ఆస్తిక మహాశయులకు నమస్కారం,
మీ సంపూర్ణ సహాయ సహకారాలవల్ల శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు, ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు (ది 21-04-2015 న) హైదరాబాదు యందు విజయవంతంగా జరిగాయని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. సార్వజనీన సభలో భాగంగా బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారికి శ్రీ జనార్దానానంద సరస్వతీ పురస్కారప్రదానం జరిగింది. అలానే శ్రీ శిష్టి లక్ష్మీకుమారశాస్త్రి గారు, శ్రీతూములురు శాయినాథ శర్మ గారు, శ్రీ కుప్పా కృష్ణముర్తి గారు, శ్రీ పసుమర్తి బ్రహ్మానంద శర్మ గారు శ్రోతలనుద్దేశించి ప్రసంగించారు.
సభా కార్యక్రమ ఫోటోలు జతచేయటమైనది.
మీకు శ్రీ గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తూ ,
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేదవ్యాస పాఠశాల, +91-40-6444-8800

