’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4
అమెరికా ప్రయాణం –ఇంగ్లీష్ ఆయన సాయం
అమెరికా ప్రయాణం అంటే అంత ‘’వీజీ కాదు ‘’.ఇంటినుంచి మద్రాస్ చేరిన రామయ్యగారు ఇదివరకే కలిసిన ఇంగ్లీష్ ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు .రామయ్యగారికి అన్నిటికంటే ఉన్న విద్యా తృష్ణ కు ముచ్చటపడ్డారు .ఆయన స్పష్టంగా అర్హత ఉన్నవాడు తప్పక విజయం పొండుతాడనే నమ్మకం లేదన్నారు .రామయ్యగారి వద్ద ఉండాల్సినంత డబ్బు లేదని తెలిసింది ఆయనకు .కనుక ‘’గర్వం గుర్రానికి’’ కళ్ళెం వేయాలని చెప్పాడు .పులి అవతారం ఎత్తేదాకా జాగ్రత్తపడాలని గుంటనక్కలు ఎప్పుడూ చీకట్లో కనిపించకుండా వెటాడతాయని జాగ్రత్తలు చెప్పారు .నిర్మొహమాటంగా తానేమీ రామయ్యగారి తరఫున వకాల్తా పుచ్చుకోనేవాడిని కానని ,దానగుణం తనకు లేదని తానూ బ్రిటిష్ వాడినని ,తన పూర్వీకులు సేల్ట్ లను ఓడించిన మొనగాళ్ళని ,తన తాత బెంగాల్ ,మద్రాస్ లను లోబరచుకొన్న లార్డ్ క్లైవ్ సహచరుడని ,అయినా తానూ రామయ్య గారికి ఎందుకు సాయం చేస్తున్నాడంటే తనకు ఆ సామర్ధ్యం ఉండటం వల్లనేనన్నాడు .బెంగాల్ వికసిన్చినట్లే ఇప్పుడు మద్రాస్ కూడా అభివ్రుద్ధిమార్గం లో ఉందని కనుక నాగరికతా విస్తరణలో తనకు ఆనందం ఉందని అన్నాడు .ఒకప్పుడు పకడ్బందీ గా సాగు వ్యవస్థ బెంగాల్ లో ఉండేదని ఈ మధ్య అక్కడికి వెళ్లి చూస్తె అంతా దరిద్రం తాండ విస్తున్నట్లు కనిపించి గుండె చెరురువైన్దన్నాడు. హిందువులను ఏడిపించే ఇంగ్లీష్ వాడికి శాపం తగుల్తుందని ,అందుకే ఈ కొంచెం సాయం చేస్తున్నానన్నాడు
యువభారత్ లో కొత్త యుగం వస్తుందని చెప్పాడు .కొత్త విషయాలెన్నో వచ్చి తలుపు తడతాయన్నాడు .వాటి ఫలితాలను ఎవరు ఎక్కడ ఉన్నా అందుకోవాలి .అలా మేము చేయలేకపోతే వారిని నాశనం చేసిన వాళ్ళం అని పించుకోవాల్సి వస్తుంది .’’నువ్వు నా తలుపు తట్టడం నూతన భారతం నా ఇంటి తలుపు తట్టినట్లుగా అనిపిస్తోంది .నీకు సహాయం చేయటానికి మరో కారణం’’ నువ్వు నాకు నచ్చావ్’’ .’’అని అభినందించి సిఫార్సు ఉత్తరాలు అందజేశాడు రామయ్య గారికి .
