సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా ఉన్నాయని ”ముఖ చిత్రం అద్భుతం”గా ఉందని ,పేజీలలోని బాక్సులు కట్టిన తీరు బాగాలేదని క్షుణ్ణంగా అధ్యయనం చేసినిర్మొహమాటం గా పేజీ వరుసలో వివరంగా చూపి 8 పేజీల సుదీర్ఘ ఉత్తరం రాసి” వెలుగులు వెదజల్లిన సమీక్ష” ఈ రోజే అందింది . అందులోని విషయాలను మీ అందరికి తెలియ జేసుకొనటానికి వీలుగా దీనితో” అటాచ్” చేస్తున్నాను .చూడండి .ఒక మహా సంస్కృత విద్వాంసుని చేతిలో గీర్వాణ గ్రంధం పడి అందులోని మెరుగులను తరుగులను అందరి దృష్టిలోకి తెచ్చినందుకు శ్రీ సాయిబాబా గారికి కృతజ్ఞతలు తెలియ జేసు కొంటున్నాను .వారి సహృదయతకు క్రుతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను

వారు అన్నట్లు అతి త్వరలో అంటే రెండు నెలలలో గ్రంధం ముద్రణ జరగటం ,చివరి స్టేజిలో మరొక్క సారి తప్పులు దిద్దే అవకాశం కలగక పోవటం వలన ముద్రా రాక్షసాలు దొర్లాయి దీనికి పూర్తీ బాధ్యతనాదే. గ్రన్ధమ్ లోని విషయం లో నేను పడిన పొరబాట్లు నా దృష్టికి తేవటం సాయిబాబాగారు చేసిన మహోపకారం అవి తప్పని సరిగా దిద్దుబాటు చేసుకోవాల్సినవి .ఇదీ నాదే బాధ్యత.

మొదటివ్యాసం శ్రీ శంకరాచార్యుల వారిది అక్కడేవెంటనే రిపీట్ అయింది అదీ నా దోషమే .వీటి నన్నిటి కీ బాధ్యత వహిస్తున్నాను శ్రీ సాయిబాబా గారి ఆత్మీయతకు మరొక్క సారి పొంగిపోతూ నా కృతజ్ఞతను తెలియ జేసుకొంటు న్నాను .వారు సూచించి రిఫరెన్స్ గ్రంధాలను వీలయితే సేకరించి మరొక సారి కవుల రచనలపై ,కాలం పై ద్రుష్టి పెడతాను .ఇంకా రాయాల్సిన కవుల గురించి రాసే ప్రయత్నమూ చేస్తాను.వారి సమీక్ష నాకు గొప్ప ప్రోత్సహాన్నిచ్చిందని మనస్పూర్తిగా తెలియ జేసు కొంటున్నాను -దుర్గాప్రసాద్ -8-4-15-రాత్రి 10-30
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D