ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19
10-ఫియోడర్ డాస్టో విస్కీ –
జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్ డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల సాకారానికి ఆరాటం .భరించ లేని వేదన ,దాని సాఫల్యతకు నిరాశా పూరక పోరాటం .పుట్టిన నాటి నుండీ ఇదే తీరు .27 ఏళ్ళ వయసులో ఉరి శిక్ష ఆఖరి క్షణం లో రద్దు అయి మనకోసం బతికాడు .ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయితగా మిగిలాడు .
30-10-1821మాస్కోలో మురికి చిన్న పబ్లిక్ హాస్పిటల్ లో తండ్రి స్టాఫ్ ఫిజీషియన్ గ ఉన్న చోట ఏడుగురుసంతానం లో ఒకడుగా పుట్టాడు .బాల్యం లో పేదరికం ,జబ్బులు ,అకస్మాత్తు చావుల వార్తలే ప్రతి రోజూ వినేవాడు .తండ్రి తాగుడుకు విపరీతం గా బానిసై ఉద్యోగాన్ని పోగొట్టుకొంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి కొద్దో గొప్పో సంపాదించి కుటుంబాన్ని పోషించాడు ఎనిమిదో ఏటనే దాస్తోవిస్కి కి దుఖం, దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలిసింది .ఈ సమస్య బైబిల్ లోని నీతికద అతని జీవితాంతం గుర్తుండిపోయాయి .54 వ ఏట భార్యకు జాబు రాస్తూ ‘’బుక్ ఆఫ్ జాబ్ చదువుతున్నా .అది మళ్ళీ నాలో పాత దుఖం వేదన దుస్తితి జ్ఞప్తికి తెచ్చింది చదవటం ఆపేసి పుస్తకం పక్కన పారేసి పచార్లు చేశా .నా కన్నీళ్లు ధారాపాతం గా కురుస్తూనే ఉన్నాయి బలవంతం గా ఆపుకోగాలిగాను ఈ పుస్తకమే మొట్ట మొదటి సారిగా నన్ను ఆకర్షించి పట్టేసుకోన్నది ‘’అని రాశాడు .
16 ఏట సోదరుడు మైఖేల్ తో బాటు సెయింట్ పీటర్స్ బర్గ్ లోని మిలిటరీ ఇంజినీరింగ్ స్కూల్ లో చేరాడు నాలుగేళ్ళు చదివాడు. రోజూ కవాతు భరించలేకపోయాడు .ఖాళీ దొరికినప్పుడల్లా దొరికినన పుస్తక౦ చదివాడు పుష్కిన్ కవిత్వం పైనా ,బాల్జాక్ వచన రచన రచన మీదా విపరీత మైన అభిమానమేర్పడింది .బాల్జాక్ రచన ‘’యుజినీ గ్రాన్ డేట్ ‘’ను అనువదించాడు .20 కి ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు .కాని ఇంకో ఏడాది స్కూల్ లోనే చదివాడు .తర్వాత రెండేళ్ళు మిలిటరీ ఇంజినీరింగ్ లో తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చి చేశాడు .ఇంతలో తండ్రి హత్యకు గురైనాడు .జాగ్రత్త లేకపోవటం వలన సంపాదించిన డబ్బంతా వృధాగా ఖర్చు చేసేశాడు .బాల్జాక్ ను చదవటం వలన ‘’రష్యన్ హ్యూమన్ కామెడి ‘’రాయాలని కలలు కనేవాడు .ఆరు నెలలు కస్టపడి రాసి ‘’పూర్ ఫోక్ ‘’మొదటి నవల పూర్తిచేసి ప్రచురించాడు ..