ఈ సంఘటన తర్వాత రామయ్య గారు మనసులో కొంత మధన పడ్డారు .తాను ఈ ఇంగ్లీష్ వాడి దగ్గరకు ఎందుకు బిచ్చం కోసం వచ్చానా అని వితర్కి౦చు కొన్నారు .కాదని సమాధాన పడ్డారు .ఆయన చాలా నిర్మోహ మాటం గా నిర్దుష్టం గా నిష్కర్ష గా చెప్పినవన్నీ సత్యాలే .ఆయనలో మంచితనం కనిపించింది .దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆయనకు తెలుసునని వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ఆయన కోరికగా అర్ధం చేసుకొన్నారు .సమస్యలను సామరస్యం తో సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఆ ఇంగ్లీష్ ఆయన తత్త్వం గా అర్ధం చేసుకొన్నారు .తాను ఏమీ తప్పు చేయలేదని తన మార్గం రాజమార్గమేనని నమ్మకం కలిగింది .ఈ బ్రిటిష్ వాడు గర్వాన్ని వదిలేసి చాలా వినమ్రంగా ఉండటం రామయ్యగారిని బాగా ఆకర్షించింది .ఒకప్పుడు తండ్రిగారు తనను ఇంగ్లీష్ యూని వర్సిటీలో ఏమి చదువుకొంటావు అని ప్రశ్నిస్తే తాను ఠక్కున కేమిస్త్రి, ఫిజిక్స్ ,గణితం అని జవాబు చెప్పిన మాట గుర్తుకొచ్చింది .హూణులకు అంతటి విజ్ఞానం ఉందా అని తండ్రి ఆశ్చర్య పోయారట .
ప్రయాణ సన్నాహం
ఇప్పటిదాకా ఉన్నమద్రాస్ జీవితం తనకు జాతి వివక్షత గురించి మంచి చెడులగురించి పాఠాలు బోధించింది . ఒక రోజు ఓడరేవు దగ్గర కొందరు మాట్లాడు కొంటు౦డగా దగ్గరకు వెళ్లి విన్నాడు .అందులో ఒక బ్రాహ్మణపండితుడు ,తెల్లవాళ్ళు ,మాల్గాసీ ,మొదలైన వారున్నారు. ఆ పండిట్ మిగిలిన వారితో కలిసి బీరు కొడుతున్నాడు. అయితే వారు భేదభావం లేకుండా ఉన్నారని అర్ధమయ్యింది .ఇలా చూడటం ఇదే జీవితం లో మొదటిసారి .అందరూ ఒకే కప్పుతో మందు కొడుతున్నారు .ఇంక ఎక్కడి డిగ్నటి ?అనిపించింది .
టీచర్ గారి జ్ఞాన బోధ
అక్కడ ఒక టీచర్ కూడా ఉన్నాడు .రామయ్యగారు అతనితో తన అమెరికా ప్రయాణం గురించి చెప్పుకొన్నారు .ఈయన ఏర్పాట్ల గురించి ఆయన తెలుసుకొన్నాడు .’’నాయనా నీ దగ్గర గౌరవం గా ఓడలో ప్రయాణం చేసేంత డబ్బు ఉన్నట్లు లేదు .ప్రయాణం చేయటమేకాడు నాయనా లంచాలివ్వటానికి ,పోలీసులనుంచి, కాపాడుకోవటానికి డబ్బుకూడా సంపాదించుకోవాలి .ఒక ఉపాయం ఉంది చెబుతాను .నేను నావ కెప్టెన్ తో మాట్లాడి ,నీతో కొంత పని చేయించుకొంటూ తీసుకొని వెళ్ళమని నచ్చ చెబుతాను .అలా అమెరికా చేరుకోవచ్చు .ఏదో డబ్బు విపరీతంగా వచ్చి మీద పడుతుంది అని అనుకోవద్దు .అమెరికాలో కూడా నిన్ను విదేశీయుడిగానే చూస్తారు .ఇంగ్లీష్ వారికన్నా ‘’యాంకీలు ‘’పొడిచేసిన్దేమీలేదు .ఒక విషయం గుర్తుంచుకోబాబు ! ప్రజలు కులాల వలన ,రంగు వల్లవిభజింప బడలేదు తెలుసా ?వాలెట్ అంటే జోలె వల్లనే విడగొట్ట బడతారు అని నీతి బోధ చేశాడు .ఇతర ప్రయాణీకులతో కలిసి మెలిసి ఉండు .తెల్ల వారందరూ శత్రువులు కాదు , నీజాతి వాళ్ళంతా మంచి వారూకాదు అని తెలుసుకో ముందు .కాళీమాత దయ తో ఏదో కొంత సంపాదించుకో .’’అన్నాడు .
