శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది.
కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక భావనకు చేరువైనాడు. ఏదో అంతరంగ శక్తి ఆయనను తపం చేయుటకు ప్రోత్సహించింది. శమంతక పంచ తీర్థంలో నివాసం ఏర్పర్చుకొన్నాడు. ప్రతి రోజు ప్రాత: కాలంలో తపమాచరించిన తరువాత భూమిని ప్రతి రోజు నాగలితో దున్నేవాడు. నియమం తప్పక ప్రతిరోజు ఈ విధంగా చేసేవాడు. ఈ కురుమహారాజు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అనే అనుమానం దేవేంద్రుని మదిలో మొదలాడసాగింది. ఈ మహారాజు తన సింహాసనానికి ఎసరు పెట్టలేదు కదా అని తలచి కురు మహారాజును కలసినాడు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న తరువాత దేవేంద్రుడు మహారాజా మీరు ప్రతి రోజు భూమి దున్నుతూ తపం ఆచరిస్తున్నారు కదా. ఇదుకు ప్రత్యేకించి విశేషమైన కారణం కలదా అని ప్రశ్నించాడు.
అప్పుడు కురుమహారాజు అవును దేవేంద్రా అవును. ఈ క్షేత్ర సందర్శనంతోనే నా మనసు పులకించింది. అందుకని ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారు ఈ క్షేత్రంలో నివసించు వారు వారి మరణానంతరం వారికి స్వర్గ ప్రాప్తి కలుగుటకు తపం చేస్తున్నానని వివరిం చాడు. ఓస్‌ ఇంతేనా ఇంకా పదవికి ముప్పు వాటిల్లిందని అనుకున్నా హమ్మయ్యా అని మనసులోనే నిట్టూర్చి కురు మహారాజు వద్ద సెలవు తీసుకుని తన స్వర్గానికి బయలు దేరాడు.
ఒకసారి మాటల సందర్భంలో దేవ గురు బృహస్పతికి ఈ విషయం దేవేం ద్రుడు వివరించాడు. అప్పుడు బృహస్పతి ఇలా స్పందించినాడు మహారాజా దేవేంద్ర మీరు తక్షణమే కురుమహబుూరాజును కలవండి. ఎందుకంటే ఆయన కోరికను భగ వంతుడు అంగీకరిస్తే ఈ స్వర్గంలో నిలబడటానికి కూడా చోటు ఉండదు ఎందుకంటే ఆ క్షేత్రంలో సందర్శించిన వారు, ఆ క్షేత్రంలో నివసించినవారితో ఈ స్వర్గంలో నిండి పోతుంది. దేవ తలు వెతలు పడవచ్చు కనుక మీరు ఏదో విధంగా కురుమహారాజుతపం ఆపు చేయమని తెలిపి నాడు. దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చిన వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు. ఫలితంగా అమరావతి మనుగడ కష్టం కాగలదు. దేవతల సంఖ్య మిక్కుటంగా పెరిగి పోతుంది. పైగా భూలోకంలో నిర్వహించే యాగాలలో మాకు వచ్చే భాగం మృగ్యమవుతుంది. మా ఉనికి ప్రశ్నార్థకం అవు తుందని తెలియ చేయగా కురుమహారాజు తల పంకించెను. ఈ క్షేత్రంలో నిద్రాహారాలు మాని తపం చేయదలచిన వారికి, యుద్ధంలో వీర మరణం పొందిన వారికి స్వర్గప్రాప్తి కలిగేటట్లు నేను వరం ఇవ్వగలవాడను అని తెలియ చేసెను. కురుమహారాజు ఆలోచించి తన సమ్మతిని తెలియ చేసెను. ఆనందపడిన దేవేంద్రుడు మహారాజా మీ విజ్ఞత ఎన్నదగినది అని ప్రశ్నిస్తూ మహారాజా నేటి నుండి ఈ శమంతక పంచక్షేత్రం కురుక్షేత్రంగా పిలువ బడుతుందని చెప్పి అక్కడ నుండి నిష్క్రమించినాడు. ఇంతటి మహిమ గల ప్రదేశం అవటం వల్ల ఈ ప్రదేశం మహాభారత యుద్ధానికి వేదిక అయింది. మాన్యులైన ద్రోణుడు, భీష్ముడు, అభిమ న్యుడు వంటి వీరుల క్షత గాత్రిములతో తడిసిన నేల ఇది. ఈ క్షత్రెం సందర్శింనంత మాత్రం చేతనే వడలు పులకించునని అనేక మంది విజ్ఞుల అభి పాయం. ఇక్కడ యుద్ధం లో మరణించిన ప్రతి వీరుడు వీర స్వర్గమలంకరించినాడు.
దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చి వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.