పుస్తకం !!
పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం !
పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం !
వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం !
పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం !
పరి రక్షించు పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని !
దశ దానాలలో మిన్న పుస్తక దానం !
క్షరం కాని జీవనానికి సాక్ష్యం అక్షర మైన పుస్తకం !
ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం !!