పౌరుషం పొడుచుకొచ్చింది రామయ్యగారికి ‘’నా దగ్గర రెండు వేలరూపాయలున్నాయి నాకు దేవుడిమీద నమ్మకం లేదు తెలుసా ?’’అన్నారు గర్వంగా .అప్పుడాయన నవ్వి మంచిదేనని తనను గురించి అంత గొప్పగా ఊహించుకోవద్దని ,బుర్ర ,కాళ్ళు చేతులు సరిగా ఉపయోగించమని చెప్పాడు. స్నేహితులు లేకుండా కూడా రాణించలేవు అనీ అన్నాడు .అక్కడ అమెరికాలో వాళ్ళ ముందు శాకాహారం తో ఉండగలనా అని ప్రశ్నించారు రామయ్య .అప్పుడాయన ‘’ఇండియా వదిలి వేడుతున్నావు అంటే విశాల హృదయం తో ఆలోచించటం ,ప్రవర్తించటం నేర్చుకో .బృహదారణ్యక లోను ఋగ్వేదం లోను మాంస భక్షణ ఉందన్నాడు .బియ్యం ఉడికిస్తే జీవాన్ని చంపెసినట్లే అలాగే బీఫ్ తినటం కూడా అన్నాడు ఈ మాటలు రామయ్య గారిని ఆశ్చర్య చకితుల్ని చేశాయి .మళ్ళీ ఆ టీచర్ ‘’నువ్వు మనుషుల మధ్య జీవిస్తున్నావని గ్రహించు ‘’అన్నాడు .ఇన్ని విరుద్దాల మధ్య ఎటూ తేల్చుకోలేక పోయారు ఆ క్షణాన .
మోసం గురో
ఆ టీచర్ మర్చంట్ షిప్ కెప్టెన్ తో రామయ్యగారికి ముందే చెప్పినట్లు మాట్లాడి ఒప్పించి ఎక్కిన్చుకోనేట్లు చేశాడు .తనదగ్గరున్న డాలర్లను జాగ్రత్త చేసుకోమన్నాడు .ఇక్కడే రామయ్యగారు పప్పులో కాలేశారు .కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద తనలాగే అభిరుచిబాగా ఉన్న ఒక స్టూడెంట్ కూడా తనతో వస్తానంటే సరేనన్నారు .అతడు ఇతరులతో రామయ్యగారు సంభాషించే అణువులు ,వాటి మార్పులు వగైరా వాటిని వినేవాడు. ఆసక్తి చూపేవాడు ఆతను మలబారీ వాడు గోవాలో పెరిగాడు . కాని అతనికుటుంబం శ్రీలంక లో ఉంది. ఆతను .కేధలిక్ క్రిస్టియన్ .మద్రాస్ లోని సాన్ తోమే చర్చ్ నుండి యూవివర్సిటిలో చేరినవాడు .చాందస సభావాలు బాగా ఉన్న మలయాళీ అతను .ఆ భాష అంటే రామయ్యగారికి సంగీతం విన్నంత హాయి అనిపిస్తుంది .అ భాష నేర్చుకోవాలని కూడా అనుకొన్నారు .తాను కొలంబో లో ఎక్కుతానని చెప్పి రామయ్యగారి దగ్గరున్న రెండు వేల రూపాయలను డాలర్లుగా మార్చుకు వస్తానని చెప్పి వెళ్ళాడు .యెంత సేపు చూసినా తిరిగి రాలేదు .అప్పుడు పోర్ట్ లో టీచర్ చెప్పిన ‘’తెల్లవారంతా శత్రువులుకాదు ,నీవారందరూ స్నేహితులూ కారు’’ అన్నమాట గుర్తుకొచ్చింది .వాడు జంప్ జిలానీ .యూని వర్సిటీలోను , కేథలిక్ మిషన్ దగ్గారా వెతికారు. ఎక్కడా మళ్ళీ కనిపిస్తే ఒట్టు .ఈ విషయం టీచర్ కు తెలియ జేశారు .ఆయన స్నేహితులనుండి కొలంబో వరకు సరిపడా టికెట్ డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు .అక్కడ బహుశా ఆ మలబారీ వాడు కనపడవచ్చని రామయ్యగారి షిప్ నే వాడూ ఎక్కవచ్చని కొంచెం ధైర్యం చెప్పాడు .రామయ్య గారికి ‘’బాన్ వాయెజ్ ‘’చెప్పటానికి ‘’’’నా అన్నయ్య’’ అనంత రామయ్య గారు వచ్చారు .ఇలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా రామయ్యగారు 1921 లో అమెరికా ప్రయాణానికి ఓడ ఎక్కారు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-15 –ఉయ్యూరు

