కృతం లో అనేక ప్రక్రియలను పరిచయం చేసిన ప్రయోగ శీలి .యాత్రా సాహిత్యం ,రేడియో నాటికలు ,వ్యాసాలూ చిన్నకధలు మొదలైనవి రాసి కొత్త ఒరవడి సృస్టిం చాడు .గజల్ ల తో సహా టుమ్రీలు ,దర్దులు ,ద్రుపద లు అనేక  పాటలు రాసి మెప్పించిన కవి .వైవిధ్యం ఆయన సొత్తు .సంసృతం లో హిందీ ని ప్రాకృత వ్రజ భాషను చొప్పించిన మేటి .

బాల్యం విద్యాభ్యాసం

మదురా నాద శాస్త్రి జైపూర్ లో సాంప్రదాయ ‘’దేవర్షి కుటుంబం’’ లో జన్మించాడు .వీరిది తరతరాలుగా కవి పండిత కుటుంబం .వీరి పూర్వీకులు తెలంగాణా ప్రాంతం నుండి వచ్చి జైపూర్ లో ఉన్నారు.  గౌతమస గోత్రం ..కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన వారు .వీరి పూర్వీకుడు బావాజీ దీక్షితులు ఆంద్ర దేశం నుండి వారణాశికి వలస వచ్చి  ,ప్రయాగ ,రేవా బుండీ లలో నివాసం ఉన్నారు. వీరి వంశం లో ప్రసిద్ధులైన దేవర్షి కవి కళానిధి అనేసంస్కృత , , వ్రజ భాషా పండితకవిని సాదరం గా జైపూర్ సంస్థానానికి రాజా సవాయ్ జై  సింగ్ ఆహ్వానించి గౌరవించి ఆస్థానకవిని చేసి ‘’కళానిధి’’ బిరుదునిచ్చి సత్కరించాడు .ఈ వంశం వారే కృష్ణ భట్ట ,ద్వారకా  నాద భట్టు ,జగదీశ భట్టు వాసుదేవ భట్టు ,మండన భట్టు .వీరందరూ రాజస్తాన కవులే .ఈ దేవర్షి వంశం లో మధురా నాద భట్టు 23-3-1889న జైపూర్ లో జన్మించాడు .

ఉర్దూ ,పారశీక భాషల్లో మొదట విద్య నేర్చి మధురానాద శాస్త్రి తర్వాత వ్యాకరణం సంస్కృతం జైపూర్ మహా రాజా కాలేజి లో అభ్యసించాడు .1903లో వ్యాకరణం లో సర్వోత్క్రుస్ట శ్రేణిలోను,1906లో సంస్కృత ఉపాధ్యాయ పరీక్షలో మొదటి స్థానం సాధించ ఉత్తీర్ణుడైనాడు .1909లో సంస్కృత ఆచార్య పరీక్ష లో అద్వితీయమైన మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు . ఆయన విద్యా గురువులు ప్రసిద్ధులైన పండిత మధు సూదన ఓజా ,పండిత కాశీనాద్ శాస్త్రి ,పండిత గోపీనాద్ నాంగ్ల్యా ,లక్ష్మీ నాద శాస్త్రి ,హరి దత్తు ఝా ,శ్రీ కృష్ణ శాస్త్రి .మధురానాధుని సహ  విద్యార్ధులలో ప్రముఖులు వేద చూడామణి పండిత మోతీలాల్ శాస్త్రి ,మహా మహోపాధ్యాయ పండిత గిరిధర చతుర్వేది .వ్యాకరణ మార్తాండ పండిత లక్ష్మీ నాద శాస్త్రి ,లక్ష్మీ రాం స్వామి ,రాజ గురు పండిత చంద్ర దత్తు ఓజా ,పండిత సూర్య నారాయణ శర్మ ,పండిత గోపీ నాద కవిరాజ్ ,పండిత చంద్రాధర్ శర్మ గులేరి .

మధురానాధుడు మూడు సార్లు వివాహమాడాడు .1909లో రాజాస్థాన పురోహితుని కుమార్తే సావిత్రీ దేవిని పెళ్లి చేసుకొని ముగ్గురు సంతానాన్ని పొందాడు .వారు పసి తనం లోనే చనిపోయారు భార్య కూడా మరణించింది . తర్వాత మధురాదేవిని పెళ్లాడితే ఆమె ప్లేగు వ్యాధితో చనిపోతే తృతీయ వివాహం గా పండిత గోపీ కృష్ణ కుమార్తె రమాదేవిని వివాహం చేసుకొన్నాడు .ఈమెకు  నలుగురు –ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలూ  జన్మించారు .కుమారులు ,మనుమలు అందరూ ప్రసిద్ధ కవి పండితులైనారు .

