సహృదయ స్పందన
డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం
గబ్బిట వంశ యశస్సును శాశ్వతం చేసి
శ్రీ దుర్గాప్రసాద్ గారికి
భాష సంస్కృతీ ,సభ్యత గల తెలుగు జాతి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు?
‘’దర్శనీయ దేవాలయాలు ‘’పేరిడి
మా మనస్సును ,చిత్తాన్ని ఆ దేవ సన్నిధిలో నిలిపారు
‘’శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం ‘’ద్వారా
స్వామి మహత్తు ,ఆత్మ విశ్వాసం ,ఆధ్యాత్మిక అనుభూతి మిగిల్చారు
‘’మహిళా మాణిక్యాలు ‘’లో
ఏ స్త్రీ వాద రచయిత్రీ చూప లేని నిబద్ధత వ్యక్త పరిచారు
‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’లో
ఆయా కవుల ఆత్మ శోధన ,భావ వ్యక్తీకరణ
చారిత్రిక ,సాంస్కృతిక నేపధ్యాన్ని ఆవిష్కరించారు
ఇక ఈ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’
ఈ జాతికి మీరిచ్చిన అపురూప కానుక
ఆది శంకరుల వారితో ప్రారంభించిన
మీ ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’
సంక్షిప్త విజ్ఞాన సర్వస్వం .
సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీ పట్నం -2-4-15

