సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, అలాంటప్పుడు స్వీయ ధర్మమేదో తెలుసుకోవడం అంత తేలిక కాదు కదా! మనస్సులో కోరికలు లేనివారు మాత్రమే తలవెంట్రుక వాసిలో గల ధర్మాన్ని తప్పకుండా ఈ లోకంలో చరించగలరు. ధర్మాన్ని అవలంభించడానికి మూడు దృక్పధాలు అవసరం. అసత్యం పలుకకుండుట, ఇతరుల భార్యలను పొందాలని కోరుకోవడం, మూడవది తమకు హాని చేయని వారిని హింసించడం. రామా! నీకు అసత్యమాడుతావన్న నింద లేనేలేదు. మీరంత వరకూ అసత్యమాడలేదు. ఇక ముందు అసత్యం నిశ్చయంగా పలుకవు. కావున రెండవ పాపం కూడా నిన్ను అంటదు. నన్ను తప్ప మీరు ఇంకెవ్వరినీ కన్నెత్తి చూడనైనా చూడలేదు. సీత చెప్పడం ఒక్క క్షణం ఆపింది. రాముడి వంక చూసింది. రాముడు చిరునవ్వు నవ్వాడు.
సీతతో ‘నీవు చెప్పదల్చుకుంది చెప్పు. సంకోచించకు, నేను వింటు న్నాను’ అన్నాడు. సీత ఎంతో సరళంగా చెప్పడం ప్రారం భించింది. ఇక మూడవ పాపం నీకు చుట్టుకుంటుందేమో నన్న భయం కలుగుతుంది. ఎందుకంటే నీవు ఈ అరణ్యంలోని ఋషుల ఎడల పక్షపాత వైఖరి అవలంభించి, నీకు ఏ విధంగానూ, ఎలాంటి హబుూనీ కలిగించని రాక్షసులతో పోరుకు సిద్ధమయ్యావు. ఇందుకేనా నీవు ధనుర్భానాలు చేతపట్టి అరణ్యానికి వచ్చావు. మనకు ఇకముందు కలుగబోయే దు:ఖానికి ఇది సంకేత మను కోనా? నాధా! మీరు అరణ్యంలో వున్న రాక్షసులందర్నీ హత మారుస్తానని మాట ఇచ్చినప్పటి నుండీ నాకు భయం భయంగా వుంది. నాలో ఆందోళన పెరుగుతూంది. ఇక మీరు ఈ అరణ్యంలో ముందుకుపోవడం నాకిష్టంలేదు. ఎందుకంటే మీరు రాక్షసులను చూడగానే వెంటనే ఆచరణలో పెట్టడం మీ నైజం. అగ్నిలో కట్టెలు వేస్తే అగ్నికి ఇంకా బలం చేకూరినట్లుగా, ధనుర్భాణాలు క్షత్రియుని అతిశయాన్ని ఇంకా ఇనుమడింప జేస్తాయి. రామా! నేనిలా మాట్లాడటం నీయందు గౌరవం లేకకాదు. నీకు ధర్మాన్ని బోధించాలని కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నది సరైనదో కాదోనని, నీవు తాపస వేషం ధరించావు. ఆ వేషానికి తగ్గట్లే నీవు నివసించాలి. నీకు ఆగ్రహం కలిగించితే తప్ప మీరు రాక్షసులను సైతం హతమార్చడం సరైనది కాదు. తిరిగి మనం అయోధ్యకు పోయిన తర్వాత, క్షత్రియ ధర్మాన్ని అనుసరించవచ్చును. ధర్మ సారమే ఈ లోకం. ధర్మమే అన్ని పురుషార్థాలనూ ప్రసాదించి ప్రశాంతిని చేకూరుస్తుంది. ధర్మాన్ని తప్పక నడుచుకునే వారికి అన్నీ లభిస్తాయి. రామా! నీవేమి చేయాలో చెప్పుతున్నందుకు నన్ను క్షమించు. ఏమీ జరుగుతుందో నన్న భయం స్త్రీలకు సహజంగా వుంటుందని తెలుసుకదా! ఆభయమే నన్ను ఈ విధంగా మాట్లాడేలా చేస్తున్నది. నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.
వారు సన్యాసి వేషాలు ధరించి, భోగ భాగ్యా లన్నింటినీ త్యజించి తపస్సు చేసుకోడానికి మాత్రమే ఇక్కడకు వచ్చారు. రాక్షసులు వీరిని వేధిస్తూ, భక్షిస్తున్నారు. రాక్షసుల మూలంగా వీరి ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లింది.వారు నన్ను రక్షణ కల్పించమని కోరగా, వారికి సరేనని మాట ఇచ్చాను. తపస్సు అంటే చాలా కఠినమైనది. అలాంటి తపస్సును వారంతా చేస్తుంటే, వారి నమ్మకాన్ని నేను ఎలా వమ్ముచేయడం చెప్పు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, నా ప్రాణాన్నీ, లక్ష్మణునిగానీ, నిన్ను సైతం పోగొట్టు కోవడా నికైనా వెనుకాడను. అసలు అడగక పోయినా, క్షత్రియుడిగా నా అంతట నేనే వారిని రక్షించాల్సి వుంది.
సీతా! నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నాకు ఎంతో ఆనందం వేస్తున్నది. ఇతరుల క్షేమాన్నీ, శ్రేయస్సునూ కోరేవారే హితాన్ని ఉపదేశిస్తారు. నాశ్రేయస్సు కోరి నీవు నీ జన్మను సార్థకం చేసుకున్నావు. ఈ దండకారణ్యంలో నివసించే వారికి సుఖమూ, భద్రతా కల్పించేందుకే నిర్ణయించాను అంటూ సీతారామ వ్యవస్థకు ఆదర్శ దంపతులుగా మనకు దర్శనమిస్తారు సీతారామ చంద్రులు. యుగాలుగా గడిచినా నేటికీ వివాహం అనగానే సీతారామ కల్యాణమే ఆదర్శంగా హిందూ వ్యవస్థ కొనసాగుతూ వుంది. కల్యాణ వేదికపై చేసుకున్న బాసలను జీవితాంతం నిలుపు కోవాల్సి వుంది.
ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించు కుంటూ ముందుకు సాగాలని ఈ రామా యణం లోని అరణ్యకాండలో ఆ దంపతులు లోకానికి చక్కటి సందేశాన్నందించారు.
నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే
ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి
ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.