మొదటినవలె అయినా అది బాగా అందర్నీ ఆకర్షించి నేక్రసోవ్ అనే విమర్శకుడు గోగోల్ తో సమానంగా రాశాడని కీర్తి౦చి ‘’ఇంతకీ నువ్వేమి రాశావో నీకైనా తెలుసా?’’అని ప్రశ్నించాడు .ఈ విషయాన్ని 30 ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని దాస్తోవిస్కి ‘’నా జీవితం లో దీనిని మించిన గొప్ప ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు ‘’అని చెప్పుకొన్నాడు .పూర్ ఫోక్ లో లో పాత్రలన్నీ ఉత్తరాలద్వారా విషయాలను ఆకలితో అలమటిస్తూ ,కొంచెం పాలు చిన్న రొట్టెముక్క తింటూ బతుకుతూ తెలియ జేస్తాయి .ఈ నవల ఇన్ స్టంట్ట్ సక్సెస్ సాధించటం తో రచయితగా పేరొచ్చింది .అధోజగత్ సహోదరుల జీవితాలే అతని కదా వస్తువులైనాయి .27 వయసులో మెలో డ్రామా జోడించి విషాదపాత్రలతో రెండోనవల మొదలుపెట్టాడు .కొన్నేళ్ళతర్వాత యువ రాడికల్స్ తో పరిచయమేర్పడి ఫోరియర్ రచనలు చదివి సోషలిజం గూర్చి వాళ్ళతో చర్చించాడు .1848 రష్యా విప్లవ కాలం లో ఇలాంటి చర్చలు దేశ ద్రోహ నేరం .దాస్తోవిస్కి తో పాటు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేసి పీటర్ అండ్ పాల్ ఫోర్ట్రెస్ లో బంధించి విచారించారు .ఉరి శిక్ష ఖాయం చేశారు .వద్య స్థలానికి ఒకరోక్కరినే తీసుకోనివేడుతున్నారు .శిక్ష ను చదివి వినిపించి ఒక్కొక్కరినే ఉరి తీస్తున్నారు .అందరిలో నిరాశా నిస్పృహా నిర్వేదం నిండి ఉన్నాయి .ఉరి తీయబదేవారి వరుసలో ఆరో వాడు దాస్తోవిస్కి .కళ్ళు మూసుకొన్నాడు .ఆ సంఘటన గురించి తరవాత రాస్తూ ‘’ఒక్క నిమిషమే నాకు బతికే కాలం మిగిలి ఉంది .ఒక తెల్ల గుడ్డముఖం పై కప్పారు .సైనికులు వెనక్కి వెళ్లి నిలబడ్డారు .ఇంతలో జార్ చక్రవర్తి మా అందరికి ప్రాణ భిక్ష పెట్టినట్లు వార్త చదివారు ‘’.ఉరి శిక్ష నాలుగేళ్ల సైబీరియా కఠిన జైలు శిక్షగా మార్చారు .ఇది ఒక వ్యక్తీ జీవితం లో అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశం .ఊహించలేనిది రానిది. అలా మృత్యు ముఖం నుండి డాస్తో విస్కీ బయటపడి ప్రపంచ ప్రఖ్యాత రచయిత అయ్యాడు .మనసులో పడిన ఈ మచ్చ జీవితాంతం మరచిపోలేదు ..
ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో సైబీరియా లో శిక్ష అనుభవించాడు .38 వయసులో మళ్ళీ సెయింట్ పీటర్స్ బర్గ్ చేరాడు సృజన జీవితం లో మూడవ వంతు ప్రవాసిగా గడిపిన దురదృష్ట వంతుడు దాస్తోవిస్కి .కోటార్గా,ఓంస్ నేర బందికానాలలో ఉండగా రాళ్ళు పగల కొట్టించారు ,రాళ్ళు మోయించారు .ఏ పుస్తకమూ చదవ నివ్వలేదు ఒక్క అక్షరం కూడా రాయనివ్వలేదు .ఒక్క బైబిల్ చదవటానికి మాత్రమే పర్మిషన్ ఉండేది .ఆ దుర్భర నరక వేదన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకొందాం ‘’eternally in chains ,eternally under guard,eternally behind bolts and bars and never alone !Total suppression of the mind –that was life in the fortress ‘’ఎన్నో భావాలు వచ్చేవి ఆవన్నీ వాహిక లేక ఇంకిపోయేవి .ఏదేదో రాయాలనిపించేది కాని రాయటానికి పేపర్ కూడా నిషేధమే .ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మూర్చ రోగం వచ్చింది .
జైలు నుంచి విడుదల చేశారుకాని సైబీరియన్ టౌన్ సెమి పాలటిన్ స్క్ కు చేరాడు .కొంత ఆరోగ్యం కుదిరింది .నాలుగేళ్ళు జన జీవితానికి దూరమై ఉన్నాడు బైబిల్ ఒక్కటే అతనికి ఊరట గా ఉండి దైవానికి దగ్గర చేసింది .రాడికల్ భావాలు మార్చుకొన్నాడు .ఆస్నేహితులకు దూరమైపోయాడు. ఆలోచనా విధానం లో పెద్ద మార్పు వచ్చింది .ప్రపంచాన్ని సోషలిజం ద్వారా ఉద్ధరిద్దామన్న భావన తొలగి పోయి౦దిమనసునుండి .మతానికి చేరువైపోయాడు .ప్రజలు నమ్మారుకనుక తానూ నమ్మాను అని చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