ఉద్యోగం –రచన

1926 -31కాలం లో జైపూర్ మహా రాజా సంస్కృత విద్యాలయం లో ఉపాధ్యాయుడు గా మధురానాధుడు పని చేశాడు తర్వాత సంసృత అధ్యాపకునిగా ,సంస్కృత శాహాధ్యక్షునిగా సేవలందించాడు .ఉద్యోగం చేస్తూ ‘’సంస్కృత సుబోధిని ‘’అనే రెండు భాగాల పుస్తకం రచించాడు .పిమ్మట ‘’సులభ సంస్కృతం ‘’రాస్తే దానిని రాజస్థాన్ ప్రభుత్వం పాఠ్య గ్రంధం గా చేసింది .భట్టు కు మొదటి నుండి హిందీ మీదకూడా వల్లమాలిన అభిమానం ఉంది .ఆయన చొరవతో జైపూర్ మహా రాజా కాలేజి హిందీ సాహిత్య సమ్మేలన్ వారు నిర్వహించే హిందీ పరీక్షా కేంద్రమైంది .ఈ పరీక్షలు హాజరయ్యే వారీ ఒక గుడిలో సాయం కాలం ఉచితం గా క్లాసులు నిర్వహించి తరిఫీదు నిచ్చేవాడు .

శాస్త్రి పద్నాలుగవ ఏడు నుంచేసంసృతం హిందీలలో  రచనలు చేశాడు .చనిపోయే వరకు సాహిత్య రచన చేస్తూనే ఉన్నాడు .ఆయన సాహిత్యం లక్ష పేజీల వరకు  ఉంటుంది .సంస్కృతం లో –ఆదర్శ రమణి ,గాదా రత్న సముచ్చయం ,గీర్వాణ గిరా గౌరవం ,గోవింద వైభవం ,చషకం ,జయాపూర్వ విభవం ,ప్రబంధ పారిజాతం ,భాతి భావనో భగవాన్ ,భారత వైభవం ,మంజులా నాటికా,మొఘల సామ్రాజ్య సూత్రదార్ మాన్సింగ్ ,రస గంగాధరం పై ‘’సరళ ‘’పేరిట వ్యాఖ్యానం ,  సంస్కృత సుధా ,ధాతు ప్రయోగ పరిజ్ఞానం ,ఆర్య నామాది భాషా కావ్య కుంజ ,రస సిద్ధాంత ,వినోద్వాటిక,సంస్కృత కదా నికుమ్జ్ ,బిహాన్ స్తస్య కావ్యామ్చి ,కావ్య సిద్ధాంతం  ,స్తుతి కుసుమాంజలి ,రసగంగాధర సమీక్ష

అనేక సంస్కృత కావ్యాల ముద్రణకు సంపాదకత్వం వహించాడు .అందులో కాదంబరి, రసగంగాధారం  ,సంస్కృత గాదా సప్త శతి ,గీర్వాణ గిరా గౌరవం ,ప్రబంధ పారిజాతం ,మొదలైనవి .సంస్కృత పత్రికలైన ‘’సంసృత రత్నారం ‘’ ‘’భారతి ‘’లకు సంపాదకునిగా సేవ చేశాడు .

హిందీ భాషలో –శరణాగతి రహస్య ,వ్రజ్ కవితా

పాటలు –సంస్కృతం లో గజళ్ళు ,హిందూ స్తాని సాంప్రదాయ సంగీత కీర్తనలు ,టుమ్రీలు ద్రుపదలు ,దర్దాలు రాశాడు భారతీయ శాస్త్రీయ సంగీతం రవీంద్ర సంగీతాలు అంటే మహా ఇస్ట పడేవాడు

పురస్కారాలు

కవి శిరోమణి ,కవి సార్వ భౌమ సాహిత్య వారిది అనే బిరుదులూ పొంది వివిధ సంస్తలచేత సమ్మానింప బడ్డాడు .మధురానాద శాస్త్రి కున్న పరిజ్ఞానం చాలా తక్కువ మందికి మాత్రమె ఉందని విమర్శులు ముక్త కంఠంతో చెప్పారు .సంస్కృత సాహిత్యానికి నవీన సూర్యోదయం తెచ్చాడు .ఎన్నో ప్రక్రియలను ప్రవేశ పెట్టాడు .1930-60కాలాన్ని’’భట్ట యుగం ‘’అన్నారు అందుకే .ఉజ్జైన్ లోని కాళి దాస సమితి ‘’అఖిల భారత సంస్కృత సమ్మేళనం ‘’లోమధురానాద శాస్త్రిని ఆహ్వానించి ‘’కాళిదాస సమ్మాన్ ‘’పురస్కారాన్ని అందించి సత్కరించి ‘’అభినవ కాళిదాసు  ‘’బిరుదును ప్రదానం చేసింది . ఈయనపై అనేక  మంది పరిశోధనలు చేసి పి హెచ్ డి లు సాధించారు .

4-6-1964ణ 75 వ ఏట పండిత భట్ట మధురానాధ శాస్త్రి గుండెపోటుతో మరణించాడు .

మరో కవితో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-14-ఉయ్యూరు

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.